మంత్రి బికినీ ఫొటో: నిందితుడు ఎన్నారై | NRI booked for posting Goa minister's picture in bikini on Facebook | Sakshi
Sakshi News home page

మంత్రి బికినీ ఫొటో: నిందితుడు ఎన్నారై

Published Wed, Jul 9 2014 1:41 PM | Last Updated on Fri, Aug 24 2018 5:25 PM

గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ (ఫైల్ ఫొటో) - Sakshi

గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ (ఫైల్ ఫొటో)

గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్లో పెట్టిన ఎన్నారై సవియో అల్మిడాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గోవా పోలీసులు బుధవారం వెల్లడించారు. గోవాకు చెందిన సవియో అమెరికాలో నివసిస్తున్నాడని తెలిపారు. గోవా బీచ్లు, నైట్ క్లబ్లలో బికినీలు నిషేధించాలంటూ ఇటీవల మంత్రి సుదీన్ దావలికర్ ఓ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 

మూడు క్లబ్లు, ఆరు బీచ్లతో అలరారే గోవా రాష్ట్రంలో బికినీలు నిషేధిస్తే ఎలా అంటూ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దాంతో సదరు మంత్రిగారు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై అమెరికాలో నివసిస్తున్న గోవాకు చెందిన సవియో ఆగ్రహాం కలిగించింది. దాంతో సుదీన్ పోటోలను మార్పింగ్ చేసి ఫేస్ బుక్లో పోస్ట్ చేశాడు. మంత్రి సుదీన్ ఫొటోలు ఫేస్బుక్లో హల్చల్ చేశాయి. దీంతో గోవాకు చెందిన ప్రదీప్ బక్లే అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో యూఎస్ లో నివసిస్తున్న సవియో నిందితుడని పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement