తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేసే క్రమంలో కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమ రాష్ట్ర సాగునీటి అవసరాలకు నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి అన్ని అధికారాలు కట్టబెడుతూ తీర్మానం చేశారు. మంగళవారం మధ్యాహ్నంలోగా తమిళనాడుకు నీటి విడుదలపై సమాచారమివ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో తీర్మానం తెచ్చారు. 4 కావేరి రిజర్వాయర్ల నుంచి తాగునీటికే నీటిని విడుదల చేయాలన్న గత తీర్మానంలో మార్పులు చేస్తూ... సాగునీటి అసవరాలకూ నీరివ్వొచ్చని తాజా తీర్మానంలో పేర్కొన్నారు.