తెలుగులో విడుదల కానున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ సూపర్‌ హిట్‌ చిత్రం | Puneeth Rajkumar Action Entertainer Civil Engineer Teaser Out Now | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar : పునీత్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సివిల్ ఇంజనీర్' టీజర్ విడుదల

Published Wed, Oct 5 2022 4:07 PM | Last Updated on Wed, Oct 5 2022 4:11 PM

Puneeth Rajkumar Action Entertainer Civil Engineer Teaser Out Now - Sakshi

కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రాల్లో చక్రవ్యూహ ఒకటి. శాండల్‌వుడ్‌లో భారీ కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు సివిల్‌ ఇంజినీర్‌గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అయితే సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో చందన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు మరియు దీనిని T.N.సూరిబాబు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement