తమిళసినిమా: కేజీఎఫ్ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్‌స్టర్ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment