సినిమాల్లో గొప్ప పేరు సంపాదించుకున్న నటీనటులు చాలా తక్కువ మందే ఉంటారు. కొందరికి ఫేమ్ వచ్చినా దాన్ని ఎక్కువకాలం కొనసాగించాలంటే అంతా ఈజీ కాదు. అప్పట్లోనే మంచి గుర్తింపు సాధించుకున్న నటీమణులు కొందరు ఊహించని పరిణామాలతో మనకు దూరమయ్యారు. అందంతో తెరపై ఆకట్టుకున్న కొందరు హీరోయిన్లు చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దురదృష్టవశాత్తు సినీ ఇండస్ట్రీ కోల్పోయిన ఆ స్టార్ హీరోయిన్ గురించి తెలుసుకుందాం.
(ఇది చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?)
సౌందర్య పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి తనదైన నటనతో మెప్పించింది. ప్రధానంగా వెంకటేశ్ జోడీగా సూపర్ హిట్ చిత్రాల్లో చేసింది. రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి విజయవంతమైన జోడీగా నిలిచారు. అంతే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించారు.
కాగా.. 1971 జూలై 18న కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగల్ గ్రామంలో జన్మించిన సౌందర్య విమాన ప్రమాదంలో మరణించారు. 2004లో ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారానికి వెళ్తండగా ఆమె ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. జూలై 18న మంగళవారం ఆమె 19వ జయంతి సందర్భంగా సౌందర్యను ఓసారి స్మరించుకుందాం.
పెళ్లై ఏడాది కాకముందే..
సౌందర్యం తన మేనమామ, బాల్య స్నేహితుడైన జీఎస్ రఘును 2003 ఏప్రిల్ 27న పెళ్లి చేసుకున్నారు. సామాజిక సేవలో ముందుండే సౌందర్య ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేపట్టింది. తన స్వగ్రామమైన ముళబాగల్ తాలూకాలోని గంగికుంటను అభివృద్ధి పరచారు. అయితే సౌందర్య, తన తమ్ముడు అమర్‌నాథ్ ప్రమాదంలో చనిపోయాక వారి కుటుంబ సభ్యులు నేరవేర్చారు. అమర సాత్విక సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' పేరుతో అమర సౌందర్య ఫౌండేషన్ స్కూల్‌ను బెంగళూరులో స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా మానసికంగా ఎదుగుదల లేని(ఆటిజం) పిల్లలకు విద్యనందిస్తున్నారు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఎంతో మంది విద్యార్థుల గుండెల్లో ఇంకా బతికే ఉంది.
చివరి కోరిక తీరకుండానే!
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు తన వదినను కాటన్ చీర, కుంకుమ తీసుకురమ్మని అడిగిందట.! అప్పుడు తన దగ్గర కాటన్ చీర లేకపోవడంతో ఒకటి కొని తీసుకురమ్మని కోరిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో ఆ చీర కట్టుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకుంది సౌందర్య. తనకు కుంకుమ ధరించడం అలవాటు, కాబట్టి దాన్ని కూడా తెమ్మని చెప్పింది. కానీ ఇంతలోనే సమయం కావస్తోందని విమానం ఎక్కేయడం, అది కూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే మరణించడం తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది సౌందర్య వదిన.
(ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు )
Comments
Please login to add a commentAdd a comment