కాంతార హీరోగా రిషబ్ శెట్టి కాదు.. ఫస్ట్ అనుకున్నది ఎవరంటే? | This Kannada superstar was first approached for Rishab Shetty Kantara | Sakshi
Sakshi News home page

Kantara Movie: కాంతార కోసం ఆయనను కలిశా.. కానీ కుదరదన్నారు: రిషబ్ శెట్టి

Published Tue, Sep 3 2024 9:27 PM | Last Updated on Wed, Sep 4 2024 9:40 AM

This Kannada superstar was first approached for Rishab Shetty Kantara

కాంతార మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్‌ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీకి మొదట హీరోగా తాను చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ చిత్రంలో శివ పాత్రను పోషించడానికి శెట్టి మొదటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు. రాజ్‌కుమార్‌కు ఈ స్క్రిప్ట్‌ను వినిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా విన్నారని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడని రిషబ్ వివరించారు. ఓ రోజు నాకు ఫోన్ చేసి నా కోసం ఎదురు చూస్తే సినిమా ఏడాది ఆలస్యం కావొచ్చని నాతో అన్నారని తెలిపారు. అయితే కన్నడ సూపర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ ఊహించని విధంగా అక్టోబర్ 29, 2021న బెంగళూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 

అయితే ఆయన మరణానికి రెండు రోజుల ముందు  కలుసుకున్నానని రిషబ్ గుర్తు చేసుకున్నారు. తన సినిమా కాంతార గురించి ఆయన ఆరా తీశారని చెప్పుకొచ్చారు. సినిమా పట్ల రాజీ పడవద్దని నాకు సూచించారు. షూట్‌కు సంబంధించిన కొన్ని  చిత్రాలను రాజ్‌కుమార్‌కు చూపించినట్లు వెల్లడించారు. ఫోటోలు చూసిన రాజ్‌కుమార్‌ చాలా సంతోషంగా వ్యక్తం చేశారని.. నీ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడని రిషబ్ శెట్టి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement