కన్నడ అవార్డుల బరిలో ఎన్టీఆర్ | NTR Nominated for Kannada Filmfare | Sakshi
Sakshi News home page

కన్నడ అవార్డుల బరిలో ఎన్టీఆర్

Published Thu, May 18 2017 2:19 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

కన్నడ అవార్డుల బరిలో ఎన్టీఆర్

కన్నడ అవార్డుల బరిలో ఎన్టీఆర్

హీరోలు గాయకుల అవతారం ఎత్తటం కామన్, అయితే అలా గాయకులుగా మారిన తారలు అవార్డు సాధించిన ఘటనలు చాలా అరుదు. అది కూడా పరాయి భాషల్లో పాట పాడి అవార్డు రేసు నిలవటం మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న జూనియర్ తొలిసారిగా గాయకుడిగా అవార్డు రేసులో నిలిచాడు. అది కూడా ఓ కన్నడ సినిమా కోసం పాడిన పాటకు గాను కన్నడ ఫిలిం ఫేర్ అవార్డ్స్ రేసులో నిలిచాడు జూనియర్.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చక్రవ్యూహ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడాడు. తమన్ సంగీత సారధ్యంలో గెలయా గెలయా అనే పాట పాడిన ఎన్టీఆర్ అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ పాట సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు ఫిలిం ఫేర్ అవార్డ్స్ రేసులోనే నిలిచింది. తొలిసారిగా గాయకుడిగా ఫిలిం ఫేర్స్ అవార్డ్స్ లో పోటి పడుతున్నాడు ఎన్టీఆర్. అవార్డు ఎవరికి వస్తుందన్న విషయం పక్కన పెడితే నటుడైన జూనియర్ గాయకుడిగా అది కూడా పరాయి భాషలో పోటి పడటం అరుదైన ఘనతగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement