Handsome looks
-
మహేశ్ బాబు అందం వెనకున్న సీక్రెట్ ఇదే..
మహేశ్ బాబు అంటే చాలామందికి గుర్తొచ్చేది అందం. నాలుగు పదుల వయసులో 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. ఇక ఆయనకున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయంటూ మెలికలు తిరిగిపోతుంటారు. ఆయన గ్లామర్ వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు.చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. ఇదే విషయాన్ని కొందరు ఇంటర్వ్యూల్లో ప్రశ్నించగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానంటూ బదులిచ్చారు మహేశ్. అంతేకాకుండా ప్రతిరోజు ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకుంటాను. జంక్‌ఫుడ్ జోలికి అసలు వెళ్లను. వీటితో పాటు ఎప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండటమే నా అందానికి అసలు సీక్రెట్. చిరునవ్వే నిజమైన అందం. అందుకే మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఏ తప్పూ చేయకపోవడం, భవిష్యత్తుల్లోనూ చెయ్యను అనే నమ్మకమే మనల్ని ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు మహేశ్. చదవండి: మహేశ్ బాబు మేనియా.. థియేటర్స్‌లో 'పోకిరి' రీసౌండ్ -
సూపర్ స్టార్ మహేశ్ గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఇదే..
సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసులో 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. సినిమా, సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ అంత హ్యండ్సమ్గా కనిపించడం రహస్యాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు బయటపెట్టారు. పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన సర్కారు వారి పాట మే12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్‌గా పనిచేసిన రామ్ –లక్ష్మణ్‌లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ఛార్మింగ్ లుక్ సీక్రెట్‌ను లీక్ చేశారు. “మహేష్ ఇంత అందంగా, కూల్ గా, ఛార్మింగ్ గా కనిపించడానికి కారణం ప్రతి రోజు ధ్యానం చేయడమే. ఆయన రోజూ మూన్ ద్యానం చేస్తారు. దీనివల్ల చాలా కూల్‌గా కనిపిస్తారు. ఈ మూన్ ధ్యానం వల్ల సుదీర్ఘ కాలంగా చేయడం వలన మహేష్ ఇంత ఛార్మింగ్‌గా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ యోగా, వర్కవుట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుంటారు. ఇదే ఆయన గ్లామర్‌కి సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు. -
నా దృష్టిలో అది నంబర్ మాత్రమే!
కొంతమందిని చూస్తుంటే వయసు పెరుగుతోందా? తరుగుతోందా అర్థం కాదు. మహేశ్‌బాబుని చూస్తే అలానే అనిపిస్తుంది. రోజుకీ రోజుకీ ఇంకా హ్యాండ్సమ్గా తయారవుతున్నారాయన. ఇంతకీ మహేశ్ వయసెంత? అని అడిగితే.. కన్ఫ్యూజన్లో చాలామంది తక్కువ చెప్పేస్తారు. నిజంగానే మహేశ్ వయసు గెస్ చేయలేం. అసలు ఆయన వయసు ఎంతంటే.. 40 ఏళ్ళు. ఆయన్ని చూసినవాళ్ళెవరైనా అంత వయస్సు ఉంటుందా అనుకోవడం సహజమే. ‘‘వయస్సు అనేది నా దృష్టిలో ఒక నంబర్ మాత్రమే. లోపల మనం ఎలా ఉన్నాం? అన్నదే ముఖ్యం. మీరు బయటకు ఎలా కనిపిస్తున్నారు? అనేది మీ మనస్సును బట్టే ఉంటుంది. ప్రస్తుతం నేను ‘హ్యాపీ స్పేస్’లో ఉన్నా. అదే బయటికి కనిపిస్తోంది’’ అని మహేశ్ అన్నారు. మామూలుగా హ్యాండ్సమ్గా ఉండే అబ్బా యిల్ని చూసినప్పుడు అలా ఉండడానికి వాళ్లేం చేస్తారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. ఇదే విషయం గురించి మహేశ్ దగ్గర ప్రస్తావిస్తూ... ‘మీ హ్యాండ్సమ్ లుక్స్ వెనక సీక్రెట్ చెబుతారా?’ అంటే... ‘‘ప్రతిరోజూ వర్కవుట్ చేస్తాను. ఆరోగ్యం మీద నాకు శ్రద్ధ ఎక్కువ. ఆహారం విషయంలో పద్ధతులు పాటిస్తా. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్.. ఇవి ఎంతవరకూ కావాలో అంతే తీసుకుంటాను. ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, ఆకుకూరలు బాగా తింటా’’ అన్నారు. ఇంతేనా... ఇంకా ఏమైనా సీక్రెట్స్ చెబితే బాగుండు కదా అంటే... ‘‘బాగా తినండి.. హాయిగా నిద్రపోండి.. ఫిట్‌గా ఉండండి’’ అంటూ షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండే తన పంచ్ డైలాగ్స్‌లా మహేశ్ చెప్పారు. అంతా బాగానే ఉంది.. సినిమాల్లో రంగు రంగుల చొక్కాల్లో కనిపించే మహేశ్ విడిగా మాత్రం పద్ధతిగా ఫార్మల్ షర్ట్స్‌లోనే కనిపిస్తారు. ఎందుకలా? ‘‘నాకు ఇలానే ఇష్టం. సింపుల్‌గా ఉంటే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. నా స్టైల్ మంత్ర ఏంటంటే... క్యాజువల్’’ అని సింపుల్‌గా అన్నారు. సింపుల్‌గా ఉన్నా భలే ఉంటారు బాసూ అంటే మహేశ్ ఎలా నవ్వుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది సరే.. సినిమాల్లో ఎప్పుడు చొక్కా విప్పుతారు? అనంటే.. ‘‘కథ డిమాండ్ చేస్తే.. అప్పుడలా కనిపిస్తానేమో’’ అన్నారు. ఫైనల్లీ... ‘మీలాంటి అందగాడికి ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు?’ అనే ప్రశ్న మహేశ్ ముందుంచితే - ‘‘ఆకర్షణ... చమత్కారం... తెలివితటేలు... ఈ మూడూ ఉండాలి’’ అన్నారు.