అంతా పాజిటివ్! | Shriya Revealed Her Beauty Secret | Sakshi
Sakshi News home page

అంతా పాజిటివ్!

Published Sun, Nov 29 2015 11:36 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అంతా పాజిటివ్! - Sakshi

అంతా పాజిటివ్!

 ‘‘పదేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడూ అలానే ఉన్నావ్.. ఏం చేస్తున్నావ్’’ అని చెక్కు చెదరని అందం, మంచి శరీరాకృతితో ఉండేవాళ్లను షేపులు మారిపోయినవాళ్లు అడగడం కామన్. శ్రీయను ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. పన్నెండేళ్ల క్రితం వెండితెరకు పరిచయమైనప్పుడు ఎంత సన్నగా ఉన్నారో ఇప్పుడూ ఆమె అలానే ఉన్నారు. బహుశా కడుపు మాడ్చుకుంటారేమో అనుకుంటే పొరపాటే. నచ్చివన్నీ హాయిగా లాగించేస్తారు. మరి.. కత్తిలాంటి శ్రీయ శరీరాకృతి వెనక ఉన్న రహస్యం ఏంటి? అంత అందంగా కనిపించడానికి ఆమె ఏం చేస్తారు?.. తెలుసుకుందాం.
 
 వర్కవుట్

 సినిమా హీరోయిన్ కాకముందు నుంచే శ్రీయ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు. వర్కవుట్స్ చేసేవారు. దాంతో ఫిట్‌నెస్ గురించి ఆమెకు మంచి అవగాహన ఉంది. రోజూ ఒకే రకం వ్యాయాయాలు చేయరు. ఒకరోజు కార్డియో ఎక్సర్‌సైజ్, మరుసటి రోజు స్విమ్మింగ్, ఆ మర్నాడు బ్యాడ్‌మింటన్‌లాంటి ఏదైనా గేమ్.. ఇలా రోజు మార్చి రోజు ఒక్కోటి చేస్తారు. వీటితో పాటు యోగా కంపల్సరీ. రోజూ కనీసం 45 నిముషాలైనా యోగా చేయడం శ్రీయ అలవాటు. ఆ 45 నిముషాల్లో రకరకాల ఆసనాలు వేస్తారు. ఫైనల్‌గా కాసేపు ధ్యానం చేస్తారు. చిన్నప్పుడు కథక్ నేర్చుకున్నారామె. అప్పుడప్పుడూ డ్యాన్స్ చేస్తుంటారు. అది కూడా మంచి వ్యాయామమే అంటారు శ్రీయ. వర్కవుట్స్‌లో భాగంగా శ్రీయ ఒక్కటి మాత్రం చేయనే చేయరు. అదే ‘వెయిట్ లిఫ్టింగ్’. అవి తనకు నప్పవని శ్రీయ ఫీలింగ్. అందుకే బరువులకు దూరంగా ఉంటారు.
 
 డైట్
 ట్రావెల్ చేసేటప్పుడు ఒక రకమైన డైట్, ఇంట్లో ఉన్నప్పుడు మరో రకమైన డైట్ తీసుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్‌తో శ్రీయ తన డైట్ మొదలుపెడతారు. బ్యాడ్ కొలస్ట్రాల్‌ను కట్ చేసే సామర్థ్యం ఆరెంజ్ జ్యూస్‌కి ఉందని అంటారు. ఆ తర్వాత ఎగ్ ైవైట్‌తో మసాలా ఆమ్లెట్ లేకపోతే దోసె తీసుకుంటారు. ఇవి రెండూ కాకపోతే పనీర్ పరోటా తింటారు. ప్రతి రెండు గంటలకోసారి ఏదో ఒకటి తినడం శ్రీయ అలవాటు. ఆమె తల్లి శెనగలతో రుచికరమైన కట్‌లెట్స్ తయారు చేస్తారట. అవి ఆరోగ్యానికి మంచిదని శ్రీయ చెబుతారు. ఇంట్లో ఉన్నప్పుడు ఈ కట్‌లెట్స్ కంపల్సరీ. లంచ్, డిన్నర్‌కు అమ్మ ఏది చేసి పెడితే అది తింటానంటున్నారు. శ్రీయకు డార్క్ చాక్లెట్ ఇష్టం. ఫ్రిడ్జ్‌లో అవి ఉండేలా చూసుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు లాగించేస్తారు. అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నప్పుడు మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్, డ్రై ఫ్రూట్స్ మిక్స్‌ను పాలల్లో కలిపి తింటారు. లంచ్‌కు రోటీలు, గ్రిల్డ్ ఫిష్ లేక చికెన్ తీసుకుంటారు. సాయంత్రం సలాడ్స్ తింటారు. డిన్నర్‌లో తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకుంటారు. రాత్రి ఎనిమిది లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారు. అదే ఆరోగ్యానికి మంచిదని అంటారామె.
 
 బ్యూటీ టిప్స్
 రోజ్ వాటర్ చాలా మంచిదని శ్రీయ అంటారు. రోజు మొత్తంలో నాలుగైదు సార్లు రోజ్ వాటర్‌తో మొహం కడుక్కుంటారు. ఆ నీళ్లల్లో గ్లిజరిన్ కలుపుకుని కడక్కుంటే ఫేస్ బాగా క్లీన్ అవుతుందని అంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం శెనగపిండి, పసుపు, పెరుగు కలిపి ఫేస్‌ప్యాక్‌లా పెట్టుకుంటారు. మార్కెట్లో లభించే సౌందర్య సాధనాలన్నింటికన్నా ఇదే బెస్ట్ అంటారామె. శ్రీయకు ముంబయ్‌లో సొంత స్పా ఉంది. అప్పుడప్పుడు అక్కడికెళ్లి బాడీ మసాజ్ చేయించుకుంటారు. బాడీ రిలాక్స్ కావడానికి మసాజ్ మంచి పద్ధతి అని సలహా ఇస్తున్నారామె. బయటికి అందంగా కనిపించాలంటే లోపల ఆనందంగా ఉండాలని శ్రీయ అంటారు. అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉంటారు. దాదాపు కోపం రాదట. శ్రీయకు ఓ మేనల్లుడు ఉన్నాడు. పేరు ధ్రువ్. వీలు కుదిరినప్పుడల్లా ఈ బుడతడితో ఆడుకుంటారు. అప్పుడు చాలా రిఫ్రెష్ అయిపోతానంటున్నారు. నెగటివ్ ఫీలింగ్స్‌కి దగ్గరకు రానివ్వననీ, తన అందం, ఆరోగ్యానికి పాజిటివ్ మైండ్‌సెట్ కారణమని శ్రీయ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement