తరచూ స్టార్ హీరోయిన్ సమంతతో మాట్లాడుతుంటానని ఆసక్తికర విషయం చెప్పాడు హీరో, నాగ చైతన్య కజిన్ దగ్గుబాటి రానా. వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రానా ఇటీవల ఓ జాతీయ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను, పలువురు సినీ సెలబ్రెటీల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
చదవండి: సీఎం రేంజ్‌లో భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్
ఇందులో భాగంగా నాగ చైతన్య మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంతతో ఇప్పటికి తను కాంటాక్ట్‌లో ఉన్నానని చెప్పాడు. ‘సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్టు తెలిసిన వెంటనే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాను. అంతేకాదు వీలు కుదరినప్పుడల్ల సమంతతో మాట్లాడుతూనే ఉంటా. నటీనటులు తమకు ఉన్న సమస్యల గురించి బయటకు చెప్పాలా? లేదా? అనేది వారి వ్యక్తిగతం. అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఏదో ఓక సమస్య వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఎవరి లైఫ్ పూలా పాన్పులా ఉండదు.
చదవండి: ఆ వ్యక్తిని చాలా నమ్మాను, కానీ అతడు నా డబ్బు కాజేశాడు: నటి ఆవేదన
ఎలాంటి సమస్య అయినా దాన్ని నువ్వు ఎలా అధిగమిస్తావననేది ముఖ్యం. సమస్య వచ్చినప్పటికీ కంటే దాన్ని ఎదుర్కొని ముందు సాగడంలోనే ఆనందం ఉంది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. యాక్షన్, క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో రానా- విక్టరి వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రూపొందింది. ఇందులో బాలీవుడ్ నటీనటులు సుర్వీన్ చావ్లా ఆశిస్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment