
Samantha Special Birthday Wishes To Rana Daggubati, Post Goes Viral: నాగ చైతన్యతో విడాకుల అనంతరం జోరు పెంచిన సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో నిత్యం ఏదో ఒక రకంగా ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా రానా బర్త్‌డే(డిసెంబర్14) సందర్భంగా సమంత షేర్ చేసిన పోస్ట్ ప్రస్తతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.చదవండి: నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు చేయను: నాగ చైతన్య
'హ్యాపీ బర్త్‌డే రానా. నీకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటున్నా. శక్తివంతమైన, పెద్ద మనసు ఉన్నవాడివి నువ్వు. దేవుడికి ఇష్టమైనవాడివి' అంటూ సమంత తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన రానా..'థ్యాంక్యూ సో మచ్ రూత్' అంటూ కామెంట్ చేశారు.
నాగ చైతన్య- రానా బెస్ట్‌ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య బర్త్‌డేకు విషెస్ చెప్పని సమంత..రానా బర్త్‌డేకు మాత్రం విషెస్ చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా
హీరో కాకముందు రానా ఏం చేసేవాడో తెలుసా?