
‘‘కుటుంబంలోకి స్వాగతం మిహికా’’ అంటూ హీరోయిన్ సమంత అక్కినేని దగ్గుబాటి వారి కోడలు మిహికా బజాజ్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. రానా- మిహికాల వివాహ వేడుక సందర్భంగా కుటుంబమంతా ఒక్కచోట చేరి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. సురేశ్ బాబు, వెంకటేశ్ కుటుంబాలతో పాటు దగ్గుబాటి ఆడపడుచులు, సమంత- నాగ చైతన్య కలిసి ఉన్న ఫొటోకు ఇప్పటికే 16 లక్షలకు పైగా లైకులు రాగా.. ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. ఇక రానా- మిహికాల మెహందీ, వివాహ వేడుకలో సమంత ధరించిన అవుట్‌ఫిట్స్ ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. (రానా పెళ్లిసందడి)
పసుపు ఫంక్షన్‌లో ఎల్లో కలర్ డ్రెస్‌కు సీ షెల్ డిజైన్స్‌తో చేసిన నెక్‌పీస్ ధరించిన సామ్.. పెళ్లిలో బ్లూ కలర్ శారీకి లైట్ బ్లూ నెక్‌కాలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ మ్యాచ్ చేసి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సింపుల్ జువెలరీ, కొప్పు ముడితో యునిక్‌స్టైల్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సామ్ లుక్ సూపర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత భర్త నాగ చైతన్య.. వరుడు రానాకు మేనత్త కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఇక రానా- మిహికాల వివాహం రామానాయుడు స్టూడియోలో అతికొద్ది సన్నిహితుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ శనివారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment