‘‘సంక్లిష్టమైనపా త్రలు నన్ను ఆకర్షిస్తాయి. ‘రానా నాయుడు’లో నేను చేసిన నాగనాయుడు అలాంటిపా త్రే. నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నపా త్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ సంతృప్తిని ఇచ్చింది’’ అని హీరో వెంకటేష్ అన్నారు. కరణ్ అన్షుమాన్– సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘వెబ్ సిరీస్‌లో పని చేయడానికి, సినిమాలో చేయడానికి చాలా తేడా ఉంటుంది. వెబ్ సిరీస్‌లో కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి నాకు కొంత సమయం పట్టింది. ఇందులో నెగిటివ్‌పా త్రను పోషించడం నావరకూ రిఫ్రెషింగ్ చేంజ్. ‘రానా నాయుడు’లో మునుపెన్నడూ చూడనిపా త్రలో నన్ను చూస్తారు.
రానాకి ఎదురుగా నిలబడి వార్ చేయడం అంత సులువు కాదు.. నటుడిగా నాకిది ఒక సవాల్. నిజ జీవితంలో మేం బాబాయ్ అబ్బాయ్‌లా కాకుండా స్నేహితుల్లా ఉంటాం. కానీ తెరపై ఒకరంటే ఒకరికి పడని తండ్రీ కొడుకులుగా వార్ ఈక్వేషన్ తీసుకురావడం కష్టం అనిపించింది. ఇది కచ్చితంగా మా ఇద్దరికీ కొత్త ప్రయత్నం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment