Rana Naidu Web Series Created Record Viewership With Top 10 Position In Netflix - Sakshi
Sakshi News home page

Rana Naidu: నెగిటివ్ టాక్‌ వచ్చినా దూసుకుపోతున్న రానా నాయుడు..రీజన్ ఇదే!

Published Thu, Mar 16 2023 11:24 AM | Last Updated on Thu, Mar 16 2023 12:57 PM

Rana Naidu Create Record Viewership In Netflix - Sakshi

సినీ ప్రేక్షకులకి ఎప్పుడు ఏది నచ్చుతుందో...ఏది నచ్చదో చెప్పటం కష్టం. అలా ఒకరికి నచ్చనది ఇంకొరికి నచ్చుతుంది. మెజార్టీ ప్రేక్షకులకి నచ్చినదే ఫైనల్ రిజల్ట్ అవుతుంది.  ఈ విషయం రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో ప్రూవ్‌ అయింది. టాలీవుడ్ ఇంతవరకు ఏ అగ్రహీరోలు కానీ...స్టార్‌ హీరోలు కానీ వెబ్ సిరీస్ లో నటించలేదు. ఫస్ట్ టైమ్ దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేశ్‌.. రానా కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారు. 

నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10 నుంచి రానా నాయుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ను  అమెరికన్ డ్రామా రే డొనోవన్ కి రీమేక్ గా డైరెక్టర్స్ కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ కలిసి తెరకెక్కించారు. తెలుగు హీరోలు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడుకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక వెంకటేశ్‌ ను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ వెబ్  సిరీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. 

అయితే ఈ వెబ్ సిరీస్ లో వెంకటేశ్‌ తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా ప్లే బాయ్ రోల్ లో కనిపించాడు. ఇక సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో వెంకీ  మేన‌రిజ‌మ్స్‌ ఆకట్టుకున్నా...బూతులు మాట్లాడటం టాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక  సోషల్ మీడియాలో బోల్డ్‌ కంటెంట్‌ శృతి మించిదంటూ...ఫ్యామిలీ తో ఎలా కలిసి చూడాలంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. 

ఇక  మీమర్స్‌కి రానా నాయుడు ఒక సోర్స్ గా మారింది. దీంతో రానా నాయుడు  నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సోషల్ మీడియా లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా  మారింది..ఈ సిరీస్ ఇంతలా  హాట్ టాపిక్ గా మారడానికి మెయిన్ రీజన్ వెంకటేశ్‌ పచ్చి బూతులు మాట్లాడడమే. వెంకీ తన కెరీర్ లో ఏ సినిమాలో కూడా ఇలాంటి బూతులు మాట్లాడలేదు.

దీంతో వెంకటేష్ ని అభిమానించే వాళ్ళ దగ్గర నుండి చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి..పరిస్థితి అర్ధం చేసుకున్న రానా రంగంలో దిగాడు.  సిరీస్ ను మెచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే  నచ్చని వారికి తన హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు.అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ పై మొదట్లో నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ...ఇప్పుడు టాక్‌ మెల్లగా మారుతోంది.కొంతమంది యూత్ ఈ అడల్ట్ కంటెంట్ ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. 

ఈ సిరీస్ చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.  ప్రస్తుతం ఇండియన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న అన్నీ వెబ్ సిరీస్ ల కంటే రానా నాయుడు  టాప్ వన్ పోజిషన్ లో ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ కి 80 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చినట్టు సమాచారం.ఇక ఈ అడల్ట్ కంటెంట్ లో వెంకటేశ్‌ నటించేందుకు ఒప్పుకోవడానికి కూడా కారణం నెట్ ఫ్లిక్స్ సంస్థ అందించిన భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. ఈ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్‌  12 కోట్ల రూపాయిలు తీసుకున్నాడట. అలాగే రానా కి  8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

వీళ్ల కెరీర్ లో బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే  ఈ బోల్డ్ కంటెంట్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.ఇంకో విషయం ఏంటంటే రానా నాయుడు తెలుగు వెబ్ సిరీస్ కాదు. హిందీలో తీసి దాన్ని తెలుగులో డబ్ చేశారు అంతే. రానా నాయుడు నిదానంగానే ప్రారంభమైన వెళ్లే కొద్దీ  స్క్రీన్ ప్లే రేసీగా మారుతుంది. ఇదే ఇప్పుడు  రానా నాయుడు వెబ్ సిరీస్ ను  ట్రెండింగ్ లో నిలబెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement