గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి వెరైటీ ఇన్విటేషన్
Published
Wed, Oct 19 2016 11:58 AM
| Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
బ్రాహ్మణి, రాజీవ్ రెడ్డిల నిశ్చితార్థం(ఫైల్ ఫొటో)
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులో జరగనున్న పెళ్లికి అతిథులను ఆహ్వానించేందుకుగానూ రూపొందించిన వైరైటీ శుభలేఖపై జాతీయ మీడియా సంస్థలు సైతం వార్తలు ప్రచురించాయి. దేశంలోనే బిగ్ వెడ్డింగ్ ఈవెంట్లలో ఇదీ ఒకటని పేర్కొన్నాయి.
జనార్దన్ రెడ్డి, లక్షీ దంపతుల తనయ బ్రాహ్మణి వివాహం నవంబర్ 16న రాజీవ్ రెడ్డితో జరగబోతున్నదంటూ ప్రచురించిన శుభలేఖను ఒక బాక్స్ లో ఉంచారు. ఆ బాక్స్ తెరవగానే పై భాగంలో ఏర్పాటుచేసిన ఎల్సీడీ స్క్రీన్ పై గాలి వారి పెళ్లిపాట మొదలవుతుంది. నిమిషం నిడివిగల ఆ వీడియోలో 'అతిథిదేవోభవా..' అంటూ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి, కుమారుడితోపాటు వధూవరులిద్దరూ కనిపిస్తారు. ఆ వెరైటీ ఇన్విటేషన్ కు సంబంధించిన వీడియో ఇదే..