
కృష్ణరాజపురం: అనైతిక సంబంధాలు రక్తపాతానికి కారణమవుతున్నాయి. తన భార్యతో అక్రమ సంబందం పెట్టుకున్నాడని ఆమె భర్త కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ప్రియుడు హతం కాగా, భార్య చావు బతుకుల్లో ఉంది. బెంగళూరు మహాదేవపుర పరిధిలోని కాడుగోడి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. నిందితుడు యల్లప్ప. ఇతని భార్య అరుంధతి. మరో వ్యక్తి కిషోర్. కిషోర్ తన భార్యతో గొడవపడి కొన్నినెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ సమయంలో అతడు అరుంధతితో అనైతిక సంబంధం పెట్టుకున్నాడు. ఇది చూసి యల్లప్ప సహించలేకపోయాడు. ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో కత్తితో విరుచుకుపడ్డాడు. కిషోర్‌ను గొంతు కోశాడు. భార్యను కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికే కిషోర్ చనిపోయాడు. అరుంధతి పరిస్థితి సీరియస్‌గా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment