ఆమె కూతురు పెళ్లికి.. స్కూలుకు సెలవు! | Govt school HM declares holiday for daughter wedding | Sakshi
Sakshi News home page

ఆమె కూతురు పెళ్లికి.. స్కూలుకు సెలవు!

Published Sat, Feb 20 2016 6:19 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

ఆమె కూతురు పెళ్లికి.. స్కూలుకు సెలవు! - Sakshi

ఆమె కూతురు పెళ్లికి.. స్కూలుకు సెలవు!

తన కూతురు పెళ్లి కోసం ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా పాఠశాలకు రెండు రోజులు తాళం వేసింది.

సేలం: తన కూతురు పెళ్లి కోసం ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా పాఠశాలకు రెండు రోజులు తాళం వేయించింది. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న మూడొందల మంది విద్యార్థులతో పాటు తొమ్మిది మంది ఉపాద్యాయులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి పోవడంతో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని పుక్కుంపట్టిలో తమిళ్సెల్వి ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 17, 18 తేదీలలో చెన్నైలో తన కూతురు వివాహం జరిపించిన ఆమె.. ఆ రెండు రోజులు పాఠశాలకు సెలవు ప్రకటించింది. అదికూడా అక్కడ స్థానికంగా లేనటువంటి ఓ పండుగను గ్రామస్తులు జరుపుకుంటున్నారనే అసత్య కారణాన్ని చూపిస్తూ ఈ చర్యకు పాల్పడింది. దీనిపై ఆరాతీసిన విద్యార్థుల తల్లిదండ్రులు అసలు స్థానికంగా తాము ఆ పండుగనే జరుపుకోమని చెబుతూ.. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హెచ్ఎం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని గుర్తించిన విద్యాశాఖ అధికారులు దీనిపై పూర్తి నివేదిక అందించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement