
పాములపాడు: శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడమే ఆ విద్యార్థికి శాపమైంది. స్కూలు లేకపోవడంతో ఆటల్లో నిమగ్నమైన బాలున్ని బావి రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన పాములపాడు మండలం వేంపెంటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఖాజాహుసేన్, గోకారమ్మ దంపతుల కుమారుడు మౌలాలి ఆత్మకూరులోని ఓ ప్రయివేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. సెలవు కావడంతో సోమవారం తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీప బావి వద్దకు ఆడుకునేందుకు వెళ్లా రు. ఆడుకుంటున్న సమయంలో కాలుజారీ నీటిలో పడ్డాడు. తోటి పిల్లల సమాచారం మేరకు తల్లిదండ్రులు బావి వద్దకు వచ్చేలోగా మౌలాలి నీటిలో మునిగిపోయాడు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుని మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు. సర్పంచ్ రామసుబ్బమ్మ బాధిత కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment