
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బుధవారం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడకకు సీఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతన వధూవరులు సాయి అశ్విత, మంచుకొండ చక్రవర్తిలను సీఎం జగన్ ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, రాహుల్లా, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉన్నారు.