సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్ విందు ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగింది. పొంగులేటి కుమార్తె స్వప్నిరెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డిల వివాహం ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో జరిగింది.
అనంతరం ఖమ్మంలో రాజస్థాన్ ప్యాలెస్‌ను తలపించే భారీ సెట్టింగ్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చదవండి: (Nandamuri Balakrishna: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన బాలయ్య)
Comments
Please login to add a commentAdd a comment