
సాక్షి, విజయవాడ: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై.మధుసూదన్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హాజరయ్యారు. నూతన దంపతులు తేజశ్రీ, అర్జున్‌లను సీఎం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం జగన్ బుధవారం పర్యటించారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment