నవరత్నాల కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు
నెల్లూరు, సూళ్లూరుపేట: నాలుగున్నరేళ్లుగా టీడీపీ హత్యారాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని, ›ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డు తొలగించుకోవాలని, ఎవరికీ అనుమానం రాకుండా శ్రీనివాసరావు అనే వ్యక్తితో హత్యాయత్నం చేయించినట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. సూళ్లూరుపేట మండలంలోని మంగానెల్లూరు, సుద్దమడుగుతాగేలి, అచ్చుకట్ట గ్రామాల్లో ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కళత్తూరు రామ్మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు కళత్తూరు జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ ముందు నిలబడలేక ఆయనను పథకం ప్రకారం మట్టుబెట్టేందుకు పథకాలు రచించారన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు జగన్ అభిమానని, ఆయనతో వేసిన ఫ్లెక్సీలను విడుదల చేసి మసి పూసి మారేడు కాయ చేయాలనుకున్న టీడీపీ నేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక భయంకరమై కుట్ర దాగి ఉందని, దీని వెనుక ఉన్న కొత్త కొత్త విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల కనుసన్నల్లోనే ఈ హత్యాయత్నంపై పెద్ద కసరత్తు జరిగినట్టు ఆయన ఆరోపించారు. 2019లో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోవడంతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కేసులన్నింటినీ తిరగతోడి శిక్ష పడేట్లు చేస్తారనే భయంతో ఈ పథకం వేశారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దువ్వూరు గోపాల్‌రెడ్డి, పుట్టు రమణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి నలుబోయిన రాజసులోచనమ్మ, జిల్లా కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, పార్టీ దొరవారిసత్రం మండల అధ్యక్షుడు ఈశ్వరవాక శ్రీనివాసులురెడ్డి, ఓజిలి మండల అధ్యక్షుడు గుంటమడుగు రవీంద్రరాజు, తిరుపతి పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి మంగానెల్లూరు వీరరాఘవన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దామతోటి లక్ష్మయ్య, ప్రచార విభాగం పట్టణ కార్యదర్శి తుపాకుల ప్రసాద్, మండల ప్రచార కార్యదర్శి వడెం సుధాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బుంగా చెంగయ్య, బూత్ కన్వీనర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మందా దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment