టీడీపీకి మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే షాక్‌..! | TDP Leader KC Chenchaiah Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

టీడీపీకి మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే షాక్‌..!

Published Tue, Mar 26 2019 10:22 AM | Last Updated on Tue, Mar 26 2019 12:06 PM

TDP Leader KC Chenchaiah Joins YSR Congress Party - Sakshi

యర్రగొండ పాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ఒంగోలు : ఎన్నికల సమరానికి రోజులు దగ్గపడుతున్న కొద్దీ టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో ఎమ్మెల్యే అదే బాటన నడిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సిట్టింగ్‌ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు. 

సాక్షి, సూళ్లూరుపేట: నాయుడుపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం సీనియర్‌ నాయకులు కేసీ చెంచయ్య, తన కుమారులు సురేష్‌, సాయి, 100 మంది అనుచరులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సూళ్లూరుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు దువ్వూరు బాలచంద్రారెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కట్టా సుధాకర్‌ రెడ్డి, తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, విజయశేఖర్‌ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, డాక్టర్‌ పాలూరు మహేందర్‌ రెడ్డి, లింగారెడ్డి భాను ప్రకాశ్‌ రెడ్డి, మునుస్వామి నాయుడు పాల్గొన్నారు.

(చదవండి : గెలిపించండి.. అండగా ఉంటా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement