
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బుధవారం అమరావతిలో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు కోవిడ్–19 పరీక్షలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమావేశానికి హాజరు కోసం ముందుగా అమరావతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రంలో స్వాబ్ టెస్టు చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్ వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు.