కార్యకర్తలకు అండగా నిలుస్తాం | Sanjeevaiah Kiliveti Supports YSRCP Leaders Nellore | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా నిలుస్తాం

Published Sat, Jul 21 2018 9:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Sanjeevaiah Kiliveti Supports YSRCP Leaders Nellore - Sakshi

 సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

సూళ్లూరుపేట రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో అండగా నిలుస్తామని స్థానిక శాసన సభ్యులు, పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం  నెల్లూరు పట్టణంలోని సత్యసాయి కల్యాణ మండపంలో జరిగిన బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు ముందు పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తనూ అధికారంలోకి వచ్చాక తాము భుజంపై మోస్తామన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కృషితో పార్టీ అధికారంలోకి వచ్చాక అదే కార్యకర్తల ఆధ్వర్యంలోనే ప్రజాసేవ చేస్తామన్నారు.

గత ఎన్నికల్లో ప్రతి బూత్‌కు పదకొండు ఓట్లు తక్కువైనందున పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని గుర్తు చేశారు. అందుకని ప్రతిఒక్కరూ కష్టపడి పార్టీని విజయ ప«థాన నడిపించాలని కోరారు. ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడు జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. అలాగే అధికార పార్టీ చేస్తున్న మోసాల గురించి అందరికీ తెలియజేసి వారిని తమ వైపునకు మరల్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి బూత్‌ కమిటీ సభ్యులు నాయకులై పని చేయాలన్నారు. పార్టీ నాయకులు కళత్తూరు శేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నలబోయిన రాజసులోచనమ్మ, మాదరపాకం బాలసుబ్రహ్మణ్యం, మంగా నెల్లూరు వీరరాఘవన్, గండవరం సురేష్‌రెడ్డి, వంకా రామాంజనేయులు, కర్లపూడి సురేష్‌ బాబు, శ్రీహరికోట చెంగయ్య, తుపాకుల ప్రసాద్, గోగుల తిరుపాలు, గాలి మల్లికార్జునరెడ్డి, మందా దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement