
సాక్షి, నెల్లూరు: టీడీపీ దళిత తేజం కాదు..దళిత మోసం.. దళితులంటే బాబుకి చిన్నచూపేనని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటివరకు 80 ఎస్సీ వసతి గృహాలను మూసివేశారు.. కానీ ఒక గురుకుల పాఠశాలనైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు. బాబు వర్గీకరణ పేరుతో దళితుల మద్య చిచ్చుపెడుతున్నారు. దీనిపై బాబు ప్రసంగానికి ఎటువంటి స్పందన లేదని, దళితులంతా వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment