యువతను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
సాక్షి, నాయుడుపేటటౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గురువారం ఓజిలి మండల బీజేపీకి చెందిన అల్లిపూడి సుబ్బారావు, దాసరి సాయి, హేమంత్, ఎస్‌డీ గౌస్, షేక్ దావూద్, జనార్దన్, నాగరాజు, వెంకటస్వామి, మన్నెమాల సాయి, ఎం.విజయకుమార్ తదితర నాయకుల సారథ్యంలో 100 మందికి పైగా యువత వైఎస్సార్‌సీపీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యేతోపాటు పార్టీ ఓజిలి మండల కన్వీనర్ గుంటమడుగు రవీంద్రరాజు, జిల్లా కార్యదర్శులు దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పాదర్తి హరనా«థ్‌రెడ్డి, ఉచ్చారు హరనా«థ్‌రెడ్డి, కోండూరు ప్రభాకర్‌రాజు, ట్రెడ్ యూనియన్ మండల అధ్యక్షుడు తిరుపాలయ్య తదితరులు కండువాలను కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ఇష్టారాజ్యంగా పాలన చేశాడన్నారు. టీడీపీ దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడే రోజులు వచ్చేశాయన్నారు. రాక్షసపాలనను అంతమొందించేందుకు యువత నడుం బిగించాలన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండలాంటే జగనన్న సీఎం కావాలన్నారు. కార్యక్రమంలో పఠాన్ రబ్బానీబాషా, ఎస్‌కే ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment