naidupeta
-
నాయుడుపేట జనసముద్రం..!
-
జూన్ 4న వచ్చేది మన ప్రభుత్వమే...నా తొలి సంతకం దాని పైనే...
-
నాయుడుపేట సాక్షిగా..రాక్షససైన్యాన్ని చీల్చిచెండాడిన సీఎం
-
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
Naidupeta: సీఎం జగన్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్‌లు
సాక్షి, తిరుపతి జిల్లా: అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్ కదా.. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ.. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. 8వరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ ♦చంద్రబాబుకి గుర్తొచ్చేది.. వెన్నుపోటు అంటూ సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్ ♦మనకు కోట్ల మంది అభిమానులు ఉంటే.. ఆ యెల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు ♦ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచే ఉన్నారు. వీళ్ల రాజకీయం దోచుకోవడం.. దాచుకోవడం. చంద్రబాబును హంతకుడు అనలేమా? ఈ ఎన్నికలు రెండు భావజాలాలు.. పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా? వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు జూన్ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి.. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు ముగ్గురిని తెచ్చుకున్నాడు. స్వయంగా మేనిఫెస్టో కూడా ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికి పంచాడు ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు.. ప్రధాన హామీలంటూ స్వయంగా సంతకాలు చేశాడు.. మరి పొదుపు సంఘాల పూర్తి రుణమాఫీ అన్నాడు? చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా? ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా? రైతులకు రుణమాఫీ అన్నాడు? చేశాడా? మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలం అయినా ఇచ్చాడా? -
పేదల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి: వైఎస్ జగన్
-
ఇప్పుడు ఉన్న పథకాలు అన్నీ కొనసాగిస్తాం
-
చంద్రబాబు అహంకారం.. 31మంది వృద్ధులను పొట్టన పెట్టుకున్న హంతకుడు
-
అలాంటి చంద్రబాబును ఇంకేమని అనాలి: సీఎం జగన్
తిరుపతి, సాక్షి: మరో ఐదు వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ప్రతీ వర్గం మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడతున్నాం. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం. మరో చారిత్రక విజయం దక్కించుకోవడం కోసం సిద్ధమా? అని నాయుడుపేట ప్రజా ప్రభంజనంను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ‘‘ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ ఓటు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు కాదు.. మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోండి’’ అని సీఎం జగన్ గుర్తు చేశారు. .. ‘‘నాయుడుపేటలో ఇవాళ జన ప్రభంజనం కనిపిస్తోంది. ఇసుక వేస్తే రాలనంత ఓ జన సముద్రం కనిపిస్తోంది ఇక్కడ. ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా.. ఇంటింటికి జరిగిన లబ్ధికి అడ్డుతలుగుతున్న దుష్టచతుష్టయం పై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వలు, తాతలు, సోదరుడు స్నేహితులు అందరికీ మీ జగన్.. మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఆ దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ గర్జించే గొంతుకతో ప్రశ్నించగా.. సిద్ధం అంటూ అవతలి నుంచి బదులు వచ్చింది. చంద్రబాబును హంతకుడు అనలేమా? ఈ ఎన్నికలు రెండు భావజాలాలు.. పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ. అన్ని వర్గాలకు మనం మంచి చేశాం. 75 శాతం నా అని పిలుచుకునే సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. పెన్షన్లను మూడు వేల రూపాయాలకు పెంచుకుంటూ వచ్చాం. ఒకటో తేదీన వలంటీర్ల రూపంలో పెన్షన్లు ఇంటి వద్దకే అందించాం. అలాంటిది.. తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీన్ని అడ్డుకున్నది చంద్రబాబు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. పేదల భవిష్యత్తు కొరకు.. అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమా? అని అడుగుతున్నా అని సీఎం జగన్ మరోసారి ప్రశ్నించారు. రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి. చెడిపోయాయి. ఏ స్థాయికి అంటే.. అవ్వాతాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్లను.. తాము చెబితేనే చంద్రబాబునాయుడు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు(రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేరు ప్రస్తావన) చెప్పారు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా?.వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది. తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి.. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం అని సీఎం జగన్ ప్రకటించారు. తెలుసా చంద్రబాబు? తెలుసా చంద్రబాబు.. తెలుసా యెల్లో ముఠా.. మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా?. జగన్‌కు నా తోబుట్టువులుగా భావించే అక్కచెల్లెమ్మలు ఉన్నారు. నన్ను మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు ఉన్నారని గర్వంగా చెబుతాడు ఈ జగన్. వీళ్లంతా నా వాళ్లు. వీళ్ల భవిష్యత్తు మార్చడం కోసం 58 నెలలుగా అడుగులు పడ్డాయి. గర్వంగా ఈ విషయం చెబుతున్నా. చంద్రబాబు ఒక మాట అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్ కదా. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ.. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?.. (లేదు అనే మాట వినిపించింది). పైగా చంద్రబాబుకి గుర్తొచ్చేది.. వెన్నుపోటు అని సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్. మనకు కోట్ల మంది అభిమానులు ఉంటే.. ఆ యెల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచే ఉన్నారు. వీళ్ల రాజకీయం దోచుకోవడం.. దాచుకోవడం. గత 58 నెలల్లో మీ బిడ్డ వేసిన అభివృద్ధి, సంక్షేమ విత్తనాలు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టే.. వాళ్ల(చంద్రబాబు అండ్ కో) మాదిరి పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పని లేదు. మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఓటేయమని అడిగేందుకు మీ ముందుకు రాగలిగాను. కాబట్టే.. మీ జగన్ ఇలా ఈరోజున స్వచ్ఛమైన మనషుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ఆశీస్సులు కోరుతున్నాడు. రాబోయే ఎన్నికల కోసం కూడా అబద్ధాలు చెప్పడు. సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు. చంద్రబాబులా కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలనుకోవడం లేదు. పేదలపై ఈ జగన్‌కు ఉన్న ప్రేమ.. ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు.. ఉండదు. మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు.. గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్ చెప్పారు.ఔ ఇప్పటికే కొనసాగిస్తున్న పథకాలు కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేయగలిగే అవకాశం ఉంటే తప్పక చేస్తాం. ఈ 58 నెలల పాలనలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో మేనిఫెస్టోలో చేయగలిగిన మంచి అంతా చేస్తాను అని మీకు తెలియజేస్తున్నా. మరి.. మరోసారి బాబును నమ్మొచ్చా? అని ఆలోచించండి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే.. 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. ముగ్గురిని తెచ్చుకున్నాడు. స్వయంగా మేనిఫెస్టో కూడా ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికి పంచాడు. ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు... ప్రధాన హామీలంటూ స్వయంగా సంతకాలు చేశాడు.. మరి పొదుపు సంఘాల పూర్తి రుణమాఫీ అన్నాడు? చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా? ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా? రైతులకు రుణమాఫీ అన్నాడు? చేశాడా? మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలం అయినా ఇచ్చాడా? ఇలా.. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చాడా?. పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చాడా?.. నేను అడిగేది ఒక్కటే. 2014లో ఇదే పెద్ద మనిషి ముఖ్యమైన హామీలంటూ పంపిన ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా చేయని పెద్దమనుషులు మళ్లీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు రంగు రంగుల మేనిఫెస్టోతో కేజీ బంగారం, బెంజ్ కారు, సూపర్ సిక్స్ అంటూ మోసానికి దిగుతున్నారు. ఇలాంటి రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరమా?.. వీళ్ల మోసాల నుంచి పేదల భవిష్యత్తును కాపాడుకోవడంలో స్టార్ క్యాంపెయినర్లుగా మారి.. ప్రతీ ఇంట్లో నుంచి ఆ స్టార్‌క్యాంపెయినర్లు వందల మందికి విషయాలు చెప్పాలి. అలా చెప్పించడానికి మీరంతా సిద్ధమా?.. సిద్ధమే అయితే.. జేబుల్లోంచి సెల్ఫోన్లు బయటకు తీసి టార్చ్ లైట్ వెలిగించి గట్టిగా చెప్పండి.. పేదవాడి భవిష్యత్తు కోసం.. వారి అబద్ధాలు, మోసాలు, చీకటి రాతల మీద యుద్ధానికి మేమంతా సిద్ధం అని చెప్పండి విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మనం.. మోసాలు, కుట్రలు మరో వైపు యుద్దం జరుగుతోంది. ఈ ఎన్నికలు.. మన ఓటుతో రాబోయే ఐదేళ్లు అధికారం ఇస్తారు. ఈ అధికారంతో మన తలరాతలు మారుతాయి. అందుకే 175కి 175 ఎమ్మెల్యేలు.. 25 పార్లమెంట్ సీట్లతో.. డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమా?. మరో రెండు నెలల్లో మళ్లీ మీ బిడడ అధికారం చేపట్టేందుకు మీ దీవెనలు, ఆశీస్సులు కావాలి. వెళ్లే ముందు.. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి.. నాకు తమ్ముడిలాంటివాడు. మంచివాడు.. సౌమ్యుడు. సూళురుపేట నుంచి సంజీవయ్యన్న.. నాకు అన్నలాంటివాడు. మంచివాడు.. సౌమ్యుడు తిరుపతి నుంచి అభినయ్.. యువకుడు, ఉత్సాహవంతుడు.. మంచి చేయడానికి అడుగులు వేసేందుకు తాను సిద్ధం అని ముందుకు వచ్చాడు. గూడురు నుంచి మురళన్న.. మీ అందరికి ఇది వరకే పరిచయం ఉన్న వ్యక్తి. సౌమ్యుడు. సత్యవేడు నుంచి రాజేష్.. నాకు తమ్ముడిలాంటి వాడు. మంచివాడు. సౌమ్యుడు. కాళహస్తి నుంచి మధును . చూడడానికి మొరటు.. కానీ, మనిషి మంచోడు. మనసు వెన్న. వెంకటగిరి నుంచి రాము.. నాకు స్నేహితుడు కూడా. మంచివాడు.. సౌమ్యుడు.. సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి నా సహచరుడు.. అన్ని రకాలుగా దగ్గరివాడు.. అంతకంటే ఎక్కువ. కష్టకాలంలో పార్టీ బాద్యతలు తాను భుజాన వేసుకుని నిలబడ్డాడు గోవర్థనన్న.. మీ అందరి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఈ అభ్యర్థులపై ఉంచాలని ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్ కోరారు. మన గుర్తు తెలియనివాళ్లు.. ఎవరైనా మిగిలి ఉంటే.. గుర్తు ఫ్యాన్. ప్రతీ ఒక్కరికీ చెబుతున్నా.. ఫ్యాన్ మీద వేసే రెండు ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవాళ్టి మీ బతుకులంటే ఇంకా మంచిగా చేస్తాను అని మాటిస్తున్నా. మీ బిడ్డకు తోడుగా ఉండడండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.. అని నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభ ప్రసంగం ముగించారు సీఎం జగన్. -
రానున్న 5 సంవత్సరాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలకు మీరు సిద్ధమా...!
-
నాయుడుపేట బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ర్యాంప్ వాక్
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ @ నాయుడుపేట
-
ఏపీలో గ్రీన్‌లామ్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లామినేట్ షీట్స్ తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద ఉన్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రానికి ఏటా 35 లక్షల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. నూతన ప్లాంటు కోసం కంపెనీ రూ.239 కోట్లు వెచ్చించింది. పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే ఈ ఫెసిలిటీ ద్వారా రూ.600 కోట్ల వార్షికాదాయం సమకూరగలదని కంపెనీ ప్రకటించింది. 4 ప్లాంట్లలో కలిపి వార్షిక స్థాపిత సామర్థ్యం 2.45 కోట్ల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులకు చేరిందని గ్రీన్‌లామ్ ఎండీ, సీఈవో సౌరభ్ మిత్తల్ వెల్లడించారు. -
తిరుమల: రెచ్చిపోయిన దొంగలు.. టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ
సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు అదృశ్యమైంది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా బస్సు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, లోకేషన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సు నాయుడుపేటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సును స్వాధీనం చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బస్సును దొంగతనం చేశారు. చోరీ చేసిన బస్సును తీసుకెళ్తుండగా లోకేషన్ ఆధారంగా నాయుడుపేట వద్ద బస్సు గుర్తించారు. దీంతో, బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, వాహనాల మిస్సింగ్‌ను టీటీడీ.. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇది కూడా చదవండి: కదులుతున్న ‘స్కిల్’ డొంక.. లోకేష్ పీఏ అమెరికాకు జంప్! -
నాయుడుపేటలో మహిళ హల్చల్
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఓ మహిళ బైఠాయించి గంటకు పైగా హల్చల్ చేసింది. రోడ్డుకి అడ్డంగా కూర్చుండిపోవడంతో రహదారిపై వాహనాలు బారులుతీరి నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న సీఐ సీహెచ్ ప్రభాకర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళతో మాట్లాడారు. ఆ మహిళ సీఐతో పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేన్నట్లు గుర్తించారు. ఆమె బ్యాగులో బురఖా ఉండడంతో ముస్లిం మహిళ అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. తర్వాత మహిళకు నచ్చజెప్పి స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్ వద్ద ఉన్న రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. -
నెల్లూరు జిల్లా: నాయుడుపేట సమీపంలో రోడ్డు ప్రమాదం
-
రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు
సాక్షి, నాయుడుపేట: తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం కేంద్రమానవ వనరులశాఖ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం పాలచ్చూరులో, చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలో రెండు కేంద్రీయ విద్యాలయాలను వచ్చే విద్య సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సంబంధిత శాఖ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుకెళ్లి మంజూరుకా కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. -
నాయుడుపేట ప్రచార సభలో వైఎస్ విజయమ్మ
-
ఆయన పెద్దన్న ఎలా అవుతారు?: విజయమ్మ
సాక్షి, నెల్లూరు: ‘నాలుగున్నరేళ్ల పాటు ప్రజ సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా వారిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. పసుపు-కుంకుమ పేరిట మహిళలను మరోసారి మోసం చేస్తున్నారు. జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కదానిని చంద్రబాబు నెరవేర్చలేదు. రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు తాను పెద్దన్నగా చెప్పుకుంటున్నారు. కానీ ఎన్నికలప్పుడు వచ్చే చంద్రబాబు పెద్దన్న ఎలా అవుతార’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఆదివారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. వైఎస్ జగన్ తప్పుచేయలేదు కాబట్టి కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. చంద్రబాబు17 కేసుల్లో స్టే తెచ్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది ఎవరని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లురుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్‌లను భారీ మెజారిటీతో గెలిపించమని కోరారు. ఇంకా విజయమ్మ మాట్లాడుతూ.. ‘ఈ సారి జరగుతున్న ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నవి. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. మీ అందరికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. 30 ఏళ్ల పాటు రాజశేఖరరెడ్డి గారిని మీ భుజాలపై మోశారు. ప్రజలతో రాజశేఖరరెడ్డి గారి కటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత రాజశేఖర్‌రెడ్డి ప్రతి జిల్లాకు 70 నుంచి 80 సార్లు వచ్చి ఉంటారు. చాలా మందిని పేర్లు గుర్తుపెట్టుకుని మరి పిలిచే అప్యాయత ఆయనది. ఆయన సీఎం అయ్యేసరికి ఏ జిల్లాకు ఏం కావాలో తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఏం కావాలో చేశారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఏ ఒక్కటి కూడా పెంచకుండా వైఎస్సార్ పాలన నడిచింది. రైతులను రాజు చేయాలని జలయజ్ఞం ప్రారంభించారు. దేశంలో మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే.. వైఎస్సార్ కేవలం రాష్ట్రంలోనే 48 లక్షలు కట్టారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని పరిపాలన కొనసాగించారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత ఉండాలని రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు 110 రూపాయలకే 9 నిత్యవసరాలు అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా లక్షల మందికి ఆపరేషన్లు జరిగాయి. పేద పిల్లల చదువుకోసం ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకువచ్చారు. మీకు వచ్చిన కష్టమే ఎక్కువ.. ఐదేళ్ల మూడు నెలల వైఎస్సార్ పాలన కాలంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ మేలు జరిగింది. కేంద్రం ధరలు పెంచిన.. ఆ భారం రాష్ట్రంపై పడకుండా రాజశేఖరరెడ్డి గారు చూశారు. 2009లో రాజశేఖరరెడ్డి గారు అభివృద్ధిని చూసి ఓటువేయమని ధైర్యంగా అడిగారు. రచ్చబండ కోసం వెళ్లే సమయంలో మూడేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను పూర్తిచేయాలి అని రాజశేఖరరెడ్డి అన్నారు. వైఎస్సార్ చనిపోయాక మాకు వచ్చిన కష్టం కంటే.. రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టమే ఎక్కువ. రాజశేఖరరెడ్డి గారి మరణం తరువాత ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. పావురాల గుట్ట వద్ద నాన్న కోసం చనిపోయిన వాళ్లను పరామర్శిస్తానని జగన్ చెప్పారు. ప్రతి ఒక్కరు జగన్ బాబుని అక్కున చేర్చుకున్నారు. వైఎస్ జగన్ ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. మా నాన్న నాకు మాట తప్పడం నేర్పించలేదని జగన్ అన్నారు. సోనియా గాంధీ కేంద్ర మంత్రి పదవి ఇస్తానని చెప్పిన కూడా.. జగన్ ప్రజల్లోకి వెళతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటునే జగన్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు పొమ్మనలేక పోగ పెట్టారు. దీంతో జగన్ కాంగ్రెస్‌లో ఇమడలేక బయటకు వచ్చారు. దీంతో ఆయనపై కుట్రలు పన్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీకి రాజీనామా చేస్తే కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు. ఆ లోటును జగన్ తీర్చుతాడు.. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్‌ను, నన్ను ఓడించేందుకు భారీగా డబ్బులు ఖర్చుపెట్టారు. అయినా కానీ కడప ప్రజలు రికార్డు మెజారిటీతో జగన్‌ను గెలిపించారు. జగన్ పార్టీ పెట్టకముందు జగన్, వైఎస్సార్ చాలా మంచివారు. రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి గారు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే రాజశేఖరరెడ్డి గారు అనే స్థాయికి ఆయన తీసుకువచ్చారు. అందుకు వాళ్లు ప్రతిఫలంగా ఎఫ్ఐఆర్లో రాజశేఖరరెడ్డి గారి పేరు చేర్చారు. వైఎస్సార్ కుటుంబం మీద అక్రమంగా 11 కేసులు పెట్టారు. ఆస్తులు అటాచ్ చేశారు. ఆ లోపు ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రావడంతో విచారణకు పిలిచి జగన్‌ను జైల్లో పెట్టారు. పార్టీ మూసివేస్తారని భావించారు. కానీ అప్పుడు జగన్ మన కోసం బయటకు వచ్చిన 18 మంది కోసం మీరు ప్రజల దగ్గరికి వెళ్లాలి.. వాళ్లని గెలిపించుకోవాలని చెప్పాడు. అప్పుడు నేను, షర్మిల బయటకు వస్తే ప్రతి ఒక్కరు మాకు తోడుగా నిలిచారు. అప్పుడు నేను జగన్‌తో మాట్లాడుతూ.. నాన్నతో పైకొచ్చిన ఏ ఒక్క నాయకుడు మనతో లేరు.. కానీ ప్రజలు మనతోనే ఉన్నారు వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పాను. షర్మిల, జగన్ పాదయాత్ర చేస్తే మీరంతా ఆదరించారు. మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదని జగన్ గర్వంగా చెప్తారు. మేము ఏదైనా జవాబు చెప్పాలంటే అది ప్రజలకు మాత్రమే. రాజశేఖరరెడ్డి గారు లేని లోటు మాకు ఎవరు తీర్చలేరు కానీ.. మీకు మాత్రం ఆ లోటును జగన్ తీర్చుతారు. రైతులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు.. మీ అభిమానమే ఈ రోజు మమ్మలి నిలబెట్టింది. ఈ తొమ్మిదేళ్లు జగన్ మీ మధ్యనే ఉన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన జగన్ అక్కడ ఉన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ ఢిల్లీ వేదికగా ధర్నాలు, దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉంది అంటే అది జగన్ వల్లనే. గత ఎన్నికల్లో 650కు పైగా హామీలు ఇచ్చినా చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి వచ్చి అబద్దపు హామీలు ఇచ్చారు. ఈ సారి మోసపోవద్దు. జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు. చంద్రబాబుకు ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడే వచ్చిందా?. చంద్రబాబు రైతులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. వడ్డీ లేకుండా రుణాలు దొరుకుతున్నాయా?. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అంటూ మహిళలను మోసం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు వచ్చే అన్న పెద్దన్న అవుతారా?. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు దొరకుతుందా?. నీరు దొరకడం లేదు.. కానీ మద్యం విస్తారంగా దొరుకుతుంది. మూడు దఫాలుగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ కూడా రావడం లేదు. ఆరోగ్య శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అందరికీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. నిరుద్యోగులకు భృతి అందుతుందా?. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాడు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్, మెస్ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. అవ్వ తాతలకు పింఛన్ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తూ.. ప్రతి విషయంలో వారికి అండగా నిలుస్తాం. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి ఊరిలో పది మందికి ఉపాధి కల్పిస్తారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేటట్టు చట్టం చేస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకే అవకాశం ఇస్తాం.ప్రతి ఊరికి, పల్లెకు పైపులైన్ల ద్వారా తాగునీరు అందజేస్తాం. స్థానికంగా శ్రీ సిటీ కోసం రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారు. ఈ రోజు దాన్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలు తెలుసా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో మాట్లాతుంటే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టలేదా?. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి అడ్డుకుంటారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా?. వైఎస్ జగన్ మీద చంద్రబాబు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రత్కేక హోదా రాకుండా చేసింది చంద్రబాబు కాదా?. ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఐటీ గ్రిడ్స్ చైర్మన్‌ను ఎందుకు కాపాడుతున్నారు. వైఎస్ జగన్ ఏ రోజు ఎవరితో పొత్తు పొట్టుకోలేదు. మాకు ప్రజలతోనే పొత్తు. ప్రత్యేక హోదా ఇచ్చేవారికి తాము మద్దతిస్తామని జగన్ చెబుతున్నారు. చంద్రబాబు పోలింగ్‌కు ముందు ఏమైనా చేస్తారు. ప్రలోభాలకు దిగుతారు. ఆయనకు గుండె నొప్పి వచ్చిందనే డ్రామాలు కూడా ఆడుతారు. అందరు ఓటు వేయండి. మంచి పాలన తెచ్చుకుందామ’ని తెలిపారు. -
ఎన్నికలప్పుడు వచ్చే అన్న పెద్దన్న అవుతారా?
-
జగనన్న సీఎం అయితే యువతకు ఉద్యోగాలు
సాక్షి, నాయుడుపేటటౌన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గురువారం ఓజిలి మండల బీజేపీకి చెందిన అల్లిపూడి సుబ్బారావు, దాసరి సాయి, హేమంత్, ఎస్డీ గౌస్, షేక్ దావూద్, జనార్దన్, నాగరాజు, వెంకటస్వామి, మన్నెమాల సాయి, ఎం.విజయకుమార్ తదితర నాయకుల సారథ్యంలో 100 మందికి పైగా యువత వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యేతోపాటు పార్టీ ఓజిలి మండల కన్వీనర్ గుంటమడుగు రవీంద్రరాజు, జిల్లా కార్యదర్శులు దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పాదర్తి హరనా«థ్‌రెడ్డి, ఉచ్చారు హరనా«థ్‌రెడ్డి, కోండూరు ప్రభాకర్‌రాజు, ట్రెడ్ యూనియన్ మండల అధ్యక్షుడు తిరుపాలయ్య తదితరులు కండువాలను కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ఇష్టారాజ్యంగా పాలన చేశాడన్నారు. టీడీపీ దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడే రోజులు వచ్చేశాయన్నారు. రాక్షసపాలనను అంతమొందించేందుకు యువత నడుం బిగించాలన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండలాంటే జగనన్న సీఎం కావాలన్నారు. కార్యక్రమంలో పఠాన్ రబ్బానీబాషా, ఎస్కే ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ-టీఎస్: చిన్నారులపై వరుస అత్యాచారాలు
సాక్షి, హైదరాబాద్: చాక్లెట్లు కొనిపెడతానంటూ చిన్నారి పాపను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడో వృద్ధుడు... బాలికను గర్భవతిని చేశాడు మరో ముసలోడు... నాలుగు నెలలుగా విద్యార్థినిపై అఘాయిత్యం జరుపుతూ పట్టుపబడ్డాడో ట్యూషన్ టీచర్! తెలుగు రాష్ట్రాల్లో ఒక్క శనివారం రోజే మధ్యాహ్నం వరకు రిపోర్ట్ అయిన కీచకపర్వాలివి. రాత్రికి వరకు ఇంకా ఎన్ని జరుగుతాయో, అసలు వెలుగులోకి రాకుండాపోయే ఘటనలెన్నో!! దాచేపల్లిలో మరో దారుణం: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణం వెలుగుచూసింది. 55 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజులుగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇంట్లోవాళ్లకు చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. ఇటీవలే పాప ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో ఆమె గర్భవతని తేలింది. భయంతో వణికిపోయిన పాప.. తనపై జరిగిన అకృత్యాన్ని చెప్పేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు నిందితుడు మహబూబ్వలీపై పోలీసులు కేసు నమోదుచేశారు. చిన్నారిపై అఘాయిత్యం.. బియ్యం ఇచ్చే యత్నం: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఐదేళ్ల చిన్నారిపై గురుస్వామి అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యం జరుపబోగా.. చిన్నారి నానమ్మ గమనించింది. చేసినతప్పుకు ప్రతిగా ఐదు కేజీల బియ్యం ఇచ్చి తప్పించుకోవాలని చూశాడా కీచకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు గురుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. మీర్పేట్లో విద్యార్థినిపై ట్యూటర్: హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లెనిన్ నగర్లో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల విద్యార్థినిపై ఆమెకు పాఠాలు చెప్పే ట్యూటర్ గోపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో బాలికను తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ట్యూటర్ గోపి.. గడిచిన నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
మంత్రి నారాయణ సమక్షంలో...
సాక్షి, నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీలో దళితులకు ఇచ్చే ప్రాధాన్యమెంతో మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణిని నిలబెట్టే ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం గోమతినగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్ రాజానాయుడు పాల్గొన్నారు. వీరందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడే ఉన్న నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణికి మాత్రం కుర్చీ కేటాయించలేదు. దీంతో ఆమె సమావేశం జరుగుతున్నంత సేపూ నాయకుల వెనుక నిల్చొనే ఉండాల్సి వచ్చింది. మంత్రి నారాయణ తదితర టీడీపీ నేతలు చైర్పర్సన్ నిలుచుని ఉన్నా పట్టించుకోకుండా విలేకరుల సమావేశం ముగించారు. -
మూడు నెలల బాలుడి విక్రయం
నాయుడుపేట (నెల్లూరు జిల్లా) : రెండు రోజుల క్రితం విక్రయించబడిన మూడు నెలల బాలుడిని ఐసీడీఎస్ సీపీడీవో, జిల్లా శిశు సంరక్షణ అధికారులు మంగళవారం గుర్తించారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోరుమంచివారికండ్రిగ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీతలపూడి బాబయ్య, క్రిష్ణమ్మ దంపతులు సంతానం లేకపోవడంతో రెండు రోజుల క్రితం ఒక బాలుడిని తీసుకొని వచ్చారు. కాగా ఈ విషయం తెలిసిన అధికారులు దంపతులను వివరణ కోరగా నాయుడుపేట మండల కేంద్రానికి చెందిన బూబమ్మ అనే మహిళ దగ్గర నుంచి తీసుకొని వచ్చామని తెలిపారు. దీంతో అధికారులు పోలీసుల సహాయంతో విచారణ కోసం బూబమ్మ ఇంటికి వెళ్లగా ఆమె పరారైనట్లు పోలీసులు తెలిపారు. బూబమ్మ ఎవరి దగ్గర నుంచి బాలుడిని తీసుకొచ్చి విక్రయించిందో తెలియాల్సి ఉంది. అయితే పిల్లలు లేని ఆ దంపతులు బూబమ్మ దగ్గర నుంచి బాలుడిని రూ. 70వేలకు కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు బూబమ్మ కోసం గాలిస్తున్నారు. కాగా బాలుడిని నెల్లూరులోని శిశు విహార్‌కు తరలించనున్నట్లు శిశు సంరక్షణ అధికారులు తెలిపారు. -
అసభ్యకర ఫొటోలు తీసి ... బ్లాక్‌మెయిలింగ్
నెల్లూరు : ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధించడంతో పాటు, ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ రౌడీలతో ఆమె ఇంటి మీదకొచ్చిన ఆటోడ్రైవర్ ఉదంతమిది. ఈ ఘటన నాయుడుపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. ఓజిలిమండలం నెమళ్లపూడికి చెందిన ఓ విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గతంలో ఆమె రోజూ కళాశాలకు ఆటోలో వచ్చివెళ్లేది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేష్ ప్రేమపేరుతో వేధించాడు. అప్పట్లోనే ఆమె ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి అతడిని మందలించింది. అయితే మూడు నెలల క్రితం నరేష్ ఆ విద్యార్థిని ఆటోలో కిడ్నాప్ చేశాడు. దీనిపై అప్పట్లోనే విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి మందలించి కేసులు లేకుండా వదిలేశారు. కిడ్నాప్ సమయంలో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అసభ్యకరంగా ఫొటోలు తీసి, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడసాగాడు. ఈ ఘటనల నేపథ్యంలో విద్యార్థిని కుటుంబం నాయుడుపేటకు కాపురం వచ్చేసింది. అయినా నరేష్ వేధింపుల పర్వం ఆపలేదు.శనివారం సాయంత్రం కొందరితో కలిసి నాయుడుపేటలో విద్యార్థిని కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి మీదకు వచ్చాడు. చంపేస్తామంటూ ఆమె తల్లిదండ్రులపై దాడికి యత్నించడంతో పాటు ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. భయభ్రాంతులకు గురైన బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని ఆ విద్యార్థిని ఏఎస్సై బొబ్బిలిరాజును వేడుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.