ఏపీలో గ్రీన్‌లామ్‌ ప్లాంటు ప్రారంభం | Greenlam launches production at Naidupeta facility | Sakshi
Sakshi News home page

ఏపీలో గ్రీన్‌లామ్‌ ప్లాంటు ప్రారంభం

Published Wed, Oct 11 2023 8:33 AM | Last Updated on Wed, Oct 11 2023 8:34 AM

Greenlam launches production at Naidupeta facility - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లామినేట్‌ షీట్స్‌ తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద ఉన్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రానికి ఏటా 35 లక్షల లామినేట్‌ షీట్స్, కాంపాక్ట్‌ బోర్డులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.

నూతన ప్లాంటు కోసం కంపెనీ రూ.239 కోట్లు వెచ్చించింది. పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే ఈ ఫెసిలిటీ ద్వారా రూ.600 కోట్ల వార్షికాదాయం సమకూరగలదని కంపెనీ ప్రకటించింది. 4 ప్లాంట్లలో కలిపి వార్షిక స్థాపిత సామర్థ్యం 2.45 కోట్ల లామినేట్‌ షీట్స్, కాంపాక్ట్‌ బోర్డులకు చేరిందని గ్రీన్‌లామ్‌ ఎండీ, సీఈవో సౌరభ్‌ మిత్తల్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement