New industries
-
పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
-
పారిశ్రామిక రంగంపై స్పెషల్ ఫోకస్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోంది. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. 386 ఎంఓయూలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో చేసుకున్నాం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ నెలకొల్పేలా ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతికోసం చర్యలు తీసుకున్నాం. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభదశలో ఉన్నాయి. సీఎస్ గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు వీటిపై జరుగుతున్నాయి. వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి. ప్రతి అడుగులోనూ కలెక్టర్లు చేయిపట్టి నడిపించాలి. ఈనాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం. కోవిడ్ సమయంలోకూడా కుప్పకూలిపోకుండా వారికి చేయూత నిచ్చాం. 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. 12.62 లక్షల ఉద్యోగాలు వీటిద్వారా వచ్చాయి. మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టే ఇది సాకారం అయ్యింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కేవలం మనం ఫోన్‌కాల్‌దూరంలో ఉన్నాం. వారిపట్ల సానుకూలతతో ఇదే పద్ధతిలో ఉండాలి. దేవుడి దయతో మనం ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేశాం. 9 ప్రాజెక్టుల్లో 3 ప్రారంభిస్తున్నాం, మిగతా ఆరు పనులు ప్రారంభిస్తున్నాం. దాదాపు 1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. పత్తికొండకు నేను వెళ్లినప్పుడు అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని చెప్పాం. ఈ మేరకు ఇవాళ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్‌కు శంకుస్థాపనచేస్తున్నాం. అధికారులు మంచి కృషిచేశారు. అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నాం. చదవండి: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్ -
ఏపీలో పారిశ్రామికోత్సాహం
-
ఏపీలో గ్రీన్‌లామ్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లామినేట్ షీట్స్ తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద ఉన్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రానికి ఏటా 35 లక్షల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. నూతన ప్లాంటు కోసం కంపెనీ రూ.239 కోట్లు వెచ్చించింది. పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే ఈ ఫెసిలిటీ ద్వారా రూ.600 కోట్ల వార్షికాదాయం సమకూరగలదని కంపెనీ ప్రకటించింది. 4 ప్లాంట్లలో కలిపి వార్షిక స్థాపిత సామర్థ్యం 2.45 కోట్ల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులకు చేరిందని గ్రీన్‌లామ్ ఎండీ, సీఈవో సౌరభ్ మిత్తల్ వెల్లడించారు. -
పరిశ్రమల ప్రకాశం
పారిశ్రామిక ప్రగతితో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తోంది. ఫలితంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో పాటు సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. అదే సమయంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఒంగోలు అర్బన్: జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో పాటు సీడీపీ (క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్)లతో జిల్లా ప్రకాశించనుంది. ఆ మేరకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన యువతకు ఉపాధి కలి్పంచేలా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాలో 2022–23 సంవత్సరంలో రూ.152 కోట్లతో 201 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో సుమారు 1600 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చింది. అంతేకాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సీడీపీల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటునిస్తోంది. పరిశ్రమలకు చేయూత: జిల్లాలో ఇప్పటికే 25 భారీ పరిశ్రమలు, 2899 ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా) పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో భారీ పరిశ్రమల్లో సుమారు 8 వేల మంది, ఎంఎస్ఎంఈల్లో 35 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ పరిశ్రమలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. 2019 నుంచి జిల్లాలో 1406 పరిశ్రమలకు రాయితీ కింద రూ.171.07 కోట్లు అందజేసింది. 2019–20లో 242 పరిశ్రమలకు రూ.23.76 కోట్లు, 2020–21లో 220 పరిశ్రమలకు రూ.48.26 కోట్లు, 2021–22లో 375 పరిశ్రమలకు రూ.33.6 కోట్లు, 2022–23లో ఇప్పటి వరకు 569 పరిశ్రమలకు రూ.65.98 కోట్లు రాయితీ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ పార్కులతో కొత్త పరిశ్రమలు: జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ వేగవంతంగా చర్యలు ప్రారంభించారు. 99.27 ఎకరాల్లో రూ.201.22 కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దొనకొండ మండలం రాగముక్కలపల్లి, పామూరు మండలం మాలకొండాపురం వద్ద ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పార్కులు సిద్ధమైతే వీటిలో సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీడీపీలతో పరిశ్రమలకు అండగా... క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ)లతో పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా ఏర్పాటు చేయనున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో చీమకుర్తి, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ వద్ద రెండు సీడీపీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు. చీమకుర్తిలో ఏర్పాటు చేసే సీడీపీ గ్రానైట్ పరిశ్రమలకు, గ్రోత్‌సెంటర్‌లో ఏర్పాటు చేసే సీడీపీ నిర్మాణ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు వెన్నుదన్నుగా ఉండనున్నాయి. 15 ఏళ్లకు ప్రణాళికలు జిల్లాలో ఉన్న వనరుల మేరకు భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా నెలకొల్పేందుకు యువతను ప్రోత్సహించడం అవసరమైన నైపుణ్య శిక్షణలు ఇవ్వడం, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అండగా ఉండటం వంటి చర్యలపై రాబోయే 15 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలను కలెక్టర్ సిద్ధం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో కొత్తగా పరిÔశ్రమలు నెలకొల్పేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ముందుకు రావాలి పరిశ్రమలు స్థాపించేందుకు యువత వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు రావాలి. అలా వచ్చిన యువతకు పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తాం. తద్వారా వాళ్లు ఎదగడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కలి్పంచవచ్చు. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్నీ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తోంది. రాయితీలు అందిస్తోంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన వాటిలో నైపుణ్య శిక్షణ ఇస్తూ జిల్లాలోనే యువతకు ఉపాధి కలి్పంచడంతో పాటు పరిశ్రమలకు మ్యాన్‌పవర్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నాం. – ఏఎస్ దినే‹Ùకుమార్, కలెక్టర్ -
గుజరాత్లో అతి పెద్ద పవన విద్యుత్ టర్బైన్
న్యూఢిల్లీ: పునరుత్పదాక విద్యుత్ విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అదానీ న్యూ ఇండస్ట్రీస్ .. గుజరాత్‌లోని ముంద్రాలో అత్యంత భారీ పవన విద్యుత్ టర్బైన్ జనరేటర్ (డబ్ల్యూటీజీ)ని ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన సమైక్యతా విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) కన్నా ఎత్తయినదని కంపెనీ తెలిపింది. టర్బైన్ బ్లేడ్ల వెడల్పు చూస్తే జంబో జెట్ రెక్కల పొడవు కన్నా ఎక్కువగా ఉంటుందని వివరించింది. పూర్తి అనుబంధ సంస్థ ముంద్రా విండ్‌టెక్ (ఎండబ్ల్యూఎల్) దీన్ని ఇన్స్టాల్ చేసినట్లు పేర్కొంది. 200 మీటర్ల ఎత్తు ఉండే ఈ విండ్ టర్బైన్ .. సుమారు 4,000 గృహాలకు సరిపడేలా 5.2 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సమైక్యతా విగ్రం ఎత్తు 182 మీటర్లు. ఈ టర్బైన్ బ్లేడ్లు 78 మీటర్ల పొడవుంటాయి. -
ఏపీలో కీలక పరిశ్రమలను ప్రారంభిస్తున్న సీఎం జగన్.. లక్షల మందికి ఉద్యోగాలు
-
Andhra Pradesh: రూ.2,134 కోట్లతో 5 కొత్త పరిశ్రమలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.2,134 కోట్ల పెట్టుబడులతో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 8,578 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్న చోట భూములు కేటాయించాలని సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలను విస్తరించేందుకు అనువుగా తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, జీఏడీ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, ఐటీ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఐదు పరిశ్రమలు ఇవీ ► వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్– రిటైల్ లిమిటెడ్ ఏర్పాటు కానుంది. ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్నారు. ఆదిత్యా బిర్లా రూ.110 కోట్ల పెట్టుబడితో 2,112 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ► వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ కంపెనీ ప్లైవుడ్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. రూ.956 కోట్ల పెట్టుబడితో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. మరోవైపు ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల రైతులకు కూడా భారీగా మేలు జరగనుంది. దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్ చెట్లను గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. రూ.315 కోట్ల విలువైన ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. ► తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ రూ.861 కోట్ల పెట్టుబడితో ఇక్కడ 1,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. స్థానిక ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పబోమని గ్రాసిమ్ కంపెనీ స్పష్టం చేసింది. ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు కంపెనీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఐపీబీ ఆమోదం లభించింది. ► వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల (హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్) తయారీ పరిశ్రమను ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పనుంది. రూ.127 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ► కొప్పర్తి ఈఎంసీలోనే ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరో పరిశ్రమను కూడా ఏర్పాటు చేయనుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరా, డీవీఆర్ తయారీకి సంబంధించి రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,100 మందికి డిక్సన్ కంపెనీ ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. -
ఇక పారిశ్రామికాభివృద్ధి పరుగులు
నెల్లూరు(అర్బన్): రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నూతన పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరుగులు పెట్టించనున్నారని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా చెప్పారు. రాష్ట్రంలో 320 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం నెల్లూరులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి రోజా మాట్లాడారు. ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 31 ఇండ్రస్టియల్ పార్కులను అభివృద్ధి చేశామని, మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమలకు అనుమతులు పొందడానికి ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు ఇస్తామన్న రూ 2,500 కోట్లను రాయితీలను ఎగ్గొట్టారని, అందువల్లే కొంతమంది పరిశ్రమలు స్థాపించకుండా వెనక్కి వెళ్లిపోయారని రోజా తెలిపారు. పరిపాలనలో పారదర్శకతకు సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. నూతన ఇండ్రస్టియల్ పాలసీతో ప్రతి జిల్లాను అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో పారిశ్రామిక ప్రగతిపై మంత్రి గౌతంరెడ్డి, రోజా శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య , కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌భార్గవ, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పడవ అడ్డు పెడితే ఇళ్లు మునిగిపోతాయా? రాష్ట్రంలో వరద రాజకీయాలు చేస్తూ టీడీపీ తమ ఉనికిని చాటుకుంటోందని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆమె బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి, రిజర్వాయర్లు నిండి రైతన్నలు సంబరపడుతున్నారని చెప్పారు. -
పరిశ్రమల స్థాపన సులభతరం
సాక్షి, బెంగళూరు: దేశ ఆర్థికాభివృద్దికి కీలకమైన వ్యాపారాలు, ఉత్పాదనలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన 7వ ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ హౌస్‌వేర్ మేళా–2017 ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆన్లైన్లోనే కొత్త కంపెనీలను రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. కొత్త పరిశ్రమలు ప్రారంభించేవారికి ఎటువంటి హామీలు, పూచీకత్తులు లేకుండా రూ.2 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. చిన్న,మధ్య తరహా పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తుల్లో 20శాతం ఉత్పత్తులను భారీ పరిశ్రలు తప్పనిసరిగా వినియోగించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. జీఎస్టీ గురించి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు సందేహలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800111955కి కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. -
2,550 కొత్త పరిశ్రమలొచ్చాయ్!
- గత 9 నెలల్లో ప్రత్యక్షంగా 1.6 లక్షలు, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి - టీఎస్ఐపాస్తో రూ. 44,791 కోట్ల పెట్టుబడుల రాక - తెలంగాణ పారిశ్రామిక ప్రగతి వివరాలను వెల్లడించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్) అమల్లోకి వచ్చాక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. గడచిన 9 నెలల్లో రాష్ట్రానికి 2,550 కొత్త పరిశ్రమలు రాగా, ఏకంగా రూ.44,791 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఆయా పరిశ్రమల ద్వారా ఇప్పటికే ప్రత్యక్షంగా 1,60,894 మందికి, పరోక్షంగా 4.5 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజ నీరింగ్, ఆగ్రో బేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎల క్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలకు చెందినవి ఉన్నాయి. గత 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనపై రాష్ట్ర పరిశ్రమల శాఖ నివేదిక రూపొందించింది. ఏ జిల్లాలో ఎన్ని కోట్ల పెట్టుబడులొచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించామనే వివరాలను అందులో పొందుపర్చింది. అధికంగా రంగారెడ్డి జిల్లాలో 68,622 మందికి ఉద్యోగాలు కల్పించారు. సంగారెడ్డి, మేడ్చల్, గద్వాల జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పరిశ్రమల విషయానికొస్తే కొత్తగా ఏర్పాటైన వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 169 ఫార్మా, కెమికల్స్, 87 పవర్, 165 ప్లాస్టిక్, రబ్బర్, 280 ఇంజనీరింగ్, 195 ఆగ్రో బేస్డ్, 46 ఎలక్ట్రికల్, ఎల క్ట్రానిక్స్, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్, 69 పేపర్ ప్రింటింగ్, 63 టెక్స్టైల్, 117 సిమెంట్, 7 ఏరోస్పేస్, 820 ఇతర పరిశ్రమలున్నాయి. -
ఎన్నాళ్లు!
పడకేసిన పారిశ్రామిక ప్రగతి అడుగు ముందుకు పడని వ్యాగన్ వర్క్‌షాప్ {పారంభంకాని ఐటీ ఇంక్యూబేషన్ కేంద్రం నివేదికల దశలో మగ్గుతున్న టెక్స్టైల్ పార్క్ కారుచీకట్లో వరంగల్ పారిశ్రామిక కారిడార్ హన్మకొండ : జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. ఏళ్లు గడుస్తున్నా కొత్త పరిశ్రమలు రాక జిల్లాలోని యువతకు ఉపాధి కరువైంది. వ్యాగన్ వర్క్‌షాప్, టెక్స్టైల్స్ పార్క్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అంటూ నాయకులు పేర్లు వల్లించడం మినహా పురోగతి కనిపించడం లేదు.కొత్త పరిశ్రమలు కరువై హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ కారు చీకట్లో మగ్గుతోంది. ముందుపడని వర్కషాప్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న వ్యాగన్ వర్క్‌షాప్ ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. మడికొండ సమీపంలోని అయోధ్యపురంలో మెట్టురామలింగేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 54 ఎకరాల భూమిని పరిశ్రమ స్థాపనకు అనువైనదిగా ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని దేవాదాయశాఖ నుంచి రవాణాశాఖకు బదలాయించడానికే నాలుగేళ్లు పట్టింది. ఆర్నెళ్ల కిందట భూసేరణకు నిధులు మంజూరయ్యాయి. ఇక సర్వం సిద్ధం వ్యాగన్ పరిశ్రమ నెలకొల్పడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వాధినేతలు, రెవెన్యూ యంత్రాంగం హడావుడి చేసింది. వ్యాగన్ పరిశ్రమకు కేటాయించిన స్థలంలో ఉన్న ఇళ్లను కూల్చివేశారు. సంబంధింత పొలాల్లో కౌలు చేస్తున్న రైతులను వ్యవసాయానికి దూరం పెట్టారు. ఆర్నెళ్లు గడిచినా పురోగతి లేదు. ప్రాజెక్టు పనులు త్వరిగతగిన చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపించడం లేదు. అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాల వల్ల వరంగల్ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీనితో రైల్వేశాఖపై ఒత్తిడి లేదు. కానరాని కమిటీ వస్త్ర పరిశ్రమకు వరంగల్‌ను హాబ్‌గా తయారు చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా 2015 జనవరిలో హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్, అనుబంధ పరిశ్రమలు వీటికి సంబంధించిన టౌన్షిప్ తదితర నిర్మాణాల కోసం ఒకే చోట 2 వేల ఎకరాల స్థలం అన్వేషించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అంతేకాకుండా దేశంలో వస్త్ర పరిశ్రమకు కేంద్రాలుగా విరాజిల్లుతున్న సోలాపూర్, సూరత్, తిర్పూర్‌లలో పర్యటించేందుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం, అప్పటి ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో స్థ్థానిక ప్రజాప్రతినిధులను చేర్చి కమిటీ వేశారు. వస్త్ర పరిశ్రమ తీరుతెన్నులూ, వరంగల్‌లో నెలకొల్పబోయే పరిశ్రమలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ 2015 జనవరి 30లోగా ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంది. ఆర్నెళ్లు గడుస్తున్నా నివేదిక సమర్పించ లేదు. మరోవైపు 2వేల ఎకరాల స్థలసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. పురుడుపోసుకోని ఇంక్యూబేషన్ వరంగల్ నగరంలో ఐటీ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు 2013 మేలో రూ. 5.60 కోట్ల వ్యయంతో ఇంక్యూబేషన్ సెంటర్ నిర్మాణం ప్రారంభించారు. నేటి యువతలో క్రేజ్ ఉన్న ఐటీ పరిశ్రమ వరంగల్ నగరంలో వేళ్లూనుకునేందుకు ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ అప్పట్లో ఢంకా భజాయించారు. ప్రస్తుతం మడికొండలోని పారిశ్రామిక వాడలో ఇంక్యుబేషన్ సెంటర్ భవన నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. 1500 అడగుల వర్కింగ్ ప్లేస్ ఇక్కడ అందుబాటులో ఉంది. నిరంతరం విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్ పనులు పూర్తయ్యాయి. కానీ వరంగల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆకర్షించేందుకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం జరగ లేదు. అడిగేవారు కరువైపోవడంలో నిర్మాణం మొత్తం పూర్తైనా అరకొరగా మిగిలిన విద్యుత్ వైరింగ్ పనులను నెలలతరబడి చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ప్రకటించినందున .. వరంగల్‌లో ఐటీ పరిశ్రమలు వచ్చేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. -
పరిశ్రమలపై చార్జీల పిడుగు
-
పరిశ్రమలపై చార్జీల పిడుగు
సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు రాకపోగా విద్యుత్ చార్జీల భారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని కుదిపేస్తోంది. తాజాగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆ రంగం జీర్ణించుకోలేకపోతోంది. భారీ పరిశ్రమలకు ఇది మరింత పెనుభారంగా మారుతోందని అంటున్నారు. దీనివల్ల కొత్త పరిశ్రమలు వచ్చేదెలాగని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమలకు పెద్దఎత్తున విద్యుత్ రాయితీలిచ్చారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం ఏకంగా 10 శాతం విద్యుత్ భారాన్ని మోపింది. ప్రస్తుతం కొత్త రాష్ట్రం కావడం, పారిశ్రామిక పెట్టుబడులకోసం ప్రయత్నిస్తున్న కారణంగా విద్యుత్ చార్జీల మోత ఉండదని భావించారు. డిస్కంలు మాత్రం ఇందుకు భిన్నంగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించాయి. పరిశ్రమలకు దాదాపు 6 శాతం పెంపును ప్రతిపాదించాయి. దీనివల్ల ప్రత్యక్షంగా రూ.450 కోట్ల భారం పడుతుందని వారంటున్నారు.పీక్ అవర్స్‌లో వాడుకునే విద్యుత్ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచాలని నిర్ణయించింది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య అదనపు చార్జీ చెల్లించాలనేది ప్రభుత్వ వాదన. దీన్ని కె.వి.ల వారీగా విధించారు. టైమ్ ఆఫ్ డే(టీవోడీ) చార్జీలు గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పెంచిన దానికన్నా, అదనంగా 6 శాతం పెంచారు. మొత్తం యూనిట్లకు ఇది పూర్తిగా అదనమే. ఈ సమయంలో గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తాయని, కొత్త రాష్ట్రం కావడం వల్ల ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయని, అనుమతులు కూడా తేలికగా లభిస్తాయని పారిశ్రామిక వేత్తలు అంచనా వేశారు. సింగపూర్, జపాన్ కంపెనీలు పెద్ద ఎత్తున భారీ పరిశ్రమలకు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. దీనికితోడు హెచ్‌టీ నష్టాలు బాగా తగ్గుతాయనీ స్పష్టం చేశారు. దీన్నిబట్టి విద్యుత్ వినియోగం పరిశ్రమలకు కనీసం 20 నుంచి 30 శాతం పెరుగుతుందనేది ఓ అంచనా. -
పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యాన్ని సహించం
మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యా న్ని సహించబోమని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపన కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోనే అన్నిరకాల అనుమతులు ఇస్తామన్నారు. అనుమతుల జారీలో ఒక్కరోజు ఆలస్యమైనా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘అభివృద్ధి కోసం పరిపాలన’ అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవా రం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో జూపల్లి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐ-పాస్)లో నూతన పరిశ్రమలకు 100 శాతం స్టాంపు డ్యూటీ మినహా యింపుతోపాటు 5 ఏళ్లు, ఏడేళ్ల వరకు పన్నుల మినహాయింపులు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అపారమైన సహజ, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారన్నారు. పారిశ్రామికీకరణలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని అందుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుతోత్పత్తి 12 వేల నుంచి 20 వేల మెగావాట్లకు పెరుగుతుందని, మిగులు విద్యుత్‌ను సాధిస్తుందన్నారు. ఈ సదస్సులో హిమాచల్‌ప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం కులపతి, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అరుణ్ మైరా, సీఐఐ తెలంగాణ చెర్మైన్ వనితా డాట్ల, నృపేందర్‌రావు, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పరిశ్రమలు వచ్చేనా?
జిన్నారం: పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కొత్త విధానాలు రూపొందించడంతో జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయ, వాణిజ్య రంగాలతో పాటు పరిశ్రమలకు కూడా పెద్దపీట వేస్తామంటూ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటుపై సింగిల్ విండో పథకాన్ని చూపొందించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ పథకంతో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ పారిశ్రామిక విధానంపై నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పాలసీపై పారిశ్రామిక వేత్తల నుంచి కొంత సానుకూలత, వ్యతిరేకతలు వస్తున్నాయి. ప్రోత్సాహాలన్నీ కొత్తగా పరిశ్రమలు స్థాపించబోయే వారికేనా అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను కాపాడేందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 5 వేల ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఇందుకు సంబంధించి పనులను కూడా రెవెన్యూ అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి సింగిల్ విండో విధానాన్ని వర్తింపజేయటం పట్ల కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం ఈ పథకంపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. నూతన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఉన్న పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలంటున్నారు. అవుటర్ రింగు రోడ్డులోపల ఉన్న పరిశ్రమలను బయటకు పంపేందుకు ప్రభుత్వం నుంచి వత్తిడిలు వస్తున్నాయని, అదే జరిగితే తమకు ఎలాంటి సాయం అందిస్తారో సర్కార్ తన నూతన పాలసీలో తెలపలేదని పలువురు పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి మాత్రమే ప్రోత్సహాకాలను అందిస్తే, తమ పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నా, నూతన పరిశ్రమల స్థాపన జరుగుతుందో లేదోననే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగింల్ విండో పాలసీ బాగున్నప్పటికీ ఇది కేవలం నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకేనా ? ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అనుమతులు కావాలంటే ఏంచేయాలనే దానిపై స్పష్టత లేదని, పరిశ్రమలను కేటగిరీలుగా విభజించే విషయంపై కూడా స్పష్టత లేదనినే అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫార్మా, స్టీల్, ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. వీటిని కేటగిరీల వారిగా విభజించే విషయంపై ప్రభుత్వం తగిన స్పష్టతను ఇవాల్సి ఉందని యాజమన్యాలు చెబుతున్నాయి. రెడ్, గ్రీన్, ఆరెంజ్ కేటగిరీలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఏదిఏమైనా సర్కార్ పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక వేత్తలకు పలు అనుమానాలున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
పరిశ్రమలకు జిల్లా అనుకూలం
తాండూరు: కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు జిల్లాలో భూములు సిద్ధంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ పిలుపుతో అనేక పరిశ్రమలు తరలివస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లు పెద్ద కంపెనీలకు ఆహ్వానం పంపగా వారి నుంచి సానుకూల స్పందన వస్తున్నదని, అదే ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేస్తే అధిక మొత్తంలో భూములు ఇస్తామన్నా కంపెనీలు ఆసక్తి చూపడంలేదని అన్నారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా అనుకూలంగా ఉంటుందని, ఆయా కంపెనీలకు అన్ని రకాల అనుమతులు త్వరితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. జిల్లాలోని భూములను గుర్తించి, పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధం చేశామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విభజన ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, కేంద్రం ఆర్టీసీ విభజన, ఆస్తుల పంపకంపై ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసిందని, ఈ విషయమై కేంద్రంతో చర్చించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్తున్నామని మంత్రి చెప్పారు. రూ.1,061కోట్ల రుణాలు మాఫీ జిల్లాలో 2.15లక్షల మంది రైతులకు సుమారు రూ.1,061కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని మంత్రి వెల్లడించారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో 30,549మంది రైతులకు సుమారు రూ.151కోట్ల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. అదే విధంగా జిల్లాలోని పలు మండలాల్లో కొత్తగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావుతో మాట్లాడినట్టు వివరించారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, కోట్‌పల్లిలో కొత్తగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయని, మిగితా నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించామని మంత్రి చెప్పారు. రెండు, మూడు నెలల్లో కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పత్తి, మొక్కజొన్న, జొన్న, పసుపు, పెసర్లు, మినములు, కంది, ఆముదాల పంటలను ప్రభుత్వం సాధారణ పంటలుగా గుర్తించి, పంట బీమా సదుపాయాన్ని ఈనెల 30వరకు పొడిగించినట్టు వివరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా రూ.50కోట్లతో పాఠశాలల భవనాలు, మౌలిక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. టీచర్ల కొరత తీర్చేందుకు సర్కారు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.