న్యూఢిల్లీ: పునరుత్పదాక విద్యుత్ విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అదానీ న్యూ ఇండస్ట్రీస్ .. గుజరాత్‌లోని ముంద్రాలో అత్యంత భారీ పవన విద్యుత్ టర్బైన్ జనరేటర్ (డబ్ల్యూటీజీ)ని ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన సమైక్యతా విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) కన్నా ఎత్తయినదని కంపెనీ తెలిపింది.
టర్బైన్ బ్లేడ్ల వెడల్పు చూస్తే జంబో జెట్ రెక్కల పొడవు కన్నా ఎక్కువగా ఉంటుందని వివరించింది. పూర్తి అనుబంధ సంస్థ ముంద్రా విండ్‌టెక్ (ఎండబ్ల్యూఎల్) దీన్ని ఇన్‌స్టాల్ చేసినట్లు పేర్కొంది. 200 మీటర్ల ఎత్తు ఉండే ఈ విండ్ టర్బైన్ .. సుమారు 4,000 గృహాలకు సరిపడేలా 5.2 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సమైక్యతా విగ్రం ఎత్తు 182 మీటర్లు. ఈ టర్బైన్ బ్లేడ్‌లు 78 మీటర్ల పొడవుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment