Mundra
-
అదానీ గ్రూప్ ప్రపంచ అతిపెద్ద కాపర్ ప్లాంట్
గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ భారీ కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే సింగిల్ లొకేషన్లో ఏర్పాటైన అతి పెద్ద కాపర్ తయారీ కర్మాగారంగా నిలవనుంది. దీనితో దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గనుంది. అంబుజాలో అదానీ వాటా అప్ రూ. 6,661 కోట్ల పెట్టుబడులు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా అంబుజా సిమెంట్స్‌లో వాటాను పెంచుకుంది. 21.2 కోట్ల వారంట్లను ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసుకోవడం ద్వారా 3.6 శాతం అదనపు వాటాను పొందింది. ఇందుకు రూ. 6,661 కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం అంబుజాలో అదానీ వాటా 66.7 శాతానికి చేరింది. దేశీయంగా సిమెంట్ తయారీలో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న అంబుజాలో ప్రమోటర్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షేరుకి రూ. 314.15 సగటు ధరలో వారంట్లను మార్పిడి చేసుకుంది. ఇంతక్రితం 2022 అక్టోబర్‌లోనూ ప్రమోటర్ సంస్థ వారంట్లను అందుకోవడం ద్వారా రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా హార్మోనియాకు 47.74 కోట్ల మార్పిడికి వీలయ్యే వారంట్లను అంబుజా సిమెంట్స్ జారీ చేసింది. -
జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ
భారతదేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులు రెట్టింపవుతున్నాయి. దాంతోపాటు దేశీయ అవసరాలకు విదేశాల నుంచి వస్తున్న దిగుమతులు హెచ్చవుతున్నాయి. ఈ వస్తురవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. దేశంలో అధికంగా తీరప్రాంతం ఉంది. కాబట్టి ఎక్కువ వస్తువులు జలమార్గంలో పోర్ట్‌ల ద్వారా రవాణా చేస్తున్నారు. తాజాగా ముంద్రాలోని అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నవంబర్ నెలకుగాను గరిష్ఠంగా 3,00,000 కంటైనర్లను సరఫరా చేశారు. అదానీ పోర్ట్ సెజ్(ఏపీ సెజ్) టెర్మినల్ నవంబర్ 2023లో 97 నౌకల్లో 3,00,431 ట్వెంటీ ఫుట్ ఈక్వాలెంట్ యునిట్(టీఈయూ)లను సరఫరా చేసి జాతీయ రికార్డును సృష్టించింది. మార్చి 2021లో ప్రతిరోజూ దాదాపు 10,000 చొప్పున 2,98,634 టీఈయూలను నెలలో సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం తన రికార్డును తాజాగా 3 లక్షల కంటైనర్ల సరఫరాతో తనే బద్దలుకొట్టింది. అంతేకాకుండా, ఏపీ సెజ్‌కు చెందిన ధమ్రా, ఎన్నూర్ పోర్ట్‌లు కూడా అత్యధిక నెలవారీ వాల్యూమ్లను నమోదు చేశాయి. వరుసగా 3.96 ఎంఎంటీ, 65,658 టీఈయూలను సరఫరా చేశాయి. ఏపీ సెజ్ కార్గో వాల్యూమ్లలో 36 ఎంఎంటీతో 42 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. ఏపీ సెజ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో 275 ఎంఎంటీ కార్గోను నిర్వహించాయి. అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు ప్రారంభంలో 4.45 శాతం పెరిగి రూ.864.40 వద్ద ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్ 2023 నాటికి, అదానీ గ్రూప్ సంస్థలో ప్రమోటర్లు 65.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. -
గుజరాత్లో అతి పెద్ద పవన విద్యుత్ టర్బైన్
న్యూఢిల్లీ: పునరుత్పదాక విద్యుత్ విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అదానీ న్యూ ఇండస్ట్రీస్ .. గుజరాత్‌లోని ముంద్రాలో అత్యంత భారీ పవన విద్యుత్ టర్బైన్ జనరేటర్ (డబ్ల్యూటీజీ)ని ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన సమైక్యతా విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) కన్నా ఎత్తయినదని కంపెనీ తెలిపింది. టర్బైన్ బ్లేడ్ల వెడల్పు చూస్తే జంబో జెట్ రెక్కల పొడవు కన్నా ఎక్కువగా ఉంటుందని వివరించింది. పూర్తి అనుబంధ సంస్థ ముంద్రా విండ్‌టెక్ (ఎండబ్ల్యూఎల్) దీన్ని ఇన్స్టాల్ చేసినట్లు పేర్కొంది. 200 మీటర్ల ఎత్తు ఉండే ఈ విండ్ టర్బైన్ .. సుమారు 4,000 గృహాలకు సరిపడేలా 5.2 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సమైక్యతా విగ్రం ఎత్తు 182 మీటర్లు. ఈ టర్బైన్ బ్లేడ్లు 78 మీటర్ల పొడవుంటాయి. -
పోస్కోతో అదానీ గ్రూప్ జత
న్యూఢిల్లీ: స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేశారు. ఎంవోయూ ద్వారా రానున్న కాలంలో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నట్లు అదానీ గ్రూప్ ఈ సందర్భంగా వెల్లడించింది. గుజరాత్‌లోని ముంద్రాలో కొత్తగా పర్యావరణ అనుకూల స్టీల్ ప్లాంటు ఏర్పాటు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, లాజిస్టిక్స్ తదితర రంగాలలో వ్యాపార అవకాశాల అన్వేషణలో పరస్పర సహకారం వంటి అంశాలపై తప్పనిసరికాని ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కర్బనాల తగ్గింపు అవసరాల రీత్యా వివిధ రంగాలలో పెట్టుబడులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సహకారం, సాంకేతికత, ఆర్థిక అంశాలతోపాటు రెండు కంపెనీలకూ ఉన్న నిర్వహణ సామర్థ్యం తదితరాలలో పరస్పర సహకారానికున్న అవకాశాలను పరిశీలించనున్నట్లు వివరించింది. అదానీ గ్రూప్ ఇటీవల పెట్రోకెమికల్స్, హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు, స్టీల్ తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ఎంవోయూకు ప్రాధాన్యత ఏర్పడింది! బలాల వినియోగం పోస్కో, అదానీ గ్రూప్లకుగల పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన కట్టుబాట్ల కొనసాగింపునకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్ తదితరాలను వినియోగించుకునే యోచనలో ఉన్నాయి. స్టీల్, పర్యావరణహిత బిజినెస్‌లలో రెండు సంస్థల మధ్య గొప్ప సమన్వయానికి వీలున్నట్లు పోస్కో సీఈవో జియోంగ్ వూ చోయ్ పేర్కొన్నారు. తమ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం దేశీ తయారీ రంగ వృద్ధికి సహకరించగలదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలియజేశారు. -
రుణమాఫీతో ఆర్థిక క్రమశిక్షణపై ప్రభావం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా ముంబై: వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక క్రమశిక్షణపై ప్రభావం చూపుతాయని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో గురువారం జరిగిన బంధన్ బ్యాంకు నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ వల్ల ఆర్థిక క్రమశిక్షణ కుంటుపడుతుందన్న ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యల్ని ఆయన పునరుద్ఘాటించారు. రుణమాఫీ విషయంలో ఆర్బీఐ నిర్ణయం ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఈ విషయమై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సూచనలు అందలేదని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందన్నదే ఆర్బీఐ అభిప్రాయమన్నారు. ఇటీవల బీజేపీ గెలిచిన ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ వంటి పలు రాష్ట్రాల్లో వ్యవసాయ రుణమాఫీ చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో ముంద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో కూడా అరుంధతితో పాటు, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘు రాం రాజన్ సైతం రుణమాఫీని వ్యతిరేకించారు. -
బ్యాంకింగ్ మోసాల కట్టడి!
♦ తాజా విధానానికి ఆర్బీఐ కసరత్తు ♦ డిప్యూటీ గవర్నర్ ముంద్రా వెల్లడి ముంబై: బ్యాంకింగ్ మోసాల్ని కట్టడి చేయటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. మోసాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీటిని నిరోధించడంలో అటు బ్యాంకింగ్ వ్యవస్థ, ఇటు కస్టమర్ పోషించాల్సిన పాత్ర... వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా చెప్పారు. అటు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతుండటంతో ఆర్బీఐ దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎలక్ట్రానిక్ లావాదేవీల విషయంలో కస్టమర్ల విశ్వాసాన్ని పెంచాలని కూడా ఆర్బీఐ భావిస్తున్నట్లు ముంద్రా తెలియజేశారు. ఆయా అంశాల్లో పురోగతికోసం త్వరలో ఒక విధానం తేనున్నట్లు బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముంద్రా తెలిపారు. మోసాలు జరగకుండా చూడటం, జరిగిన పక్షంలో కస్టమర్‌కు తగిన న్యాయం చేయటం వంటి చర్యలు ఈ విధానంలో ఉంటాయని చెప్పారాయన. ఆన్లైన్ లావాదేవీలు ఒకపక్క పెరుగుతుండగా.. మరోపక్క అనధికార నిధుల బదలాయింపు, ఏటీఎంల నుంచి మోసపూరిత లావాదేవీలు, తప్పుదారి పట్టించే ఈ-మెయిల్స్ వంటివి కూడా పెరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారాయన. ‘‘ఈ సవాళ్లను అధిగమించడానికి సమర్థమైన యంత్రాంగం కావాలి. మొబైల్ నెట్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఫండ్ బదలాయింపుల్లో మోసాలకు చోటులేని వ్యవస్థను రూపొందించాలి. అప్పుడే టెక్నాలజీపై కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది. మోసాలపై కస్టమర్లలో చైతన్యం తేవటం కూడా ముఖ్యమే. ఈ చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠతకు కూడా ఉపకరిస్తాయి’’ అని ముంద్రా వివరించారు. -
ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాలో 6 దేశీ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వినూత్న ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ఆరు దేశీ ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్‌కి చెందిన దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) చేపట్టిన నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇదే కాకుండా ఢిల్లీ మెట్రో, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, టాటా పవర్‌కి చెందిన ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (గుజరాత్), ఇంటర్‌సెప్టర్ స్యూవేజ్ సిస్టమ్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్నమైన ప్రాజెక్టులతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100’ పేరిట అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ ఈ జాబితాను తయారు చేసింది. ప్రాజెక్టు వ్యయం, సంక్లిష్టత, సాధ్యాసాధ్యాలు, నవ్యత, సమాజంపై ప్రభావం అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించినట్లు కేపీఎంజీ వివరించింది. న్యూఢిల్లీ, ఆగ్రాను కలుపుతూ దాదాపు 165 కిలోమీటర్ల పొడవుండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌వే 2012లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి 1.9 బిలియన్ డాలర్ల వ్యయం అయ్యింది. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను అభివృద్ధి చేయగలిగే సత్తా భారత్‌కి ఉందని ఇది చాటిచెప్పగలదని కేపీఎంజీ వివరించింది. మరోవైపు, 2.3 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటైన ఢిల్లీ మెట్రో ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తూ మరింతగా విస్తరిస్తోందని పేర్కొంది. 4.4 బిలియన్ డాలర్ల ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు.. భారత విద్యుత్ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మైలురాయిలాంటిదని కేపీఎంజీ తెలిపింది. ఇక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని 20 బిలియన్ డాలర్ల వ్యయంతో త లపెట్టారు. దాదాపు 400 వైవిధ్యమైన ప్రాజెక్టులను పరి శీలించి కేపీఎంజీ 100 సంస్థలను ఎంపిక చేసింది. ఎంఈఐఎల్ ప్రాజెక్టు..: 17.9 మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన నర్మదా కెనాల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టింది. కాంట్రాక్టులో భాగంగా దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవునా కెనాల్‌పై సోలార్ ఫొటోవోల్టయిక్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, 25 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు.