గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ భారీ కాపర్ ప్లాంటు తొలి దశను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే సింగిల్ లొకేషన్‌లో ఏర్పాటైన అతి పెద్ద కాపర్ తయారీ కర్మాగారంగా నిలవనుంది. దీనితో దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గనుంది.
అంబుజాలో అదానీ వాటా అప్ రూ. 6,661 కోట్ల పెట్టుబడులు
డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా అంబుజా సిమెంట్స్‌లో వాటాను పెంచుకుంది. 21.2 కోట్ల వారంట్లను ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసుకోవడం ద్వారా 3.6 శాతం అదనపు వాటాను పొందింది. ఇందుకు రూ. 6,661 కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం అంబుజాలో అదానీ వాటా 66.7 శాతానికి చేరింది. దేశీయంగా సిమెంట్ తయారీలో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న అంబుజాలో ప్రమోటర్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ షేరుకి రూ. 314.15 సగటు ధరలో వారంట్లను మార్పిడి చేసుకుంది. ఇంతక్రితం 2022 అక్టోబర్‌లోనూ ప్రమోటర్ సంస్థ వారంట్లను అందుకోవడం ద్వారా రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా హార్మోనియాకు 47.74 కోట్ల మార్పిడికి వీలయ్యే వారంట్లను అంబుజా సిమెంట్స్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment