Wind turbine
-
వెరైటీ హౌస్! గాల్లో టర్బైన్.. కిందికొస్తే ఇల్లు (ఫొటోలు)
-
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్‌ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుజరాత్లో అతి పెద్ద పవన విద్యుత్ టర్బైన్
న్యూఢిల్లీ: పునరుత్పదాక విద్యుత్ విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అదానీ న్యూ ఇండస్ట్రీస్ .. గుజరాత్‌లోని ముంద్రాలో అత్యంత భారీ పవన విద్యుత్ టర్బైన్ జనరేటర్ (డబ్ల్యూటీజీ)ని ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన సమైక్యతా విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) కన్నా ఎత్తయినదని కంపెనీ తెలిపింది. టర్బైన్ బ్లేడ్ల వెడల్పు చూస్తే జంబో జెట్ రెక్కల పొడవు కన్నా ఎక్కువగా ఉంటుందని వివరించింది. పూర్తి అనుబంధ సంస్థ ముంద్రా విండ్‌టెక్ (ఎండబ్ల్యూఎల్) దీన్ని ఇన్స్టాల్ చేసినట్లు పేర్కొంది. 200 మీటర్ల ఎత్తు ఉండే ఈ విండ్ టర్బైన్ .. సుమారు 4,000 గృహాలకు సరిపడేలా 5.2 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సమైక్యతా విగ్రం ఎత్తు 182 మీటర్లు. ఈ టర్బైన్ బ్లేడ్లు 78 మీటర్ల పొడవుంటాయి. -
Anand Mahindra: నితిన్ గడ్కారీజీ మనమూ ఇలా చేద్దామా?
కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రిగా నితిన్ గడ్కారీ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓవైపు ఈవీ వెహికల్స్‌ని ప్రోత్సహిస్తూనే మరోవైపు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో స్వయంగా హైడ్రోజన్ సెల్ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్సీ ఇంజన్ల తయారీపై మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సూచనలు చేస్తున్నారు. కాలుష్య రహిత ఇంధనం కోసం ఇంతలా పరితపిస్తున్న మంత్రి నితిన్ గడ్కారీకి ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఓ సూచన చేశారు. టర్కీకి చెందిన ఇస్తాంబుల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. రోడ్లపై వాహనాలు వేగంగా ప్రయాణించినప్పుడు గాలిని చీల్చుకుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో గాలులు బలంగా వీస్తాయి. ఈ విండ్ ఫోర్స్‌ని ఉపయోగించుకుని కరెంటు ఉత్పత్తి చేసే టర్బైన్లని డెవలప్ చేశారు. ఈ టర్బైన్లు గంటకి 1 కిలోవాట్ పవర్‌ను జనరేట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టను టర్కీలోని ఇస్తాంబుల్ రోడ్లపై చేపట్టారు. ఇస్తాంబుల్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వీడియోను ఉద్దేశిస్తూ .. ఇండియాలో ఉన్న ట్రాఫిక్‌కి ఈ తరహా ప్రాజెక్టును కనుక చేపడితే ప్రపంచంలోనే విండ్ పవర్లో ఇండియా గ్లోబల్ ఫోర్స్‌గా నిలుస్తుంది. మనదేశంలోని హైవేల వెంట ఇలాంటి టర్బైన్లు ఏర్పాటు చేద్దామా అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అడిగారు ఆనంద్ మహీంద్రా. Developed by Istanbul Technical University. Ingenious. Uses the wind generated by passing traffic. Given India’s traffic, we could become a global force in wind energy! 😊 Can we explore using them on our highways @nitin_gadkari ji? https://t.co/eEKOhvRpDo — anand mahindra (@anandmahindra) April 6, 2022 -
సుజ్లాన్ షేర్ల కోసం ఓపెన్ ఆఫర్
- ప్రమోటర్ల నుంచి 23 శాతం వాటా కొన్న సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి - మరో 26 శాతం వాటాకు షేరుకు రూ. 18 ధరపై ఆఫర్ - 20 శాతం ఎగసిన షేరు ధర న్యూఢిల్లీ: పవన విద్యుదుత్పత్తిలో ఉపయోగపడే విండ్ టర్బైన్లు తయారు చేసే సుజ్లాన్ ఎనర్జీ షేర్ల కోసం డీఎస్ఏ(దిలిప్ సంఘ్వి ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్) ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఒక్కో షేర్‌ను రూ.18 చొప్పున 26 శాతం వాటాను(157.64 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనున్నామని డీఎస్ఏ తెలిపింది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం రూ.2,838 కోట్లు కేటాయించింది. సుజ్లాన్ ఎనర్జీలో 23 శాతం వాటా కొనుగోలు (రూ.1,800 కోట్లతో) కోసం సుజ్లాన్ ఎనర్జీ, సన్ ఫార్మాకు ప్రమోటర్ అయిన దిలిప్ సంఘ్వి, కుటుంబ సభ్యులు(డీఎస్ఏ) మధ్య గత వారంలో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత సుజ్లాన్ ఎనర్జీలో డీఎస్ఏ వాటా 23 శాతంగా, సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి కుటుంబానికి 24 శాతం చొప్పున వాటాలుంటాయి. ఒప్పందం ప్రకారం యాజమా న్య నియంత్రణ తంతి కుటుంబానికే ఉంటుంది. వెయ్యి కోట్లు పెరిగిన మార్కెట్ క్యాప్ ఈ పరిణామాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 23 వద్ద ముగిసింది. ఒక్క సోమవారం రోజే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,089 కోట్లు పెరిగి రూ.7,606 కోట్లకు చేరింది.