పరిశ్రమల స్థాపన సులభతరం
సాక్షి, బెంగళూరు: దేశ ఆర్థికాభివృద్దికి కీలకమైన వ్యాపారాలు, ఉత్పాదనలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన 7వ ఇండియన్ స్టెయిన్‌లెస్ స్టీల్ హౌస్‌వేర్ మేళా–2017 ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆన్‌లైన్‌లోనే కొత్త కంపెనీలను రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు.
కొత్త పరిశ్రమలు ప్రారంభించేవారికి ఎటువంటి హామీలు, పూచీకత్తులు లేకుండా రూ.2 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. చిన్న,మధ్య తరహా పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తుల్లో 20శాతం ఉత్పత్తులను భారీ పరిశ్రలు తప్పనిసరిగా వినియోగించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. జీఎస్‌టీ గురించి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు సందేహలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800111955కి కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.