Kalraj Mishra
-
కొలువుదీరిన రాజస్తాన్ కొత్త కేబినెట్
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సజావుగా సాగింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గానికి రూపకల్పన జరిగింది. మొత్తంగా 15 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 11 మంది కేబినెట్ హోదా కలిగిన వారు కాగా, నలుగురు సహాయమంత్రులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి చెందిన అయిదుగురికి చోటు లభించింది. గత ఏడాది ముఖ్యమంత్రి గహ్లోత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాట బావుటా ఎగురవేసిన సమయంలో ఆయన వెంట ఉంటూ వేటుని ఎదుర్కొన్న విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. పైలెట్ వర్గ ఎమ్మెల్యేలైన హేమరామ్ చౌధరి, బ్రిజేంద్రసింగ్ ఒలా, మురారిలాల్ మీనాలకు సహాయ మంత్రులు పదవులు దక్కాయి.కొత్త కేబినెట్‌పై సచిన్ సంతృప్తి వ్యక్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుభసందేశాన్ని అందిస్తుందన్నారు.రాజస్థాన్ కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు వెళుతుందని, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ప్రమాణ స్వీకారనంతరం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సచిన్? ఉప ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్ష పదవుల్ని పోగొట్టుకున్న అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ పాత్ర కాంగ్రెస్‌లో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సచిన్ పైలెట్ సమావేశమైనప్పుడు పార్టీలో తన స్థానంపై చర్చించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని సోనియా హామీ ఇచ్చినట్టుగా పైలెట్ శిబిరం ప్రచారం చేస్తోంది. అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏదైనా రాష్ట్రానికి ఇన్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రాష్ట్రానికి ఇన్చార్జ్గా వెళ్లినప్పటికీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సచిన్ కీలకంగా వ్యవహరించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ రాష్టానికే ఇన్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంకగాంధీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సచిన్‌కి ఇప్పటికే అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా సమాచారం. ఇక ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్ర్రాల్లోనూ సచిన్ స్టార్ క్యాంపైనర్‌గా కూడా వ్యవహరిస్తారు. -
‘అసెంబ్లీ సమావేశాలు అడ్డుకోలేదు, కానీ..’
జైపూర్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తానెప్పుడూ అడ్డు పడలేదని, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోతే సమావేశాల ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించలేదని రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆరోపించారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న డిమాండ్‌కు తాను ఎప్పడూ అడ్డు చెప్పలేదని, పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టే మొదట్లో ఒప్పుకోలేదన్నారు. సాధారణ అసెంబ్లీ సమావేశాలా? లేక బల పరీక్ష కోసం అసెంబ్లీ సమావేశాలా? అన్నదానిపై సీఎం గహ్లోత్ స్పష్టతే ఇవ్వలేదని గవర్నర్ మిశ్రా ఆరోపించారు. రాజ్‌భవన్ ముందు ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్ ధర్నాకు దిగడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. 1995 లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్‌భవన్ ముందు ధర్నా గురించి ప్రస్తావించగా... ఈ ధర్నాకు, గహ్లోత్ చేసిన ధర్నాకు చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. సీఎం గహ్లోత్ మెజారీ ఉందని చూపించేంత వరకూ ప్రభుత్వంపై తానేమీ వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు. (చదవండి : రాజస్తాన్ డ్రామాకు తెర) రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలి కదా అని ప్రశ్నించినగా,.‘అవును గవర్నర్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. అయితే కోర్టు ఆదేశాలను, నిబంధనలను కూడా శ్రద్ధతో చూడాల్సి ఉంటుంది కదా’అని గవర్నర్ మిశ్రా పేర్కొన్నారు. కాగా, అనేక నాటకీయ పరిణామాల తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ మిశ్రా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం మిశ్రా పేర్కొన్నారు. -
రాజస్తాన్ డ్రామాకు తెర
జైపూర్: రాజస్తాన్ రాజకీయ డ్రామాకు ప్రస్తుతానికి తెర పడింది. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించారు. దాంతో గవర్నర్, కాంగ్రెస్ సర్కార్ల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. అంతకుముందు, బుధవారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. జులై 31 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ గవర్నర్‌కు పంపిన మూడో సిఫారసును గవర్నర్ వెనక్కు పంపించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో తను కోరిన వివరణలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, అసెంబ్లీ భేటీలను ప్రారంభించడానికి సహేతుక కారణం పేర్కొంటూ మళ్లీ ప్రతిపాదన పంపాలని గవర్నర్ పేర్కొన్నారు. దాంతో, బుధవారం మళ్లీ సమావేశమైన సీఎం గహ్లోత్ కేబినెట్.. ఆగస్ట్ 14 నుంచి సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. కేబినెట్ సిఫారసులను వెనక్కు పంపిస్తూ.. గవర్నర్ ప్రతీసారి ప్రస్తావిస్తున్న 21 రోజుల నోటీసు పీరియడ్ నిబంధన అమలయ్యేలా ఆగస్ట్ 14వ తేదీని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సీఎం గహ్లోత్ ఎంచుకున్నారు. గవర్నర్‌కు తొలి ప్రతిపాదన పంపిన జులై 23 నుంచి పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనను పంపించారు. స్వల్ప వ్యవధి నోటీసుతో సమావేశాలను ప్రారంభించేందుకు కారణం చూపకపోతే 21 రోజుల నోటీసు వ్యవధితో సమావేశాలను ప్రారంభించవచ్చని గత ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రేమ లేఖ అందింది: ఈ నేపథ్యంలో గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో దాదాపు పావుగంట పాటు సీఎం గహ్లోత్ సమావేశమయ్యారు. ‘ప్రేమ లేఖ అందింది. తేనీటి సేవనం కోసం ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తున్నాను’అని రాజ్‌భవన్‌కు వెళ్లేముందు గహ్లోత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో సమావేశం తరువాత కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం, ఆగస్ట్ 14 నుంచి శాసన సభ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్ పంపించారు. మరోవైపు, గవర్నర్ కల్రాజ్ మిశ్రాను బుధవారం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి కలిశారు. కాగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశామని, స్పీకర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా తెలిపారు. -
మరోసారి గవర్నర్ వద్దకు సీఎం గహ్లోత్
జైపూర్: రాజాస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసేందుకు వెళ్తున్నానని సీఎం అశోక్ గహ్లోత్ చెప్పారు. అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించేందుకు గవర్నర్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు వెళ్తున్నానని బుధవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు. తమ ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకునేందుకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్నాటు చేయాలన్న సీఎం గహ్లోత్ మూడో ప్రతిపాదనను కూడా గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. మెజారిటీని నిరూపించుకునే బలపరీక్షలో తమ ప్రభుత్వమే విజయం సాధిస్తుందని సీఎం అశోక్ గహ్లోత్ ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చే ముందు గవర్నర్ 21 రోజులు లేదా 31 రోజుల నోటీసులు ఇచ్చినా మా ప్రభుత్వమే విజయం సాధిస్తుంది’ అని చెప్పారు. ఇప్పటికే గవర్నర్ మూడు కారణాలను చూపుతూ సీఎం గెహ్లాట్ చేసిన రెండు ప్రతిపాదనలను రద్దు చేశారు. (చదవండి: రాజ్‌భవన్‌లో ముగిసిన హైడ్రామా, వెనుదిరిగిన సీఎం) అవి: అసెంబ్లీ సెషన్‌కు 21 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, విశ్వసనీయ ఓటు విషయంలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, కరోనా నేపథ్యంలో సభలో తగినంత భౌతిక దూరం పాటించే చర్యలు అనే మూడు కారణాలతో మిశ్రా సెంబ్లీ సమావేశాల నిర్వహణను వాయిదా వేసినట్టు తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఉటంకిస్తూ ఒక అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేక ఆవశ్యకత లేకుండా పిలుపునివ్వలేమన్నారు. అంతేగాక 200 మంది ఎమ్మెల్యేలు సామాజిక దూరం పాటిస్తూ విశ్వాస పరీక్షలో పాల్గొనెందుకు అసెంబ్లీలో సీటింగ్ ప్రణాళిక లేదని గవర్నర్ స్పష్టం చేశారు. అదే విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని గవర్నర్ మిశ్రా పేర్కొన్నారు. మార్చి 13న మొదటి సారి అసెంబ్లీ సమావేశాన్ని రద్దు చేసినప్పుడు కరోనా పాజిటివ్ కేసులు రెండు నమోదయ్యాయి. కరోనా దృష్ట్యా సమావేశం వాయిదా పడినట్లు గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 10,000 దాటిందని ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఎవరి బలమెంతో అక్కడే తేలుతుంది: గెహ్లోత్) -
మళ్లీ మార్చి పంపండి!
జైపూర్: రాజస్తాన్ రాజకీయ డ్రామా కొనసాగుతోంది. 31వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ సవరణలతో పంపిన ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రా సోమవారం వెనక్కు పంపారు. మరి కొన్ని వివరాలతో మరో ప్రతిపాదనను పంపించాలని కేబినెట్‌ను కోరారు. ‘కొన్ని వివరణలు కోరుతూ గవర్నర్ ఆ ఫైల్‌ను వెనక్కు పంపించారు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేబినెట్ పంపిన తొలి ప్రతిపాదనను ఆరు అంశాలపై వివరణ కోరుతూ గవర్నర్ వెనక్కిపంపడం తెల్సిందే. వాటికి వివరణ ఇస్తూ ఈ నెల 31 నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని కోరుతూ రెండో ప్రతిపాదనను కేబినెట్ గవర్నర్‌కు పంపించింది. తాజాగా దాన్నీ గవర్నర్ వెనక్కు పంపించారు. మెజారిటీని నిరూపించుకునేందుకే అయితే, స్వల్ప వ్యవధిలో అసెంబ్లీని సమావేశపర్చే అవకాశముందని గవర్నర్ పేర్కొన్నారు. ‘విశ్వాస పరీక్ష కోసమే అసెంబ్లీ భేటీని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో లేదు’అన్నారు. రెండో సారి ప్రతిపాదనను తిరస్కరిస్తూ గవర్నర్ ప్రభుత్వానికి పంపిన నోట్లో ఆ వివరాలున్నాయి. ఆ నోట్లో ‘21 రోజుల నోటీస్ పీరియడ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే శాసన సభను సమావేశపర్చవచ్చు. లేదా, సమావేశం ఎజెండా బలనిరూపణే అయితే, ఆ నోటీస్ కాల వ్యవధిని తగ్గించవచ్చు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. ఆ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలి’అని ఉంది. అయితే, అసెంబ్లీ భేటీ సందర్భంగా విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని గవర్నర్‌కు పంపిన నోటీసులో ప్రభుత్వం పేర్కొనకపోవడం గమనార్హం. ‘సామాజిక, ఆర్థిక అంశాలపై ఆన్‌లైన్‌లోనూ చర్చ జరపవచ్చు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు కేసుల విచారణను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నాయి’అని గవర్నర్ సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ 200 మంది ఎమ్మెల్యేలు, వెయ్యి మంది సిబ్బంది కూర్చునే వీలు శాసన సభలో లేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతికి సీఎల్పీ లేఖ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రపతి జోక్యం చేసుకుని రాజస్తాన్ అసెంబ్లీని సమావేశపర్చేలా చూడాలని కోరారు. కేంద్రమంత్రి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారనేందుకు ఆధారాలున్నా, కేబినెట్ నుంచి తొలగించకపోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. కాగా, సచిన్ పైలట్ నాయకత్వంలోని రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై జులై 24 వరకు చర్యలు తీసుకోవద్దని రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం వెనక్కు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గవర్నర్ల అధికార నివాసాలైన రాజ్భవన్ల వద్ద సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మోదీకి గహ్లోత్ ఫోన్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వివరించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభం, అసెంబ్లీని సమావేశపర్చాల్సిన అవసరం, కరోనా విపత్తు తదితర అంశాలను ప్రధానికి చేసిన ఫోన్ కాల్లో సీఎం గహ్లోత్ వివరించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం సీఎం గహ్లోత్ ప్రధాని మోదీకి ఇవే వివరాలతో ఒక లేఖ కూడా రాశారు. -
31 నుంచి అసెంబ్లీ పెట్టండి
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు తాజా ప్రతిపాదనను పంపించారు. ఆ లేఖ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు శనివారం రాత్రే చేరిందని రాజ్ భవన్ వర్గాలు ఆదివారం తెలిపాయి. కరోనా వ్యాప్తిపై చర్చ, రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ, అత్యవసరంగా చేపట్టాల్సిన బిల్లులు.. మొదలైన అంశాలను తాజా ప్రతిపాదనలో చేర్చారు. అయితే, గహ్లోత్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష ఆ ప్రతిపాదిత ఎజెండాలో ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు. అసెంబ్లీ భేటీ కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ధర్నా అనంతరం, ఆరు అంశాల్లో ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. పూర్తి వివరాలతో మళ్లీ ప్రతిపాదన పంపాలని కోరారు. మెజారిటీ ఉన్నప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. దాంతో శనివారం మళ్లీ సమావేశమైన కేబినెట్ తాజా ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. గవర్నర్‌పై కేంద్రం ఒత్తిడి కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో కేబినెట్ సిఫారసుల ప్రకారం గవర్నర్ నడుచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌లో విలీనమైన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ సీపీ జోషి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ విమర్శించారు. కరోనా వ్యాప్తిపై గవర్నర్ ఆందోళన రాజస్తాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోందని కల్రాజ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి యాక్టివ్ కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగిందన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో గవర్నర్ కరోనాపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ స్వరూప్, డీజీపీ భూపేంద్ర యాదవ్ ఆదివారం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి రాజ్‌భవన్ భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించారు. రాజ్భవన్ల ముందు కాంగ్రెస్ నిరసనలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు గవర్నర్లు అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దేశంలోని అన్ని రాజ్ భవన్ల ఎదుట సోమవారం ఉదయం నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముందు ‘సేవ్ డెమొక్రసీ – సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జెవాలా తెలిపారు. అయితే, ఆ కార్యక్రమాన్ని రాజస్తాన్‌లో మాత్రం నిర్వహించబోవడం లేదని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ తెలిపారు. గతంలో మధ్యప్రదేశ్‌లో, ఇప్పుడు రాజస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు బీజేపీ ఖూనీ చేసిందని సూర్జెవాలా విమర్శించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను బీజేపీ కాలరాస్తోందని ఆరోపిస్తూ ‘స్పీక్ అప్ ఫర్ డెమొక్రసీ’ పేరుతో దేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారాన్ని కాంగ్రెస్ ఆదివారం ప్రారంభించింది. కాంగ్రెస్ విమర్శలపై.. ‘900 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట’ అంటూ బీజేపీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు సతిష్ పూనియా స్పందించారు. మరోవైపు, సచిన్ పైలట్ సహా 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. -
గెహ్లాత్ ఎత్తుగడ: గవర్నర్‌కు కొత్త ప్రతిపాదన
జైపూర్ : రాజస్తాన్ రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తాజాగా మరో కొత్త ఎత్తుగడ వేశారు. ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ, పరీక్షలు, సహా వివిధ అంశాలపై చర్చించాలని అజెండాలో వివరించారు. కానీ బలపరీక్ష అంశం అజెండాలో మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై గవర్నర్ తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే గవర్నర్‌కు సమర్పించిన లేఖ బలపరీక్ష అంశం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం అజెండాను తయారుచేసి గవర్నర్‌కు అందించారు. (ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం) వ్యూహంలో భాగంగా సీఎం కొత్త ఎత్తుగడ వేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు కల్‌రాజ్‌మిశ్రాతో భేటీ అయిన గెహ్లాత్ ఫోర్ల్‌టెస్ట్‌కు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ఎంతకీ స్పందించకపోవడంతో శుక్రవారం రాజ్‌భవన్ ముందు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామన్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు. (వేడి రగిల్చిన పైలట్ దారెటు?) -
స్వతంత్రుల చేతుల్లోకి గెహ్లాత్ ప్రభుత్వం..!
జైపూర్ : ఎడారి రాష్ట్రం రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎంతకీ వీడటంలేదు. నిన్నటి వరకు రిసార్టులు, న్యాయస్థానాల వేదికగా చోటుచేసుకున్న హైడ్రామా తాజాగా గవర్నర్ అధికారికి నివాసమైన రాజ్‌భవన్‌కు చేరింది. హైకోర్టు ఉత్తర్వుల నేపపథ్యంలో తిరుగుబాటు నేతల నుంచి తమ ప్రభుత్వానికి ముంపు పొంచి ఉందన్న విషయాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పరిస్థితి చేయిదాటకముందే బల నిరూపణ చేసుకోవాలని వ్యూహాలు రచించారు. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా మోకాలొడ్డుతున్నారు. ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో అసెంబ్లీని సమావేశపరిచేలా చర్యలు తీసుకోలేనని తేల్చిచెప్పారు. దీంతో అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. అదికాస్తా రాజ్‌భవన్ ఎదుట ధర్నాకు దారితీసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అత్యవసరంగా మంత్రివర్గాన్ని సమావేశపరిచిన గెహ్లాత్.. శాసనసభను సమావేశపరచాలని తీర్మాన్నించారు. (రాజ్‌భవన్ ఎదుటే బైటాయింపు) గవర్నర్‌కు వేరే మార్గం లేదు.. అంతేకాకుండా అసెంబ్లీలో తనకు 102 మంది సభ్యుల మద్దతుందని గవర్నర్‌కు విన్నపించారు. ఈ నివేదికను శనివారం ఉదయమే గవర్నర్‌కు పంపనున్నారు. మరోవైపు రాజస్తాన్ గవర్నర్ తీరుపై పలువురు విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పడు కర్ణాటకలో వ్యవహరించిన రీతిలో ఇక్కడ గవర్నర్ వ్యహరించకపోవడానికి రాజకీయ పరమైన ఒత్తిడే కారనమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా తలదూర్చలేని కేంద్రం గవర్నర్‌ను పావుగా ఉపయోగించుకుని గెహ్లాత్ వ్యూహాలకు చెక్పెడుతుందన్న విమర్శా వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. (రాజస్తాన్ సంక్షోభం : పైలట్‌కు భారీ ఊరట) సర్కార్ ఊడుతుందా..? రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 ప్రకారం నడుచుకుంటానని చివరకు గవర్నర్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ ఆగ్రహం కొంత చల్లబడినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశంపై శనివారం మధ్యాహ్నంలోపు గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు బలపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన 19 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంటడంతో గెహ్లాత్ భవిష్యత్ అంతా స్వతంత్ర ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లింది. వారి నిర్ణయంపైనే సర్కార్ ఊడుతుందా..? నిలబడుతుందా అనేది ఆధారపడి ఉంది. -
రాజ్‌భవన్ ఎదుటే బైటాయింపు
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. తాజాగా, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు వేదిక మారింది. సోమవారం నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు. రాజ్‌భవన్‌లోనికి వెళ్లిన గహ్లోత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో మాట్లాడారు. ఆ తరువాత గవర్నర్ రాజ్‌భవన్ ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడారు. అసెంబ్లీ భేటీపై ప్రకటన చేసే వరకు ధర్నా చేస్తా్తమని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇవ్వడంతో ఐదు గంటల అనంతరం ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించారు. అయితే, సీఎం నుంచి గవర్నర్ కొన్ని వివరణలు కోరారని, వాటిపై ఈ రాత్రి కేబినెట్ భేటీలో గహ్లోత్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అయితే, అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. జైపూర్ శివార్లలోని ఒక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు నాలుగు బస్సుల్లో అక్కడి నుంచి గహ్లోత్ నేతృత్వంలో రాజ్‌భవన్ చేరుకున్నారు. అంతకుముందు, ఆ హోటల్ వద్ద గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ను తన రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తించనివ్వకుండా ‘పై’నుంచి ఒత్తిడి వస్తోందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కోరుతూ గురువారమే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే తమది బాధ్యత కాబోదన్నారు. 103 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద ధర్నా చేస్తున్నారని, ఇకనైనా గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చేందుకు ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సుభాష్ గార్గ్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ వద్ద ఘర్షణ వద్దని, గాంధీ మార్గంలో నిరసన తెలపాలని ఎమ్మెల్యేలకు గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని, అసెంబ్లీ వేదికగానే ఆవిషయాన్ని రుజువు చేస్తామని గహ్లోత్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో ఆ ఎమ్మెల్యేలను బౌన్సర్లను పెట్టి వారిని ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించారని ఆరోపించారు. ఇప్పుడే అసెంబ్లీని సమావేశపర్చవద్దని గవర్నర్‌పై ఒత్తిడి వస్తోందని గహ్లోత్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, కరోనా వైరస్ విస్తృతి, ఆర్థిక రంగ దుస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్‌ను కోరాం. కానీ, ఇప్పటివరకు గవర్నర్ నుంచి స్పందన లేదు. పైలట్ వర్గం ప్రస్తుతానికి సేఫ్ సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చడానికి కోర్టు ఆమోదం తెలిపింది. హైకోర్టులో రిట్ పిటషన్‌పై విచారణ సాగుతుండగానే.. అసెంబ్లీ స్పీకర్ జోషి బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరోవైపు, కాంగ్రెస్‌లో కొన్ని నెలల క్రితం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరడాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంటూ, ఆ విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ శుక్రవారం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను అభ్యర్థించానని, దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ ఎమ్మెల్యే పిటిషన్లో వివరించారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరగనుంది. ఆ బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంతోనే గహ్లోత్ సర్కారు పూర్తి మెజారిటీ సాధించగలిగింది. -
రాజ్‌భవన్‌లో ముగిసిన హైడ్రామా, వెనుదిరిగిన సీఎం
జైపూర్/ఢిల్లీ: ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో నిరసనకు దిగిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేటికి ఆ కార్యక్రమాన్ని విరమించారు. తనకు మద్దతిస్తున్న 102 మంది ఎమ్మెల్యేల లిస్టును గవర్నర్‌కు సమర్పించిన అనంతరం ఆయన రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి వెనుదిరిగారు. అంతకుముందు రాజ్‌భవన్ వేదికగా కొంత హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. గవర్నర్ కల్రాజ్ మిశ్రా వైఖరికి నిరసనగా సీఎం గహ్లోత్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో బైఠాయించారు. బలం నిరూపించుకునేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. అనర్హత ఎమ్మెల్యేల పంచాయితీ సుప్రీం కోర్టులో ఉండటంతో ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని గవర్నర్ చెప్పడంపై సీఎం అభ్యంతరం తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల ఒత్తిళ్లతో గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. (చదవండి: ఎవరి బలమెంతో అక్కడే తేలుతుంది: గెహ్లోత్) స్పందన లేకపోవడంతోనే.. అసెంబ్లీని సమావేశ పరచాలని నిన్ననే గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరామని సీఎం గహ్లోత్ తెలిపారు. అయినా, ఎటువంటి స్పందన రాలేదని, అందుకనే రాజ్‌భవన్‌కు వచ్చామని వెల్లడించారు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని కోరారు. అదే విధంగా కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని గహ్లోత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫలానా టైమ్‌కు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం గహ్లోత్ ఎక్కడా చెప్పలేదని, అసలు బల పరీక్షపై ఆయన స్పష్టమైన విజ్ఞప్తి చేయలేదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్తుండటం గమనార్హం. హామీతోనే వెనుదిరిగాం గవర్నర్ హామీతోనే నిరసన విరమించామని రాజస్తాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ చెప్పారు. రాజ్యంగానికి కట్టుబడి పనిచేస్తానని గవర్నర్ చెప్పినట్టు తెలిపారు. విశ్వాస పరీక్షకు కోవిడ్ నిబంధనలే అడ్డండి అయితే, తామంతా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సిద్ధమని అన్నారు. ఇక సీఎం గహ్లోత్ వినతిపై నో చెప్పలేదని, ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని మాత్రమే చెప్పానని గవర్నర్ స్పష్టం చేశారు.. ఏదేమైనా నిబంధనల ప్రకారం నడుచుకుంటాని తెలిపారు. ఇదిలాఉండగా.. గహ్లోత్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకి హాజరుకాని సంగతి తెలిసిందే. దీంతో శాసనసభ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం.. అసమ్మతి ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి. వారి పిటిషిన్పై విచారించిన రాష్ట్ర హైకోర్టు.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ను శుక్రవారం మరోసారి ఆదేశించింది. సంయమనం పాటించాలని పేర్కొంటూ యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. (రాజస్తాన్ సంక్షోభం : పైలట్ వర్గానికి ఊరట) -
కొత్తగా తెరపైకి సంజయ్ జైన్..
జైపూర్: రాజస్తాన్ లో ఈ వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం దాదాపు ముప్పావు గంట పాటు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరపాలా? వద్దా? బలనిరూపణకు వెళ్లాలనుకుంటే.. ఎప్పుడు వెళ్లాలి? తదితర విషయాల్లో తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆదివారం వ్యాఖ్యానించారు. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా ) యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ విప్‌ను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పైలట్ సహా 19 ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను కూడా స్పీకర్ జారీ చేశారు. ఆ నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు(సోమవారం) డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. దాంతో హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. ఇందులోపైలట్ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ల సహకారం లేకుండా, గహ్లోత్ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభుత్వ కూల్చివేత కుట్రకు సంబంధించి బయటపడిన ఆడియో టేప్‌లు నిజమైనవేనని సీఎం గహ్లోత్ తేల్చి చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లు ఆ ఆడియో టేప్‌లు నకిలీవైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు. షెకావత్ రాజీనామా చేయాలి: రాజస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయమై వెలుగు చూసిన ఆడియో టేప్‌ల్లో షెకావత్ సంభాషణలు బయటపడడాన్ని ప్రస్తావిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ షెకావత్ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. మరో వైపు, పైలట్‌ను తిరిగి కుటుం బం(పార్టీ)లోకి రావాలని కాంగ్రెస్ అధికా ర ప్రతినిధి సూర్జేవాలా మరో సారి కోరారు. బీజేపీ వల నుంచి ఇకనైనా బయటపడాలని సూచించారు. విశ్వాస పరీక్షతో బలం తేలుతుంది అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ద్వారానే మెజారిటీ తేలుతుందని బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ‘గవర్నర్‌తో భేటీలో సీఎం ఏం చెప్పారనేది ఎవరికీ తెలియదు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితా ఇచ్చి ఉండవచ్చు, లేదా ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి ఉండవచ్చు. కానీ అంతిమంగా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే మెజారిటీ ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుంది’ అన్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్..! సచిన్ పైలట్ తిరుగుబాటుతో హుటాహుటిన జైపూర్‌కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిన తరువాత కూడా జైపూర్‌లోనే ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడమొక్కటే కాదు..ముఖ్యంగా బీజేపీకి, సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నామని చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలోని కొందరితో టచ్‌లో ఉంటూ, పైలట్ వర్గం భవిష్యత్ వ్యూహాలను తెలుసుకుంటోంది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే.. శనివారం సీఎం గహ్లోత్ అకస్మాత్తుగా గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి, బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను చూపారు. కాంగ్రెస్(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ భావిస్తున్నారు. దాంతో, ఈ వారం విశ్వాస పరీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా విశ్వాస పరీక్షకు వెళ్లాలన్న ఆలోచన వెనుక, పైలట్ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు లాగే వ్యూహముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అనర్హత విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమకున్నారని ధీమాగా ఉంది. అనర్హత వేటు వేసేందుకు వీలు కలగనట్లైతే.. మెజారిటీ మార్క్‌కి మించి, 103 మంది సభ్యులు మద్దతిస్తున్నారని చెబుతోంది. ‘అనర్హత వేటు వేసేందుకు వీలు కలిగితే.. 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 19 మంది అనర్హులుగా తేలుతారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీ మార్క్ 91 అవుతుంది. ఆ మార్క్‌ను గహ్లోత్ సునాయాసంగా చేరుకుంటారు’ అని విశ్వసిస్తోంది. సంజయ్ జైన్ ఎవరు? రాజస్తాన్ సంక్షోభంలో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు సంజయ్ జైన్. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియోటేప్ల్లో ఉన్నది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్జైన్ల స్వరాలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఆ గొంతులు తమవి కావని వారు స్పష్టం చేశారు. జైన్ బీజేపీ వ్యక్తి అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ పార్టీకి అతడితో ఏ సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. అయితే, జైన్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఆయన బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజెతో దిగిన ఫొటో ఉంది. అలాగే, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా జైన్ పాల్గొన్నట్లుగా ఫొటోలు ఉన్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదుపై షెకావత్, శర్మలతో పాటు జైన్‌పై కూడా రాజస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మాజీ సీఎం వసుంధర రాజెను ఒకసారి కలవమని, బీజేపీలో చేరమని తనను సంజయ్ జైన్ 8 నెలల క్రితమే కోరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుహ తాజాగా వెల్లడించారు. -
హిమాచల్ గవర్నర్‌గా కల్రాజ్ మిశ్రా
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆచార్య దేవవ్రత్‌ను గుజరాత్ గవర్నర్‌గా బదలాయించింది. కాగా యూపీకి చెందిన 78 సంవత్సరాల కల్రాజ్ మిశ్రా నరేంద్ర మోదీ కేబినెట్లో చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. -
గవర్నర్‌గా కల్రాజ్ మిశ్రా వస్తారా?
సాక్షి, చెన్నై: గత కొంత కాలంగా రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. పూర్తిస్థాయిలో గవర్నర్ నియామకం జరగకపోవడం, ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో కాలం వెల్లదీస్తుండంతో తమిళనాడు రాజకీయాలు ప్రతిష్ఠంభనలో పడ్డాయి. ఈ మేరకు వాటన్నింటకి చెక్ పెట్టే విధంగా తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేంద్ర మంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన కల్రాజ్ మిశ్రాను తమిళనాడు గవర్నర్‌గా నియమకానికి కసరత్తు పూర్తయినట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రోశయ్య పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవికి పూర్తి స్థాయిలో గవర్నర్ నియమకం జరగలేదు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్‌రావు ఏడాది కాలంగా తమిళనాడుకు ఇన్చార్జి గవర్నర్‌గా అదనపుబాధ్యలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈఏడాదికాలంలో తమిళనాట రాజకీయంగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు తప్పలేదు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నర్ ఆచితూచి స్పందిస్తున్నారు. ముంబై టూ చెన్నై పర్యటన సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తమిళనాడుపై విద్యా సాగర్ రావుకు పూర్తి పట్టు ఉన్న దృష్ట్యా, ఆయన్నే పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తనకు ఆ భాగ్యం వద్దన్నట్టుగా ఢిల్లీకి ఆయన మొర పెట్టుకున్నట్లు సమాచారం. రాజకీయాలతో విసిగి వేసారిన విద్యా సాగర్ రావు పూర్తి స్థాయి బాధ్యతలు తనకు వద్దని నిరాకరించినట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత తమిళనాట పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయి గవర్నర్ నియమకంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల బీజేపీ సీనియర్ కల్రాజ్ మిశ్రా పేరు తెరపైకి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన పార్టీ ఆదేశాల మేరకు గత వారం పదవికి రాజీనామా చేశారు. ఆయన అనుభవాలు తమిళనాడుకు ఉపయోగ పడుతాయన్న భావనతో బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవికి కేంద్రానికి సిఫారసు చేసినట్టు సమాచారం. దీంతో కల్రాజ్ మిశ్రాను తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకు తగ్గ కసరత్తు ముగిసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్న దృష్ట్యా, ఆయన తిరిగి రాగానే, కల్ రాజ్ మిశ్రా నియమకానికి ఆమోదముద్ర పడే అవకాశాలు ఉన్నట్టు కమలనాథుల్లో చర్చ సాగుతోంది. -
పరిశ్రమల స్థాపన సులభతరం
సాక్షి, బెంగళూరు: దేశ ఆర్థికాభివృద్దికి కీలకమైన వ్యాపారాలు, ఉత్పాదనలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన 7వ ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ హౌస్‌వేర్ మేళా–2017 ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆన్లైన్లోనే కొత్త కంపెనీలను రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. కొత్త పరిశ్రమలు ప్రారంభించేవారికి ఎటువంటి హామీలు, పూచీకత్తులు లేకుండా రూ.2 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. చిన్న,మధ్య తరహా పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తుల్లో 20శాతం ఉత్పత్తులను భారీ పరిశ్రలు తప్పనిసరిగా వినియోగించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. జీఎస్టీ గురించి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు సందేహలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800111955కి కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. -
కేటీఆర్ డైనమిక్ లీడర్: కల్రాజ్ మిశ్రా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ అని కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రా ప్రశంసించారు. తెలంగాణలో ఖాయిలా పడుతున్న యూనిట్లను పునరుద్ధరించేందుకు, సంక్షోభంలో చిక్కుకుం టున్న యూనిట్లను కాపాడేందుకు ఆరాటపడుతున్నారని కొనియాడారు. తెలంగాణలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎదుర్కొంటున్న కష్టాల గురించి కేటీఆర్ వివరించిన అనంతరం కల్రాజ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ డైనమిక్ లీడర్. చిన్న, మధ్యతరహా పరిశ్రమల గురించి ఆయన ఆవేదన నాకు అర్థమైంది. ఆయా పరిశ్రమలు నడుపుతున్న వారు పడుతున్న ఇక్కట్ల గురించి వివరించారు. వారి కష్టాలు తీర్చడం తప్పనిసరి. చిన్న పరిశ్రమలు నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏలు)గా మారకుండా చూడాలి. ఈ అంశంపై కేటీఆర్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. పారిశ్రామిక హెల్త్ క్లినిక్‌లు పెట్టాలని సూచించారు. సిక్ యూనిట్ల పునరుద్ధరణకు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. దీనిపై ఆలోచిస్తాం’’ అని మిశ్రా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్లను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా సదస్సులు జరుగుతున్నాయని.. హైదరాబాద్‌లోనూ ఒకటి నిర్వహిస్తే బాగుంటుందని కేటీఆర్‌కు సూచించినట్లు చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ఎంఎస్ఎంఈ పరిశ్రమల సమస్యలపై కల్రాజ్ మిశ్రా సానుకూలంగా స్పందించారు’’ అని వివరించారు. -
చిన్న పరిశ్రమలకు రుణం అందడంలేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కనీసం రూ.కోటి రుణాన్ని కూడా బ్యాంకులు ఇవ్వడంలేదని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రుణాలివ్వాలనే రిజర్వుబ్యాంకు నిబంధనలను సైతం బ్యాంకర్లు పక్కన పెడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కొత్తగా స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఒరవడి లేదని చెప్పారు. ‘ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం ఆర్ధిక పునర్మాణం-విజయానికి జీవన రేఖ’ అంశంపై ఢిల్లీలో బుధవారం అసోచామ్ నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా మాట్లాడారు. దేశంలో స్మూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమస్యలను అధిగమించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలతో ప్రపంచ దేశాల దృష్టికి ఇప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలవైపు పడిందని చెప్పారు. గోదావరి పాలిమర్స్‌కు అవార్డు తక్కువ వ్యయంతో అధిక మేలు చేసే ఉత్పత్తుల తయారీ సంస్థల విభాగంలో గోదావరి పాలిమర్స్ సంస్థ డెరైక్టర్ సి.రాజేంద్ర కుమార్‌కు ఈ సందర్భంగా అవార్డు ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి పాలిమర్స్ సంస్థ ద్వారా సంప్రదాయకమైన వ్యసాయ ఉత్పత్తులు తయారు చేస్తూ రైతులకు చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించిందని, దీంతో తమ సంస్థ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. -
‘స్కిల్ ఇండియా’ మోదీ లక్ష్యం
కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా నిమ్స్‌మేలో జాబ్‌మేళా ప్రారంభం వెంగళరావునగర్: మన దేశాన్ని ‘స్కిల్ ఇండియా’గా మార్చడమే ప్రధాని మోదీ లక్ష్యమని ఎంఎస్ఎంఈ కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్ మే)లో ఆదివారం మెగా జాబ్‌మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిశ్రా మాట్లాడుతూ మనదేశంలోని యువతకు కావాల్సినంత స్కిల్ ఉందని, అయితే దానిని ఉపయోగించుకోవడంలోనే లోపం ఉందన్నారు. అందువల్లనే నిరుద్యోగ సమస్య అధికమయ్యిందన్నారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువతకు ఉపాధి శిక్షణ కోర్సులు అందించేందుకు దాదాపు 5 వేల కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యువత ఎప్పుడూ ఖాళీగా ఉండవద్దని, దాని వల్ల దేశం వెనక్కు పోతుందన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి యువతీ యువకుడికి ఈ జాబ్‌మేళాలో తప్పనిసరిగా ఉద్యోగం దొరుకుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాబ్‌మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యపై స్పందించాలి తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమై ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కార్యక్రమానికి హాజరైన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రభుత్వం విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు ఎంతో అవసరమని, అవి నడవాలంటే విద్యుత్ కావాలన్నారు. నిరంతర విద్యుత్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో నడవడం లేదన్నారు. విద్యుత్ సమస్యపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని, పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తానన్నారు. నిమ్స్‌మే ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా శాఖల ప్రతినిధులపై ఉందన్నారు. తన నియోజకవర్గంలో తొలిసారిగా మెగా జాబ్‌మేళాను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిమ్స్‌మే డెరైక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, టీఎంఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి.మురళీధరన్, ఎన్ఐఈఎస్బీయుడీ డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్, ఎన్ఎస్ఐసీ సీఎండీ రవీంద్రనాధ్, ఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ ఎన్.ఎన్.త్రిపాఠి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కుటీర పరిశ్రమలు పునరుద్ధరిస్తాం
కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా హైదరాబాద్: దేశంలో కుటీర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని కేంద్ర సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్ఎంఈ) మంత్రి కల్రాజ్ మిశ్రా అన్నారు. మంగళవారం సనత్‌నగర్‌లోని ‘ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్’ (ఫెట్సియా) ఎస్ఎస్ఐ సెంటర్ నూతన భవన సముదాయం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్‌మే)లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఏవియేషన్, హెచ్ఏఎల్ వంటి సంస్థలకు కావాల్సిన ఉత్పత్తులను అందించడంలో ఎంఎస్ఎంఈ ముందుందన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి అన్నీ సవ్యంగా ఉంటే 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య కన్వీనర్ రాజ్ మహేందర్‌రెడ్డి, నిమ్స్‌మే డెరైక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఫెట్సియా అధ్యక్షుడు జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రగతి కోసం పనిచేయండి బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా సూచన సాక్షి, హైదరాబాద్: కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి, దేశ ప్రగతికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా బీజేపీ కార్యకర్తలకు సూచించారు. అధికారిక పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విద్యాసాగర్‌రావును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాజీ గవర్నర్ రామారావు, మురళీధరరావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Draft policy for MSME sector in 3-4 months: Kalraj Mishra -
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షిస్తున్నాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను(ఎఫ్‌టీఏ) సమీక్షిస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా తెలిపారు. ఎఫ్‌టీఏల కారణంగా దేశీయ తయారీ రంగం కుదేలవుతోందంటూ కంపెనీలు ఆందోళన చెందుతున్న విషయం వాస్తవమేనని అన్నారు. ఇక్కడి కంపెనీలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ కంపెనీల ప్రయోజనాలను కాపాడతామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. హెచ్ఆర్ సేవల సంస్థ టీఎంఐ గ్రూప్ వాయిస్ ఆధారిత మొబైల్ సొల్యూషన్ ‘జాబ్స్‌డైలాగ్’ను మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఒకే కార్మిక చట్టం..: ప్రస్తుతమున్న కార్మిక చట్టాల స్థానంలో ఎంఎస్ఎంఈ రంగం కోసం ఒకే చట్టాన్ని తీసుకొస్తున్నట్టు మిశ్రా తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. టెక్నికల్ స్కూల్స్ ఏర్పాటుకు శాంసంగ్ తరహాలో మరిన్ని కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మారుస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటైందని చెప్పారు. పెట్టుబడి, కార్మికుల సంఖ్యనుబట్టి సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా కంపెనీగా నిర్వచిస్తారు. 20 శాతం ఎంఎస్ఎంఈ నుంచే.. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈల నుంచి 20 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం 2015 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు చెప్పారు. ముసాయిదా విధానం మూడు నాలుగు నెలల్లో ప్రకటి ంచే అవకాశం ఉందన్నారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. పాలసీలో చేర్చే అంశాలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ, ఎంఎస్ఎంఈ, ఆర్బీఐకి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటైందన్నారు. ఎంఎస్ఎంఈ రంగ సమస్యలను పరిష్కరించే దిశగా బ్యాంకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 33 లక్షల మందికి.. 2014-15లో 33 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా చేసుకున్నామని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవో దిలీప్ షెనాయ్ తెలిపారు. శిక్షణ తీసుకున్న వారిలో 63 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, దీనిని 70 శాతానికి చేర్చాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. తమ కార్యకలాపాలను అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు టీఎంఐ గ్రూప్ చైర్మన్ టి.మురళీధరన్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 లక్షల ఎంఎస్ఎంఈలు మూతపడిన ఫలితంగా 18 లక్షల మంది ఉపాధి కోల్పోయారని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. -
ఎంఎస్ఎంఈకి ఊతమివ్వాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊతమిచ్చేలా కొత్త బడ్జెట్ ఉంటుందని ఫ్యాప్సీ భావిస్తోంది. వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అంచనాలున్నాయని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా తెలిపారు. జూలై 10న కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే బడ్జెట్లో పారిశ్రామిక రంగం ఏం కోరుకుంటోందో ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ఆయనింకా ఏమన్నారంటే.. మూతపడ్డ కంపెనీలను.. ఔత్సాహిక యువత వ్యాపార రంగంలోకి అడుగిడేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి. వ్యాపార అనుమతుల విషయంలో అకారణ జాప్యాన్ని (రెడ్ టేపిజం) నివారిస్తూ సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలి. ఎంఎస్ఎంఈకి ప్రత్యేక ప్యాకేజీ కింద తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలి. అధిక వడ్డీలు, నిధుల కొరత, విద్యుత్ సరఫరాలో అవాంతరాలే కంపెనీలు మూతపడడానికి, ఖాయిలాపడడానికి కారణం. ఇలాంటి కంపెనీలకు జీవం పోసే చర్యలు చేపట్టాలి. ఈ కంపెనీల రుణ కాలపరిమితిని పెంచాలి. నిరర్ధక ఆస్థిగా(ఎన్పీఏ) పరిగణించే నిబంధనల్లో మార్పులు చేపట్టాలి. మౌలిక రంగంలో.. కొత్త ప్రభుత్వం ఇన్ఫ్రా ప్రాజెక్టులు విరివిగా చేపడుతుందన్న అంచనాలున్నాయి. ఇండస్ట్రియల్ పార్కుల స్థాపన ద్వారా తయారీని ప్రోత్సహిస్తారన్న విశ్వాసం పారిశ్రామికవేత్తల్లో నెలకొని ఉంది. ఇదే సమయంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అవసరం. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొరత పట్టిపీడిస్తోంది. ప్రత్నామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ కు ఈ బడ్జెట్లో అధిక ప్రోత్సాహం ఉండొచ్చు. తెలంగాణ, సీమాంధ్రలో పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ, మెరుగైన విద్యుత్ దిశగా చర్యలు ఆశిస్తున్నాం. వ్యవసాయ రంగానికి.. ఫుడ్ ప్రాసెసింగ్‌కు పెద్దపీట వేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. శీతల గిడ్డంగులను విరివిగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి రోజులొస్తాయి. పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయోత్పత్తులు పాడవకుండా నష్ట నివారణ చర్యలు ఉంటాయన్న అంచనాలున్నాయి. వివిధ రంగాల్లో ఇస్తున్న సబ్సిడీలను పునస్సమీక్ష జరిపి, ఈ నిధులను ఇతర రంగాల్లో సద్వినియోగం చేయాలి. ఏటా చదువు పూర్తి చేసుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల నైపుణ్య శిక్షణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ప్రజల్లో పొదుపును ప్రోత్సహించేలా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు చేయాలి.