అసభ్యకర ఫొటోలు తీసి ... బ్లాక్‌మెయిలింగ్ | Auto Driver booked for blackmailing degree student | Sakshi
Sakshi News home page

అసభ్యకర ఫొటోలు తీసి ... బ్లాక్‌మెయిలింగ్

Published Sun, Aug 3 2014 2:15 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

అసభ్యకర ఫొటోలు తీసి ... బ్లాక్‌మెయిలింగ్

అసభ్యకర ఫొటోలు తీసి ... బ్లాక్‌మెయిలింగ్

నెల్లూరు : ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధించడంతో పాటు, ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తానంటూ రౌడీలతో ఆమె ఇంటి మీదకొచ్చిన ఆటోడ్రైవర్ ఉదంతమిది. ఈ ఘటన నాయుడుపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. ఓజిలిమండలం నెమళ్లపూడికి చెందిన ఓ విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గతంలో ఆమె రోజూ కళాశాలకు ఆటోలో వచ్చివెళ్లేది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేష్ ప్రేమపేరుతో వేధించాడు. అప్పట్లోనే ఆమె ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి అతడిని మందలించింది. అయితే మూడు నెలల క్రితం నరేష్ ఆ విద్యార్థిని ఆటోలో కిడ్నాప్ చేశాడు. దీనిపై అప్పట్లోనే విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి మందలించి కేసులు లేకుండా వదిలేశారు.  
 
 కిడ్నాప్ సమయంలో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అసభ్యకరంగా ఫొటోలు తీసి, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడసాగాడు. ఈ ఘటనల నేపథ్యంలో విద్యార్థిని కుటుంబం నాయుడుపేటకు కాపురం వచ్చేసింది. అయినా నరేష్ వేధింపుల పర్వం ఆపలేదు.శనివారం సాయంత్రం కొందరితో కలిసి నాయుడుపేటలో విద్యార్థిని కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి మీదకు వచ్చాడు. చంపేస్తామంటూ ఆమె తల్లిదండ్రులపై దాడికి యత్నించడంతో పాటు ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. భయభ్రాంతులకు గురైన బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని ఆ విద్యార్థిని ఏఎస్సై బొబ్బిలిరాజును వేడుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement