సాక్షి, తిరుపతి జిల్లా: అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్ కదా.. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ.. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చురకలు అంటించారు. 8వరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
♦చంద్రబాబుకి గుర్తొచ్చేది.. వెన్నుపోటు అంటూ సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్
♦మనకు కోట్ల మంది అభిమానులు ఉంటే.. ఆ యెల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు
♦ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ దత్తపుత్రుడు. అంతా పొరుగు రాష్ట్రం నుంచే ఉన్నారు. వీళ్ల రాజకీయం దోచుకోవడం.. దాచుకోవడం.
చంద్రబాబును హంతకుడు అనలేమా?
ఈ ఎన్నికలు రెండు భావజాలాలు.. పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ.
చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు
చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా?
వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి
రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు
జూన్ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది
తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి.. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం
2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు
ముగ్గురిని తెచ్చుకున్నాడు. స్వయంగా మేనిఫెస్టో కూడా ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికి పంచాడు
ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు.. ప్రధాన హామీలంటూ స్వయంగా సంతకాలు చేశాడు.. మరి
పొదుపు సంఘాల పూర్తి రుణమాఫీ అన్నాడు? చేశాడా?
ఆడబిడ్డ పుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా?
ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?
రైతులకు రుణమాఫీ అన్నాడు? చేశాడా?
మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలం అయినా ఇచ్చాడా?
Comments
Please login to add a commentAdd a comment