అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్‌షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.
‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.
‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..
⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..
⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..
⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?
⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా?
⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..
⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..
⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?
⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం
⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి
⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం
⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది
⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment