
హైదరాబాద్ : బీసీ డిక్లరేషన్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సెంటిమెంట్ వర్క్ ఔట్ కాదని సీఎంకు తెలిసిందని అందుకే బీసీ డిక్లరేషన్ అందుకున్నారని అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేసీఆర్ చేతులు దులుపుకుంటారని ఆరోపించారు. 50 శాతం రిజర్వేషన్లు మించారదని కేంద్రం చెబుతోందని తెలిపారు. క్రిమిలేయర్ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
కేసీఆర్ తన సామాజిక వర్గానికే పెద్ద పీట వేసుకున్నారని విమర్శించారు. కేబినేట్‌లో నలుగురు మంత్రులు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని వెల్లడించారు. 2019 ఎన్నికల కోసమే కేసీఆర్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని, కేసీఆర్ మాటలను ప్రజలెవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌కి బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment