సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ నేతలు కె.పార్థసారధి, వెల‍్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు ఉన్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేడు బీసీ గర్జన సభ జరగనుంది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. గన్నవరం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా ఏలూరు వెళతారు.
వైఎస్ జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్థులు
మరోవైపు గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. నాలుగువేల మందికి పైగా అభ్యర్థులు వుండగా కేవలం 36మందికే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిప్పించుకున్న ప్రభుత్వం చివరకు తమకు మొండి చేయి చూపించిందని డీఎస్సీ అభ్యర్థులు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వివరించారు. డీఎస్సీ అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించిన ఆయన వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment