![1998 DSC Qualified Candidates Says Thanks To CM YS Jagan - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/6/05AKP34-320004_27_39.jpg.webp?itok=bjNkkmaa)
సాక్షి, అనకాపల్లి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగ పక్షపాతి అని, 25 ఏళ్ల నాటి కలను నిజం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.వి.రమణమూర్తి కొనియాడారు. అనకాపల్లి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ‘డీఎస్సీ–1998’ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించారని, ఇది 25 ఏళ్ల నాటి కల అన్నారు. గత ప్రభుత్వాల దృష్టికి అనేకమార్లు తమ సమస్యను తీసుకెళ్లామని.. తామిచ్చిన వినతులను చిత్తు బుట్టలకే పరిమితం చేశారని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,072 మందిని గురువుల స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
(చదవండి: నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment