DSC 1998
-
థాంక్యూ సీఎం సార్!
సాక్షి, అనకాపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ పక్షపాతి అని, 25 ఏళ్ల నాటి కలను నిజం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.వి.రమణమూర్తి కొనియాడారు. అనకాపల్లి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ‘డీఎస్సీ–1998’ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించారని, ఇది 25 ఏళ్ల నాటి కల అన్నారు. గత ప్రభుత్వాల దృష్టికి అనేకమార్లు తమ సమస్యను తీసుకెళ్లామని.. తామిచ్చిన వినతులను చిత్తు బుట్టలకే పరిమితం చేశారని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,072 మందిని గురువుల స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. (చదవండి: నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి) -
ఏపీ: 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతి ఎస్జీటీలుగా నియామకం చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందనున్నారు. వీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోపు అభ్యర్థులందరికీ నియామకపు పత్రాలు ఇవ్వనున్నారు. ఇక, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి 4,534 మంది జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున ఛైర్మన్ కాకర్ల వెంకట్రామి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం జగన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వారి కష్టం ఎట్టకేలకు ఫలించింది. చదివిన చదువు వృథా పోలేదు. తమ బతుకులు ఇంతేనని నిరాశలో ఉన్న వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. 1998లో డీఎస్సీ రాయగా అది చెల్లదంటూ అందులో ఎంపికైన వారికి నాటి చంద్రబాబు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. దీనిపై వారు 22 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుకు వెళ్లారు. చదవండి: ‘అలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబును తరిమి కొడతారు’ తమకు అన్యాయం జరిగిందంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశారు. 1998 డీఎస్సీలో అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఆయన హఠాన్మరణంతో ఆ ఫైల్ ఆగిపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వారి గోడును పట్టించుకోలేదు. విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చినప్పుడు డీఎస్సీ అభ్యర్థులు ఆయనను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ ప్రభుత్వం రాగానే సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆ మాట నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపట్టారు. కోర్టు తీర్పు అనంతరం 1998 డీఎస్సీ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించేందుకు అన్ని చర్యలూ పూర్తి చేశారు. ఫలితంగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 1998 డీఎస్సీ అభ్యర్థులు 2,807 మంది ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. అర్హులందరూ అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఆరు నుంచి 14వ తేదీలోగా వాటి వెరిఫికేషన్ పూర్తి కానుంది. అనంతరం అర్హులైన అందరినీ ఈ నెల 14వ తేదీ తర్వాత ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. 6 నుంచి క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కాకినాడ సిటీ/రాయవరం: ఈ నెల 6, 7 తేదీల్లో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1998 డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకు హాజరై పోస్టు పొందని అభ్యర్థులు 560 మంది ఉన్నారు. వీరిలో ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారి ఒరిజనల్ సర్టిఫికెట్లను కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వారు ఆధార్ కార్డు, డీఎస్సీ ఇంటర్వ్యూ లెటర్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, హాల్ టికెట్/ర్యాంకు కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్ఎస్సీ/ఇంటర్/డిగ్రీ/పీజీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, డీఈడీ/బీఈడీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, స్టడీ/రెసిడెన్స్ సర్టిఫికెట్లు, ఏజెన్సీ ఏరియా సరి్టఫికెట్లు (వర్తిస్తే), పీహెచ్సీ సర్టిఫికెట్లు (అవసరమైన వారు), టీచింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (అనుభవం ఉన్నవారు) తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. వీరందరూ మూడు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు కూడా అందజేయాలని డీఈఓ తెలిపారు. అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. హాల్ టికెట్ నంబర్ 4100047 నుంచి 4102488 వరకూ ఉన్న అభ్యర్థులు 6వ తేదీన, 4102489 నుంచి 4105490 వరకూ ఉన్న అభ్యర్థులు 7వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈఓ సుభద్ర సూచించారు. -
1998 DSC: ఎమ్టీఎస్‌పై నియామకాలు
సాక్షి, అమరావతి: 1998 డీఎస్సీలో పోస్టుల ఎంపికకు అర్హత సాధించినప్పటికీ, నియామక అవకాశం దక్కని అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 24 ఏళ్ల వారి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. వీరు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని మినిమం టైమ్ స్కేలుపై టీచర్లుగా నియమించేందుకు పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం మెమో జారీ చేశారు. 1998 డీఎస్సీ ఎలిజిబుల్ అభ్యర్థుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించనున్నారు. వీరిని 2008 డీఎస్సీ అభ్యర్థులకు మాదిరిగానే ఎమ్.టీ.ఎస్ పై టీచర్ పోస్టుల్లో అడహాక్ పద్ధతిలో నియమిస్తారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కేజీబీవీ అకడమిక్ ఇన్స్ట్రక్టర్, మోడల్ స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్లు, డీఈవో పరిధిలోని టీచర్ల పూల్‌లో నియమించనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 డీఎస్సీ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేసి న్యాయం చేకూర్చడం పట్ల అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుందని ఎమ్మెల్సీ కల్పాలతారెడ్డి తెలిపారు. -
లేటు వయసులో ఫలించిన నిరుద్యోగి కల
సాక్షి, అనకాపల్లి: ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 1998 డీఎస్సీలో ఎంపికైన వారికి ఉద్యోగావకాశం కల్పిస్తూ ఫైల్‌పై (జీఓ జారీ) సంతకం చేయడంతో రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగి పంట పండింది. 23 ఏళ్లుగా ఉపాధ్యాయ కొలువు కోసం ఎదురు చూస్తున్న అతని నిరీక్షణ ఫలించింది. గ్రామానికి చెందిన పసగడుగుల బాబూరావు (57)కు పెళ్లయి పిల్లలు కూడా పెద్ద వాళ్లయ్యి పెళ్లీడుకు వచ్చారు. ఈ నేపథ్యంలో 1998 నుంచి నేటి వరకు ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. ప్రభుత్వాలు మారాయి. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో మా వంటి అభాగ్యులకు మంచి చేస్తున్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ భార్య, ముగ్గురు పిల్లలతో ఈ సంతోషాన్ని పంచుకున్నాడు. 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థుల హర్షం.. మాడుగుల రూరల్: సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, తదితర నియోజకవర్గాల్లో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులు 500 మందికి పైగా ఉన్నారు. గత పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
-
CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ని సన్మానించారు. 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్థులతోపాటు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు. చదవండి: (CM Jagan: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది
చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుని పేరు పాలుపోక భాస్కరరావు. ఆయనది మక్కువ మండలంలోని కాశీపట్నం గ్రామం. బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఉపాధ్యాయుడు కావాలన్న ఆశయంతో రాత్రీపగలు కష్టపడి చదివారు. డీఎస్సీ– 1998లో క్వాలిఫై అయ్యారు. చేతికందొచ్చిన ఉద్యోగం వివాదాలతో దూరమైంది. 2001లో డీఎస్సీ రాయగా అరమార్కులో అనర్హుడయ్యారు. మరోమారు 2006లో స్కూల్ అసిస్టెంట్ బయోలజీలో ఒక్కమార్కులో ఉద్యోగం పోయింది. తరువాత అనారోగ్యం కారణంగా 2007, 2012 సంవత్సరాలలో పరీక్షలు రాయలేకపోయారు. 2009లో ఇన్ఫెక్షన్ సోకడంతో రెండుకాళ్లు తీసేయాల్సి వచ్చింది. అక్షరాలపై మమకారం, ఉపాధ్యాయ వృత్తిపై ప్రేమతో కృత్రిమ కాళ్లతో కొన్నాళ్ల పాటు కాశీపట్నం ప్రభుత్వ పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేశారు. కొన్నాళ్లకు వలంటీర్ వ్యవస్థను ఎత్తేయడంతో ఆ చిరుద్యోగమూ దూరమైంది. జీవనం భారంగా మారింది. పొట్టపోషణ కోసం కాశీపట్నం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకొని మక్కువలోని ఓ మీసేవా కేంద్రంలో పనిచేసేవారు. కొంతకాలం తర్వాత మీ సేవా కేంద్రం వేరే ప్రదేశానికి మార్పుచేయడంతో ఆ బాధ్యతలూ దూరమయ్యాయి. కొద్దిరోజుల తర్వాత మక్కువలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మేడ మెట్లకింద చిన్న కుర్చీవేసుకొని బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులకు బ్యాంకు ఫారాలు నింపుతూ సాయపడేవారు. అలా వారిచ్చిన ఐదు,పది రూపాయలతో రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు సంపాదించేవారు. భాస్కరరావు దీనస్థితిని చూసిన ఆ గ్రామ పెద్దలు ఆయన భార్య లక్ష్మికి అంగన్వాడీ ఆయా గా అవకాశం కల్పించారు. దంపతులిద్దరూ శ్రమిస్తూ అబ్బాయిని బీటెక్, అమ్మాయిని 9వ తరగతి చదివిస్తున్నారు. వారి కుటుంబ జీవితం అలలపై సాగుతున్న నావ. ఆ నావకు సీఎం జగన్మోహన్రెడ్డి దిక్సూచీగా మారారు. 23 ఏళ్లుగా ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తూ డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగ మార్గాన్ని సుగమం చేశారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. సీఎం రూపంలో మా జీవితంలోకి ఉద్యోగ ‘భాస్కరుడు’ ఉదయించాడంటూ సంతోషపడుతున్నారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. (చదవండి: మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు) -
మాట తప్పని మడం తిప్పని నాయకుడు మన సీఎం
-
థాంక్యూ సీఎం సార్.. 24 ఏళ్ల చరిత్రలో మీలాంటి సీఎం ను చూడలేదు..!!
-
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ నేతలు కె.పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు ఉన్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేడు బీసీ గర్జన సభ జరగనుంది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. గన్నవరం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా ఏలూరు వెళతారు. వైఎస్ జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్థులు మరోవైపు గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. నాలుగువేల మందికి పైగా అభ్యర్థులు వుండగా కేవలం 36మందికే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిప్పించుకున్న ప్రభుత్వం చివరకు తమకు మొండి చేయి చూపించిందని డీఎస్సీ అభ్యర్థులు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వివరించారు. డీఎస్సీ అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించిన ఆయన వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని తెలిపారు. -
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థి మృతి
గుంటూరు: డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థి ఉద్యోగం చేతికందకుండానే ప్రాణం విడిచాడు. బొలమాల మాథ్యూస్(45) బుధవారం గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ఏపీ డీఎస్సీ–98 క్వాలిఫైడ్స్ అసోసియేషన్ మండిపడింది. 20 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగం రాక, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అభ్యర్థులు మనోవేదన అనుభవిస్తున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.కొండారెడ్డి, మధుసూదనరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
డీఎస్సీ-98, 2008 క్వాలిఫైడ్లకు అవకాశం!
పాఠశాల విద్యాశాఖ నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-1998, 2008 పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులు పొందని అభ్యర్థులకు న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి నియామకాలు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఈ రెండు డీఎస్సీల క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు అధికారులను పలుమార్లు కలసి వినతిపత్రాలు అందించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కమిషనర్ నివేదిక సమర్పించారు. సోమవారం విద్యాశాఖ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి నియామకాలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖవర్గాలు వివరించాయి. హైస్కూళ్లలో పనిచేస్తున్న పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ సమస్యను కూడా చర్చించనున్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఫైలును ఆమోదింపచేయనున్నారని మంత్రి గంటా కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.