1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థి మృతి | 1998 dsc aspirant dies as heart attack in guntur | Sakshi
Sakshi News home page

1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థి మృతి

Published Thu, Nov 16 2017 7:33 AM | Last Updated on Thu, Nov 16 2017 7:33 AM

1998 dsc aspirant dies as heart attack in guntur

గుంటూరు: డీఎస్సీ–1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థి ఉద్యోగం చేతికందకుండానే ప్రాణం విడిచాడు. బొలమాల మాథ్యూస్‌(45) బుధవారం గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ఏపీ డీఎస్సీ–98 క్వాలిఫైడ్స్‌ అసోసియేషన్‌ మండిపడింది. 20 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగం రాక, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అభ్యర్థులు మనోవేదన అనుభవిస్తున్నారని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.కొండారెడ్డి, మధుసూదనరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement