
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతి ఎస్‌జీటీలుగా నియామకం చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందనున్నారు. వీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోపు అభ్యర్థులందరికీ నియామకపు పత్రాలు ఇవ్వనున్నారు. ఇక, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి 4,534 మంది జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున ఛైర్మన్ కాకర్ల వెంకట్రామి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment