contract basis
-
ఏపీ: 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతి ఎస్జీటీలుగా నియామకం చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందనున్నారు. వీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోపు అభ్యర్థులందరికీ నియామకపు పత్రాలు ఇవ్వనున్నారు. ఇక, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి 4,534 మంది జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున ఛైర్మన్ కాకర్ల వెంకట్రామి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
1200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యానవన విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన 1200ల బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణాధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విస్తరణాధికారులు లేక ఉద్యాన విభాగం పని తీరు కుంటుపడిన నేపథ్యంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఉద్యోగాలకు వ్యవసాయ బీఎస్సీ, లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు చదివిన వారే అర్హులని ప్రకటించగా, ఈసారి బీఎస్సీ(జంతుశాస్త్రం) చదివిన వారికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉద్యోగాలను నాలుగు తరగతులుగా వర్గీకరించింది. తొలి విభాగం పోస్టులకు అభ్యర్ధులు యూజీసీ గుర్తింపు ఉన్న ఏదైనా యూనివర్శిటీ నుంచి నాలుగేళ్ల బీఎస్సీ (ఉద్యాన విభాగం) లేదా బీఎస్సీ (అగ్రీ) పూర్తి చేసి ఉండాలి. రెండో విభాగం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం నుంచి హార్టీకల్చర్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా తీసుకున్న వారు, మూడో విభాగం ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ లేదా ఎంఎస్సీ (హార్టీకల్చర్‌లోని ఏదో ఒక అంశంతో) చదివిన వారు, నాలుగో విభాగం ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు ఉన్న ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (బీజెడ్సీ) డిగ్రీ చదివిన వారు అర్హులని ప్రకటించింది. -
కాంట్రాక్టు పద్ధతిలోనే వ్యవసాయ విస్తరణాధికారుల భర్తీ?
సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దుచేశాక వారిస్థానంలో 4,400 మంది విస్తరణాధికారులను నియమించాలని సర్కారు నిర్ణయించిన సంగతి విదితమే. అసలు కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని చెప్పిన తెలంగాణ సర్కారు.. ఈ పోస్టులను మాత్రం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోదని అంటున్నారు. నెలకు రూ. 10 వేల గౌరవ వేతనంతో నియమిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. పనితీరు ఆధారంగా భవిష్యత్తులో పరిస్థితిని బట్టి ఆయా పోస్టులను క్రమబద్దీకరిస్తారని తెలిసింది. వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో డిప్లొమా పూర్తిచేసిన వారిని ఈ పోస్టుల్లో నియమిస్తారు. వీరంతా తమను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తారని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే ప్రతీ మండలానికి 9 లేదా 10 మంది విస్తరణాధికారుల చొప్పున నియమించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలో జాప్యం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు పద్ధతిపై స్టాఫ్‌నర్సులుగా పనిచేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గత ఏడాది డిసెంబర్ 8న 50 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియెట్, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేసి నర్సింగ్ కౌన్సిల్లో తమ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తులు పూర్తిచేసి ఇచ్చేందుకు గత ఏడాది డిసెంబర్ 21 తుది గడువుగా ప్రకటించారు. మొత్తం 50 పోస్టులకు గానూ 650 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక విధానాన్ని ప్రకటించని అధికారులు పోస్టుల ఎంపిక ప్రకటనలో ఎంపిక విధానాన్ని అధికారులు పేర్కొనలేదు. ఇదే అక్రమార్కులు, అవినీతిపరులకు ఊతమిచ్చింది. పోస్టులిప్పిస్తామంటూ అమాయకులైన అభ్యర్థుల నుంచి లక్షల్లో దోచుకుంటున్నారు. ఈ పోస్టుల ఎంపికలో అభ్యర్థులు అర్హత పరీక్షలో అంటే జీఎస్‌ఎంలో సాధించిన మార్కులు, అర్హత పరీక్ష పూర్తయిన అనంతరం సీనియారిటీకి ఒక్కో సంవత్సరానికి ఒక్కో మార్కు చొప్పున గరిష్టంగా పదేళ్లకు పది మార్కుల చొప్పున కేటాయిస్తారు. అయితే ఈ విషయాన్ని ప్రకటనలో తెలపకపోవడంతో కొందరు పోస్టులు ఇప్పిస్తామని బేరాలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 6వ తేదీన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని నోటీసుబోర్డులో ఉంచారు. దాదాపు 18 మంది అభ్యర్థుల వరకు తమకు సంబంధించిన జాబితాలో పొరపాట్లు జరిగాయని, మార్పులు చేయాలని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థుల జాబితా కంప్యూటరైజ్ చేసిన అనంతరం ఏ అభ్యర్థికి మెరిట్ ఉందో తెలుసుకుని, ఎవరికైతే ఉద్యోగం వస్తుందో అటువంటి అభ్యర్థులకు ఫోన్ చేసి మూడు లక్షలిస్తే పోస్టు మీకే ఇప్పిస్తామని కొందరు బేరాలాడుతున్నారు. వైద్య సిబ్బంది పాత్ర లేనిదే అభ్యర్థుల జాబితా బయట వ్యక్తులకు చేరే అవకాశం లేదు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి చెందిన గ్రూపు నంబర్ నుంచే ఈ కాల్స్ వెళ్లడం గమనార్హం. ఈ విషయం డీఎంహెచ్ఓ దృష్టికి వెళ్లినా..ప్రాథమిక విచారణ సైతం చేయలేదు. ఏ సెల్ నంబర్ ఏ సిబ్బందికి కేటాయించారో..అధికారుల వద్ద జాబితా ఉంటుంది. ఈ జాబితా పరిశీలిస్తే ఏ సిబ్బంది సెల్ నంబరు నుంచి అభ్యర్థులకు ఫోన్ వెళ్లిందో తెలిసిపోతుంది. అయినా దాని గురించి పట్టించుకోలేదు. ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను రెండోసారి అధికారులతో పరిశీలించి సవరణలుంటే సరి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. దీంతో జాబి తాను పరిశీలించిన అధికారులు మరో డజను వరకూ తప్పులు దొర్లినట్లు డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థులు ఎవరి మాటలూ నమ్మొద్దు ఆర్ రామతులశమ్మ, డీఎంహెచ్‌వో ఎంపిక ప్రక్రియ చూసే క్లర్క్ సమ్మెలో ఉండటం వల్ల కొద్దిరోజులు జాప్యం జరిగింది. ప్రస్తుతం ఫైల్ తయారైంది. ఉన్నతాధికారులకు పంపుతున్నాం. మా కార్యాలయం నుంచి అభ్యర్థులకు ఫోన్ చేసిన విషయంపై సిబ్బందిని ప్రశ్నించాం. అయితే ఎవరూ తాము చేశామని చెప్పలేదు. అభ్యర్థులు ఎవరి మాటలూ నమ్మవద్దు. త్వరలోనే ఎంపిక పూర్తిచేస్తాం. -
వైద్య‘విధానం’ లేదు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ఆస్పత్రులలో పని చేయడానికి రెండు రోజుల క్రితం ఎనిమిది మంది వైద్యులను వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. ఏ నిబంధనలనూ పరిగణనలోకి తీసుకోకుండానే వీరిని నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ ప్రక్రియ ఆస్పత్రులలో వైద్యుల నియామకం చేపట్టాలంటే పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. వీరికి వేతనాలకు సంబంధించిన నిధులు మంజూరైన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రోస్టర్ పాయింట్లు, సీనియారిటీలను పరిగణనలోకి తీసుకొని సెలక్షన్ కమిటీ నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తుంది. సెలక్షన్ కమిటీలో జిల్లా వైద్యాధికారి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ఉంటారు. కలెక్టర్ చెప్పినా ముందుగా నియామకాల కోసం కలెక్టర్‌కు ఫైల్ పంపారు. ఇందుకోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ డీసీహెచ్ఎస్ (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) దీనిని పరిగణనలోకి తీసుకోకుండా నే నియామకాల ప్రక్రియ చేపట్టారు. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులను నియమించి సంబంధిత సెక్షన్ ఉద్యోగులకు సంబంధం లేకుండానే నియామక పత్రాలను సైతం ఇచ్చేశారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకరిని, బాన్సువాడ ఆస్పత్రిలో నలుగురిని, జిల్లా ఆస్పత్రిలో ముగ్గురిని నియమించారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా నియామకాలు చేపట్టినందున సదరు వైద్యులకు వేతనాలు ఎలా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలోనూ గత నెలలో ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే వైద్యవిధాన పరిషత్‌లో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చిన వ్యవహారం వివాదాస్పదమైంది. అయినా సదరు అధికారి తీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల అనుమతితోనే ఆస్పత్రులలో వైద్యుల అవసరం ఉంది. అందుకే ఉన్నతాధికారులు, కలెక్టర్ అనుమతి తీసుకునే నియామకాలు చేపట్టాం. ఇంతకు ముందు పీహెచ్సీ లలో చేసినవారినే తీసుకున్నాం. - బాలకృష్ణ, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త