![DSC 1998 Candidates Meets AP CM Jagan at Tadepalli - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/22/ys-jagan_0.jpg.webp?itok=zdnD778v)
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ని సన్మానించారు. 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్థులతోపాటు, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment