uttarandhra districts
-
వైఎస్ జగన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు
సాక్షి,తాడేపల్లి: తనను వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా నియమించటం పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఆదివారం(అక్టోబర్ 27) ఎక్స్(ట్విటర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు.‘ఉతరాంధ్ర ప్రజల బలమైన గొంతుకగా పనిచేస్తా. ప్రజల సమస్యలు పరిష్కరింపజేయడంలో కృషి చేస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే అంశంతో పాటు ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్నమౌలిక సదుపాయాల కల్పన సమస్యల పరిష్కారానికి పనిచేస్తా’అని విజయసాయిరెడ్డి తెలిపారు. Grateful to @YSRCParty President Sri @ysjagan garu for entrusting me with the role of Regional Coordinator for North Andhra, including Vizag. I pledge to be a strong voice for the people of Uttarandhra, ensuring your concerns are heard and addressed. Whether it be the…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 27, 2024 ఇదీ చదవండి: వైఎస్‌జగన్‌కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరింది -
ఉత్తరాంధ్రకు డేంజర్ బెల్స్.. రెడ్ అలర్ట్ జారీ
-
మరికొద్దిగంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేటి నుంచి మరో నాలుగు రోజులు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశ ఉంది. ఆదివారం వరకు మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్ర సమీపంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది.తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. నీటిమట్టం 10.7 అడుగులకు చేరుకుంది. 8 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీగా నీరు బ్యారేజీ నుంచి విడుదల కావడంతో కోనసీమలో కాజ్‌వేలు నీటమునుగుతున్నాయి. గంటి పెదపూడి లంక, కనకాయ లంక కాజ్‌వేలు మీదుగా వరదనీరు ప్రవహిస్తోంది. పలు లంక గ్రామాలకు పడవలపై రాకపోకలు కొనసాగుతున్నాయి.చింతూరు ఏజెన్సీలో వరద భయం మరోసారి మొదలైంది. మూడు రోజులుగా ఏజెన్సీతో పాటు, ఎగువన కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. విఆర్ పురం మండలం పరిధిలో 28 గిరిజన గ్రామాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. కొండవాగులు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
అలర్ట్.. ఉత్తరాంధ్రలో రేపు కూడా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు(గురువారం)కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతాయని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు. రేపు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయన్నారు. నిన్న గరిష్టంగా విజయనగరం జిల్లా గరివిడిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజు అనకాపల్లిలో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని సునంద తెలిపారు. -
థాంక్యూ సీఎం సార్!
సాక్షి, అనకాపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ పక్షపాతి అని, 25 ఏళ్ల నాటి కలను నిజం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.వి.రమణమూర్తి కొనియాడారు. అనకాపల్లి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ‘డీఎస్సీ–1998’ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించారని, ఇది 25 ఏళ్ల నాటి కల అన్నారు. గత ప్రభుత్వాల దృష్టికి అనేకమార్లు తమ సమస్యను తీసుకెళ్లామని.. తామిచ్చిన వినతులను చిత్తు బుట్టలకే పరిమితం చేశారని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,072 మందిని గురువుల స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. (చదవండి: నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి) -
బీసీ మహిళకు చంద్రబాబు షాక్..
సాక్షి, విశాఖపట్నం : నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు నిరూపితమైంది. ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళా నేతకు మధ్యలోనే వెన్నుపోటు పొడిచి.. వేరే వ్యక్తికి టికెట్ ఖరారు చేయడం జిల్లా టీడీపీ నాయకులను సైతం విస్మయానికి గురిచేసింది. టికెట్ కేటాయించిన మూడు నెలలకే అభ్యరి్థని మార్చేశారు. ఆదరాబాదరాగా తొలుత అభ్యర్థిని ప్రకటన చేసి.. డబ్బులు లేవన్న కారణంతో ఆమెకు మొండిచెయ్యి చూపించారు. మహిళలకు పార్టీలో గౌరవం లేదంటూ ఇటీవలే ఆ పార్టీలో ఉన్న మహిళా నేతలు బాహాటంగా చెప్పిన విషయాలు.. తాజా నిర్ణయంతో మరోసారి నిరూపితమైంది. బీసీ మహిళకు షాక్ ఇచ్చి సామాజిక వర్గ ప్రాతిపదికపై ఎంపిక చేశారు. మార్చిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సందడి మొదలైంది. పార్టీ పూర్తిగా పట్టుకోల్పోతున్న నేపథ్యంలో ఎన్ని కుయుక్తులైనా పన్ని.. విజయం సాధించాలని చంద్రబాబు నానా యాతన పడుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘ మంతనాలు, సదస్సులు నిర్వహించిన టీడీపీ.. మూడు నెలల క్రితం మహిళా నేతకు ఖరారు చేసింది. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌తో పాటు మరికొందరు కీలక నేతల్లో ఎవరైనా ఒకరికి టికెట్‌ని కేటాయించాలని భావించారు. పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఈ తరుణంలో ఎన్నికల్లో నిలబడి.. డబ్బులు పోగొట్టుకోలేమంటూ దాదాపు అన్ని సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలంతా తెగేసి చెప్పారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులపై చంద్రబాబు, అచ్చెన్న, బుద్ధా వెంకన్న దృష్టిసారించారు. గతంలో భీమిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ.. ప్రస్తుతం జీవీఎంసీ 2వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న గాడు చిన్ని కుమారి లక్ష్మిని సంప్రదించారు. దాదాపు రూ.4 కోట్ల వరకూ ఖర్చు చేయగలమనీ.. మిగిలిన డబ్బులు పార్టీ సర్దాలని కోరడంతో టికెట్ ఖరారు చేస్తున్నట్లు బాహాటంగా ప్రకటించారు. డబ్బులు లేవంటూ పక్కన పెట్టేశారు ఇప్పటికే పార్టీ ఎన్నికల ఖర్చులంటూ రూ.లక్షల వరకూ సదరు అభ్యర్థి ద్వారా ఖర్చు చేయించారు. ఇటీవల టీడీపీ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత మొత్తం సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్టీ వైఖరిపై విసుగు చెందిన సదరు మహిళా అభ్యర్థి కుటుంబం.. టీడీపీ నేతల ఫోన్లు ఎత్తడం మానేశారు. డబ్బులు సర్దుబాటు చేయలేమని అధిష్టానానికి సమాచారం పంపించారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లయినా పెట్టగలిగిన అభ్యరి్థని చూడాలని చెబితే.. ఇలాంటి వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ పార్టీ ఎన్నికల పరిశీలకులపై మండిపడ్డారు. కోట్లు ఖర్చు చేసైనా ఎమ్మెల్సీ గెలవాల్సిందేననీ, అలాంటి వారికి టికెట్ కేటాయించాలని ఆదేశించారు. దీంతో మరోసారి మదింపు నిర్వహించి రావికమతం ప్రాంతానికి చెందిన డా.వేపాడ చిరంజీవరావును ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి అంటూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. డబ్బులు లేకపోవడం వల్లనే ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రచారంలో దూసుకుపోతున్న సీతంరాజు ఈసారి రాజకీయపక్షాలు ముందుగానే ఎన్నికలపై దృష్టిసారించాయి. వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరిచిన అభ్యరి్థగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేరును ప్రకటించింది. ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని వర్గాల ప్రతినిధులతో భేటీ అవుతూ ప్రచారం పర్వం కొనసాగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ మాధవ్ కొనసాగుతున్నారు. పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యరి్థగా డా.కోరెడ్ల రమాప్రభ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ మహిళకు షాకిచ్చిన బాబు టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో గాడు కుటుంబం షాక్‌కు గురైంది. కనీసం ఒక మాట చెప్పకుండా.. టికెట్‌ని వేరేవాళ్లకు కేటాయించడాన్ని అవమానకరంగా భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టీడీపీలో మహిళలకు గౌరవం లేదన్నది మరోసారి సుస్పష్టమైందని పార్టీలోని కొందరు నేతలు విమర్శిస్తుండటం గమనార్హం. ఇప్పటికే రూ.కోటిన్నర వరకూ ఖర్చు చేయించి.. ఇప్పుడిలా మోసం చేశారంటూ గాడు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ మహిళని పార్టీ అవమానించిందంటూ జిల్లా టీడీపీ నాయకులే చెబుతున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అచ్చెన్నాయుడికి తప్ప ఉత్తరాంధ్రలోని ఏ ఒక్క టీడీపీ నేతకు కూడా తెలియకపోవడం విశేషం. బీసీ వర్గాలకు వెన్నుపోటు పొడిచి.. ఉన్నత వర్గాలకు టికెట్ కేటాయించడం వెనుక చోడవరం టీడీపీ సీనియర్ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. -
ఉత్తరాంధ్రలో ‘పట్టభద్రులు’ పెరిగారు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 9 వరకు గడువు విధించింది. ఈనెల 23న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 2,43,903 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. గతంలో ఎన్నికలు జరిగిన 2017తో పోలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అదనంగా 87,946 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదయ్యారు. అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అనుమతులివ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 50 వేల ఓటర్లు నమోదయ్యే అవకాశం 2017 సమయంలోనూ ఓటర్ల ముసాయిదాను 2016 నవంబర్ 1న ప్రకటించారు. ఆ సమయంలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 1,26,452 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించే సమయంలో దరఖాస్తులు తీసుకోవడంతో అదనంగా 29,505 మంది కొత్త ఓటర్లు చేరారు. తుది జాబితా విడుదల చేసే సమయానికి ఈ ఓటర్లు సంఖ్య 1,55,957కి చేరుకుంది. ఈసారి కూడా అభ్యంతరాల స్వీకరణ సమయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ముసాయిదాలో 2,43, 903 మంది ఓటర్లుండగా.. తుది జాబితా సమయానికి 2.90 లక్షలకు చేరుకుంటుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నమోదైన ఓటర్ల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 297 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా (ఉమ్మడి) 2017 తుది జాబితా ఓటర్లు 2022 ముసాయిదా ఓటర్లు శ్రీకాకుళం 31,313 46,119 విజయనగరం 34,570 71,518 విశాఖపట్నం 90,074 1,26,266 మొత్తం 1,55,957 2,43,903 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన ముసాయిదాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 9లోగా ఫారం–18 ద్వారా తెలపాలి. సంబంధిత ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, డిసిగ్నేటెడ్ అధికారుల ద్వారా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించవచ్చు. కేవలం అభ్యంతరాలు మాత్రమే కాకుండా.. ఇంకా ఎవరైనా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోలేకపోతే వారికి మరో అవకాశం కలి్పస్తున్నాం. 2017లో నమోదైన అన్ని ఓట్లు రద్దు చేశాం. ఇంకా దీనిపై కొందరికి అవగాహన కలగలేదన్నది మా దృష్టికి వచ్చింది. అందుకే దీనిపై మరింత అవగాహన కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా.మల్లికార్జున, కలెక్టర్ -
ఉత్తరాంధ్ర అంతటా అదే నినాదం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మారుమోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ నినాదం ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామంలోనూ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. మూడు రాజధానుల ఏర్పాటుతో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు ఊరూ వాడా ఏకమై మద్దతు పలుకుతోంది. శుక్రవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, భారీ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. విశాఖ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే గర్జిస్తామంటూ మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు నినదించారు. నేడు అన్ని దారులూ విశాఖ గర్జన వైపే - విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వ వార్డులో వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 46, 50, 51వ వార్డుల్లోని డీఎల్బీ గ్రౌండ్, మురళీనగర్ పార్కు, ఈస్ట్ పార్కు వద్ద వాకర్స్‌తో సమావేశమై వికేంద్రీకరణ ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సతీష్, కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు పాల్గొన్నారు. - విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పలు వార్డుల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు శుక్రవారం ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. భీమిలి నియోజవర్గంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో విశాఖ గర్జనకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. పరిపాలనా వికేంద్రీరణకు మద్దతుగా తగరపువలస పీఏసీఎస్‌లో సొసైటీ అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు సమావేశం అయ్యారు. చిట్టివలస బంతాట మైదానం నుంచి ర్యాలీగా విశాఖ గర్జనకు వెళ్లాలని తీర్మానించారు. - భీమిలి, తగరపువలసకు చెందిన వంద మంది ఆటో కార్మికులు భీమిలి నుంచి తగరపువలస వరకు మద్దతుగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పీఎం పాలెం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మాది కూడలి వరకు జగుపిల్ల నరేష్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. - విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో ఎన్ఏడీ యునైటెడ్ క్రైస్ట్ చర్చిలో, పలు విద్యా సంస్థల్లో, ఎన్ఏడీ టాసిన్ మసీదుల్లో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు పలకాలని కోరారు. - పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి రాంపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మూడు మండలాల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి విశాఖ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. - గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి ఆధ్వర్యంలో 65, 66, 67, 68, 75 వార్డుల్లో విద్యార్థులతో, అగనంపూడిలో మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, దేవాన్‌రెడ్డి, పల్లా చినతల్లి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. - అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శుక్రవారం నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ డైరక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కళాశాల విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉపమాక రోడ్డు వరకు ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో విద్యార్థులతో కలసి మానవ హారం నిర్వహించారు. -
అడ్డుకోవడం.. ఐదు నిమిషాల పని
సాక్షి, విశాఖపట్నం: ‘‘విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకానీ ఏ ఒక్కరినో ఇబ్బంది పెట్టాలని, కించపరచాలని కాదు. పాదయాత్రల్ని అడ్డుకోవడం, దండయాత్రలు చేయడం 5నిమిషాల పని. కానీ వ్యవస్థని గౌరవించాలి. శాంతి భద్రతల్ని కాపాడుకోవాలనే సంయమనం పాటిస్తున్నాం. దురదృష్టం ఏమిటంటే 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు, వ్యవహారాల అంశాన్ని 26 జిల్లాలకు ముడిపెట్టి ఆందోళనలు చేయడం బాధ కలిగిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాలను అభివృద్ధి చేయాలని అనుకోవడం ధర్మం. దానికి కట్టుబడి ఉండకపోతే నా మంత్రి పదవికి అర్హుడిని కాదు. రాష్ట్రాభివృద్ధి కోసం దీన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన పాలనా వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలివీ.. పన్నులు, ఆదాయం మట్టిలో పోయాలా? అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి, 5 కోట్ల మందికీ ఫలాలు అందాలి.. ఏ ఒక్కరికీ అసంతృప్తి ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరులు, వసతులపై సమగ్ర అధ్యయనం అనంతరం సీఎం మూడు రాజధానులపై ప్రకటన చేశారు. అమరావతి ఈ రాష్ట్రంలో ఒక భాగమే. అమరావతి రాజధానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదు. రాజధానిని విజయవాడ, గుంటూరు నగర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉంటే రూ.5 వేలు లేదా రూ.10 వేల కోట్లు సమకూర్చుకుంటే సరిపోయేది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు. రూ.1.09 లక్షల కోట్లు అవసరమని గణాంకాలు వెల్లడించాయి. దీనిపై విచారణ జరిపి ఆర్గనైజింగ్ చేసిన కంపెనీకి రూ.400 కోట్లు ఫీజు రూపంలో చెల్లించినట్లు గుర్తించాం. 29 గ్రామాల పరిధిలో కాకుండా మిగిలిన ఏ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టినా 50›% ఖర్చు తగ్గుతుందని అర్థమైంది. ఎందుకింత వ్యత్యాసమని పరిశోధనలు చేస్తే అమరావతిలో పునాదులు తవ్వాలంటే వందల అడుగుల లోతుకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. ప్రజలు కట్టే పన్నులు, ఆదాయం మొత్తం అక్కడి మట్టిలో పోయాల్సి వస్తుంది. దీనిపై అధికారికంగా వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారమే అక్కడ భూముల సమీకరణ చేశారు. అక్కడ అగ్రిమెంట్ రియల్ ఎస్టేట్ మాదిరిగా జరిగింది. గత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కంటే అదనంగా అమరావతి రైతులకు చెల్లింపుల సమయాన్ని సీఎం పొడిగించారు. అమరావతి రైతులు బాబును నిలదీయాలి వీళ్లు చేస్తోంది పాదయాత్రా.. దండయాత్రా..? రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంపాదన కోసం చేస్తున్న యాత్రా? టీడీపీ రాజకీయ యాత్రా? అనేది అర్థం కావడం లేదు. విశాఖను రాజధానిగా చేస్తే మీకొచ్చిన నష్టం ఏమిటి? అప్పటి అగ్రిమెంట్లో అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఏమైనా వాక్యం ఉందా.? మీతో లాలూచీ పడిన చంద్రబాబుని ఈ విషయంపై అమరావతి రైతులు నిలదీయాలి. పాదయాత్రకు స్వాగతం పలుకుతామంటున్న నాయకుల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రలో రాజధాని పెడితే మీకొచ్చిన నష్టం ఏంటి? ఎన్టీఆర్ దయతోనే ఉత్తరాంధ్ర ప్రజలు అన్నం తిన్నారు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.రెండు కిలో బియ్యం ఇచ్చాక ఉత్తరాంధ్ర ప్రజలు అన్నం తిన్నారు. అప్పటివరకూ రాగులే ఆహారం. వైఎస్సార్ సీఎం అయ్యాక జలయజ్ఞంతో పంటలు పండి వలసలు ఆగాయి. గతంలో ఉత్తరాం«ధ్ర రైల్వే స్టేషన్లు వలస వెళ్లే కూలీలతో కిటకిటలాడేవి. వైఎస్సార్ నిర్ణయాలతో వలసలు ఆగాయి. ఇందులో ఏ ఒక్కటి అబద్ధం అయినా నేను తలదించుకుంటా. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మన తల్లిని మనం అవమానించుకున్నట్లే. మేం కూడా మీలాగే ఆలోచిస్తే.. చంద్రబాబు ప్రతి కార్యక్రమం ఆయన కుటుంబం, వ్యక్తిగత లబ్ధి కోసమే చేస్తారు. వైఎస్సార్, వైఎస్ జగన్ సామాజిక అభివృద్ధి కోసమే పథకాలు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చేతకానివాళ్లని భావించొద్దు. ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని సంఘాలకూ లేఖలు రాయాలి. ప్రతి వారం, 15 రోజులకు సమావేశం నిర్వహించి దానికనుగుణంగా పోరాటం కొనసాగించాలి. 500 కుటుంబాల కోసం ఈ రాష్ట్ర సంపదని తాకట్టు పెట్టాలనడం భావ్యం కాదు. శాసన రాజధానిని అమరావతిలో కొనసాగిస్తే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? విశాఖలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ముంబైని తలదన్నే నగరంలా అభివృద్ధి చెందుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు దుర్మార్గంగా ఆలోచనలు చేస్తున్నాయి. మేం కూడా మీలాంటి ఆలోచనలతో ఉంటే విశాఖలో సగం ప్రాంతం మా పరిధిలోనే ఉండేది. హైకోర్టు బెంచ్ విశాఖలో ఏర్పాటు చేయాలన్నది ఇప్పటి డిమాండ్ కాదు. దీన్ని కూడా రాజధాని ఏర్పాటైన తర్వాత పెడతాం. రాజకీయాలకు అతీతంగా ర్యాలీని త్వరలోనే నిర్వహిద్దాం. న్యాయమూర్తి మాటలు బాధాకరం.. ఇటీవల రాజధానిపై ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగానూ, బాధాకరంగా ఉన్నాయి. రాజ్యాంగం బద్ధంగా మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితులకు మీలాంటి వారు కూడా కారణమే. ఉన్నత పదవుల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారీతిగా మాట్లాడకూడదు. ఇప్పుడు పదవుల్లో ఉండొచ్చు. కానీ మన గతం కూడా గుర్తుంచుకోవాలి. పత్రికా యాజమాన్యాలు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం నుంచే పెద్దవాళ్లయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వర్గ విబేధాలు, ప్రాంతీయ విబేధాలు తీసుకురావొద్దని హెచ్చరిస్తున్నాం.