
సీఎం జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలుకుతున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంగ్లండ్ రాజధాని లండన్‌కు బయలుదేరి వెళ్లారు.
అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ పర్యటనకు వెళుతున్న సీఎం జగన్ దంపతులు తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.