
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని మరోసారి నిరూపించారు. బీసీని అయిన నన్ను ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీని చేశారు నన్ను. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసే బాధ్యత ఇచ్చారు. బీసీలను ఆదుకోవడానికి ఏం చేయాలో అధ్యయనం చేయమన్నారు. బీసీలకు ఎవ‍్వరూ ఇవ్వనటువంటి డిక్లరేషన్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారు. అంతేకాదు బీసీ గర్జనలోనే వైఎస్సార్ సీపీకి వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీని ఇచ్చారు. ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.’ అని అన్నారు.
నామినేషన్ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ముస్తఫా, ఆదిమూలం సురేష్, మేక ప్రతాప్ అప్పారావు, కంబల జోగులు, రక్షణ నిధి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జంకే వెంకట రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment